చిత్రం : ది కేరళ స్టోరీ 2
నటీనటులు : ఉల్కా గుప్తా, అదితి బాటియా, ఐశ్వర్య ఓజా, సుమిత్ గహ్లా వర్, అర్జున్ సింగ్ తదితరులు..
రచన : విపుల్ అమృత్ షా
దర్శకత్వం : కామక్య నారాయణ సింగ్
మ్యూజిక్ : మన్నన్ షా
రిలీజ్ డేట్ : 27 ఫిబ్రవరి 2026
గతంలో వచ్చిన ది కేరళ స్టోరీ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. డిఫరెంట్ స్టోరీగా వచ్చిన ఈ మూవీ విడుదలైన మొదటి రోజు నుంచి వివాదాలకు కేరాఫ్ గా నిలిచింది.. వైపు వివాదాలు పలకరించిన సరే సినిమా మాత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఆ మూవీకి సీక్వెల్ గా ఇప్పుడు ది కేరళ స్టోరీ 2 రిలీజ్ అయింది.. ఈ మూవీ రిలీజ్ కి ముందు కూడా వివాదాలు తో సహవాసం చేసింది. కొన్ని అభ్యంతరకరపు సీన్లు ఉన్నాయంటూ కేరళ హైకోర్టు సినిమాని నిలిపివేయాలని స్టే ఇచ్చింది. తర్వాత మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమా ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది.. సినిమా స్టోరీ ఎలా ఉందో ఒకసారి రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం…
తమ కాళ్ళ మీద తామే నిలబడాలన్న స్వతంత్ర భావాలున్న అమ్మాయిల స్టోరీ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.. సురేఖ, దివ్య, నేహా అనే ముగ్గురు అమ్మాయిలు స్నేహితులుగా ఉంటారు.. కేరళకు చెందిన సురేఖ (ఉల్కా గుప్తా ) యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అయితే ఆ రాష్ట్రంలోని ప్రముఖ జర్నలిస్ట్ అయినా సలీంతో పరిచయం ఏర్పడుతుంది. పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తుంటారు. వీరిలో దివ్యకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గారు రాణించాలన్న ఒక కోరిక కలుగుతుంది. ఎలాగైనా సరే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవ్వాలని ఆమె చేసే పిచ్చి ప్రయత్నాలకు తల్లిదండ్రులు ఎప్పుడూ సపోర్ట్ గా నిలవరు. ఇలాంటి క్రమంలో రషీద్ అని ఒక వ్యక్తి తనని ప్రేమిస్తున్నానని, తాను అనుకున్నది సాధించడానికి జీవితం లో ఎప్పుడూ వెనకడుగు వేయకుండా తోడుగా ఉంటానని మాట ఇస్తాడు. మాటతో ఆమె అతన్ని ప్రేమిస్తుంది. ఇక నేహా రాష్ట్రస్థాయి పోటీలో జరగబోతున్న జావలిన్ త్రోలో పాల్గొనాలని ఎంతో ఆశగా ఉంటుంది. ఆమె కోరికను తీర్చడానికి నేను ఒక మంచి ట్రైనర్ దగ్గర నిన్ను జాయిన్ చేస్తాను.. నువ్వు పోటీల్లో ఖచ్చితంగా పాల్గొనడంతో పాటుగా విజయం అందుకుంటావు అని ఫైజన్ అనే వ్యక్తి ఆమెకు దగ్గర అవుతాడు.. ఆ ముగ్గురు కూడా ఒక్కొక్క విధంగా ప్రేమలో పడతారు. ఈ కథ మొత్తం వీళ్ళు ముగ్గురి ప్రేమ కథ చుట్టే తిరుగుతుంది..
తమ ఆశలని నెరవేర్చుకునేందుకు ముగ్గురు కూడా తల్లిదండ్రులను వదిలేసి వెళ్లిపోతారు. రోజులు గడుస్తున్న కొద్ది వాళ్ళ ముగ్గురు ప్రేమలో మోసపోయామని తెలుసుకొని బాధపడతారు. ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేసి మతం మార్చి విదేశాలకి అమ్మేస్తే స్టోరీ గా కేరళ స్టోరీ 2 ఉంటుంది. ప్రేమ పేరుతో అమ్మాయిలని దారుణంగా మోసం చేసి ఆ తర్వాత మతం మార్చి కొందరు యువకులు ఎలాంటి పనులు చేస్తున్నారు అన్నది డైరెక్టర్ ఈ సినిమాలో చూపించిన స్టోరీ.. తమ జీవితంలో ఏవో సాధించాలని కలలు కంటున్నా అమ్మాయిలగా జీవితంలోకి కొందరు అబ్బాయిలు రావడంతో స్టోరీ మలుపు తిరుగుతుంది. నమ్మించి మోసం చేయడంతో పాటుగా మతం మార్చి వాళ్ళని విదేశాలకు అమ్మేసే గ్యాంగ్ వల్ల ఎంతమంది అమ్మాయిలు మోసపోయారు అన్నది ఈ స్టోరీ లైన్. తల్లిదండ్రుల మాటని పెడచెవిని పెట్టిన అమ్మాయిలు పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. అయితే ఈ స్టోరీ మొత్తంలో కొంతవరకు నిజం ఉంటే, కొంత కల్పితాలను ఏర్పాటు చేశారు.. ఒక్క మాటలో చెప్పాలంటే గుడ్డిగా నమ్మి తమని తామే మోసపోతున్న అమ్మాయిల జీవితాన్ని ఈ సినిమాలో కళ్ళకి కట్టినట్లు చూపించారు..
అబ్బాయిల చేతిలో మోసపోయిన అమ్మాయిలుగా ముగ్గురు ఎవరికి వారే అన్నట్లు నటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు.. ఇక ఇందులో నటించిన ప్రతి ఒక్కరు కూడా జీవించి నటించారు. నటనపరంగా ప్రతి ఒక్కరూ పోటీపడి మరి నటించడంతో ఈ సినిమాకు మంచి టాక్ వచ్చిందని తెలుస్తుంది.
టెక్నికల్ విషయానికొస్తే… సినిమా మొత్తం ఒక టెక్నికల్ పరంగా చూపించారు. వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చిన ముగ్గురు అమ్మాయిల జీవితాలు ఎలా ఉంటాయి అన్నది ఇందులో హైలెట్ చేసి చూపించారు.. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా జనాలని బాగా ఆకట్టుకుందనే చెప్పాలి.. ప్రతి సన్నివేశం కూడా వెన్నులో వణుకు పుట్టించే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఉండడంతో సినిమాకి హైలైట్ గా నిలిచింది..
నటీనటులు
స్టోరీ
క్లైమాక్స్
ఒక్క పాయింట్ తో స్టోరీ
కొన్ని ల్యాగ్ సీన్లు
చివరగా... తల్లిదండ్రుల మాటని పెడచెవిన పెట్టిన అమ్మాయిల జీవితాలు ఎలా ఉంటాయి అన్నది స్టోరీ..