E-Paper
Advertisement

Crime Drama OTT : లేడీ పోలీస్ ఆఫీసర్ పై ప్రేమతో అబ్బాయిగా మారే అమ్మాయి… బుర్రబద్దలయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

Crime Drama OTT : లేడీ పోలీస్ ఆఫీసర్ పై ప్రేమతో అబ్బాయిగా మారే అమ్మాయి… బుర్రబద్దలయ్యే సస్పెన్స్ థ్రిల్లర్
Advertisement

Crime Drama OTT :ఓటీటీలలో క్రైమ్ డ్రామాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. మర్డర్ మిస్టరీ నుంచి సీరియల్ కిల్లర్ల వరకు… ఇలాంటి సినిమాలు అంటే చెవి కోసుకుంటారు మూవీ లవర్స్. క్రేజీ ట్విస్టులతో ఎంగేజింగ్ గా ఉండే ఈ జానర్ కి మీరు కూడా అభిమానులా ? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. మరి ఇంతకీ ఈ మూవీని ఎక్కడ చూడొచ్చు ? సినిమా కథ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్

బ్యాక్ టు బ్యాక్ ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేసే ఈ మూవీ పేరు ‘తిట్టం ఇరందు’ (Thittam Irandu). విగ్నేష్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దినేష్ కన్నన్, వినోద్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ అతిర అనే 25 ఏళ్ల పోలీస్ ఆఫీసర్ గా నటించింది. అలాగే అతిరను ప్రేమలో పడేసే అర్జున్ గా సుభాష్ సెల్వం నటించాడు. సూర్య పాత్ర అతిర చిన్ననాటి స్నేహితురాలుగా కనిపించింది. సినిమాలో వీళ్ళ ముగ్గురివే కీ రోల్స్. ఇందులో చాలా సున్నితమైన అంశాన్ని మేకర్స్ అద్భుతంగా తెరపై చిత్రీకరించారు. పెద్దగా వైలెన్స్ లేకుండానే సీరియల్ కిల్లర్ కథనంతో క్లైమాక్స్ వరకు సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తూ, చివర్లో సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం ఈ మూవీ సోనీ లివ్ (Sony Liv) ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది.

Advertisement

Read Also : ‘మహారాజా’ ‘దృశ్యం’ను మించిన ట్విస్టులు… కదిలించే క్లైమాక్స్… IMDbలో 7.1 రేటింగ్

 స్టోరీలోకి వెళ్తే… 

అతిర అనే అమ్మాయి లేడీ పోలీస్ ఆఫీసర్ గా పని చేస్తుంది. ఆవిడ పని మీద చెన్నైకి వెళ్ళినప్పుడు అర్జున్ అనే ఒక కొత్త వ్యక్తిని కలుస్తుంది. ఇద్దరి మధ్య నెమ్మదిగా స్నేహం మొదలవుతుంది. కొద్దికాలంలోనే ఆ స్నేహం కాస్త ప్రేమకి దారి తీస్తుంది. మరోవైపు అతిర స్నేహితురాలు సూర్య మిస్ అవుతుంది. ఆమె కనిపించకుండా పోయిందంటూ సూర్య భర్త ఇచ్చిన కంప్లైంట్ తో రంగంలోకి దిగుతుంది అతిర. తన చిన్నప్పటి స్నేహితురాలు కావడంతో ఈ కేసు మీద ఎక్కువగా దృష్టి పెడుతుంది. అయితే ఇన్వెస్టిగేషన్లో భాగంగా సూర్యను ఎవరైనా చంపేసారేమోనని అనుమానం కలుగుతుంది అతిరకి.

Advertisement

ఇక దర్యాప్తులో భాగంగా ఆమె చుట్టూ ఉన్నవారందరినీ సస్పెక్స్ట్ గా చూస్తుంది హీరోయిన్. ముఖ్యంగా సూర్య భర్త కిషోర్ ను మెయిన్ సస్పెక్ట్ గా తీసుకుంటుంది. ఇదిలా ఉండగానే మరో హత్య జరుగుతుంది. దానికి సూర్య హత్యతో సంబంధం ఉన్నట్టు అతిర కనిపెడుతుంది. ఇక చివర్లో అతిరకు ఊహించని షాక్ తగులుతుంది. ఇంతకీ హీరోయిన్ చిన్నప్పటి స్నేహితురాలు ఏమైంది ? ఆమె భర్త కిషోర్ సూర్యని చంపాడా ? అర్జున్ తో హీరోయిన్ ప్రేమ వ్యవహారం ఎక్కడికి దారి తీసింది ? చివరికి హీరోయిన్ సీరియల్ కిల్లర్ని పట్టుకోగలిగిందా? ఆ ఊహించని క్లైమాక్స్ కథ ఏంటి ? అన్నది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×