E-Paper
Advertisement

Romantic thriller OTT : పూల తోటలో మృతదేహాలు… ప్రేమలో పడ్డ అమ్మాయిని కూడా… ఈ ఆరు ఎపిసోడ్‌ల క్రైమ్ థ్రిల్లర్ భీభత్సమే

Romantic thriller OTT : పూల తోటలో మృతదేహాలు… ప్రేమలో పడ్డ అమ్మాయిని కూడా… ఈ ఆరు ఎపిసోడ్‌ల క్రైమ్ థ్రిల్లర్ భీభత్సమే
Advertisement

Romantic thriller OTT : సైకో కిల్లర్ కథలు ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉంటున్నాయి. ఇవి ఇచ్చే ఉత్కంఠతను ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే గత ఏడాది వచ్చిన సిరీస్ ఈ సైకో సిరీస్ లకు భిన్నంగా ఉంటుంది. ఈ సిరీస్ ప్రధానంగా రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వచ్చింది.
ఒక వ్యక్తికి చిన్నప్పుడు జరిగిన ప్రమాదం వల్ల ఎమోషన్స్ ఉండవు. ఒక నర్సరీ ముసుగులో కిరాయి హత్యలు చేసేటప్పుడు ఒక టీచర్‌తో ప్రేమలో పడటంతో కథ మలుపు తిరుగుతుంది. సిరీస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సిరీస్ ఇది. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ స్పానిష్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘ది గార్డనర్’ (The Gardener). ఈ సిరీస్ ను మిగ్యుల్ సాజ్ కారల్ రూపొందించారు. ఇది 2025 ఏప్రిల్ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇందులో ఆల్వారో రికో, సిసిలియా సువారెజ్, కాటాలినా సోపెలానా ప్రధాన పాత్రల్లో నటించారు. మొత్తం 6 ఎపిసోడ్‌ల లిమిటెడ్ సిరీస్. మైకెల్ రు, రాఫా మోంటెసినోస్ అనే ఇద్దరు దర్శకులుగా పని చేశారు. మొత్తం 6 ఎపిసోడ్‌లలో, చెరో 3 ఎపిసోడ్‌లకు వీళ్ళు దర్శకత్వం వహించారు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఎల్మర్ అనే ఒక కుర్రాడికి చిన్నప్పుడు జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల ఒక విచిత్రమిన సమస్య వస్తుంది. మనుషులకు ఉండే కోపం, బాధ, ప్రేమ వంటి ఎమోషన్స్ ఏవీ అతనికి ఉండవు. దీన్నే అడ్వాంటేజ్‌గా తీసుకుని, అతని తల్లి ఒక నర్సరీ ముసుగులో కిరాయి హత్యలు చేసే బిజినెస్ నడుపుతుంటుంది. ఎల్మర్ తన తల్లి చెప్పినట్లు సైలెంట్‌గా మనుషులను చంపేస్తూ ‘గార్డనర్’ (తోటమాలి) లాగా పనిచేస్తుంటాడు. అయితే ఒకరోజు వయొలెటా అనే టీచర్‌ను చంపమని ఎల్మర్‌కి ఆర్డర్ వస్తుంది. ఆమెను చంపడానికి వెళ్ళిన ఎల్మర్, మొదటిసారి ఏదో తెలియని ఫీలింగ్‌కి లోనై ఆమెతో ప్రేమలో పడతాడు.

ఇక నుంచి కథ మరోలా టర్న్ తీసుకుంటుంది. తన కొడుకు ఇలా మారిపోవడం చూసి తల్లి అతన్ని అడ్డుకోవాలని చూస్తుంది. అటు పోలీసులు, ఇటు తన సొంత తల్లి మధ్య ఎల్మర్ తన ప్రేమను ఎలా కాపాడుకున్నాడు ? ఆ కిల్లర్ లైఫ్ నుండి బయటపడ్డాడా ? ఈ సిరీస్ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : బయట శత్రువులే కానీ లోపల మాత్రం మ్యాటర్ వేరే… ఓటిటిలో దుమ్ము దులుపుతున్న రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా

Tags

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×