E-Paper
Advertisement

Crime drama OTT: 47 అవార్డులతో ప్రశంసలు… అప్పు ఇచ్చిన బ్యాంకుకే కన్నం… చూసే కొద్దీ చూడాలనిపించే మూవీ

Crime drama OTT: 47 అవార్డులతో ప్రశంసలు… అప్పు ఇచ్చిన బ్యాంకుకే కన్నం… చూసే కొద్దీ చూడాలనిపించే మూవీ
Advertisement

Crime drama OTT: ఈరోజుల్లో ఎక్కువగా క్రైమ్ స్టోరీ లను ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు ప్రేక్షకులు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా ఈ కంటెంట్ తోనే ట్రెండింగ్ లో కూడా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఒక మూవీ గురించి చెప్పుకోవాల్సిందే. ఈ హాలీవుడ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఆస్కార్ కి కూడా నామినేట్ అయింది. దాదాపు 47 కు పైగా ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అవార్డులను అందుకుంది. మంచి గ్రిప్పింగ్ ఉన్న స్టోరీ ఇది. బ్యాంక్ లో తాకట్టు ఉన్న పొలాన్ని విడిపించుకోవడానికి, ఇద్దరు అన్నదమ్ములు అదే బ్యాంకుకి కన్నం వేస్తారు. క్లైమాక్స్ వరకు ఈ స్టోరీ ఆసక్తిగా సాగుతూ ఉంటుంది.

ఎక్కాడ చూడచ్చు అంటే

ఈ అమెరికన్ క్రైమ్ డ్రామా మూవీ పేరు ‘హెల్ ఆర్ హై వాటర్ (Hell or High Water). ఈ చిత్రానికి డేవిడ్ మెకెంజీ దర్శకత్వం వహించగా, టేలర్ షెరిడాన్ కథను అందించారు. క్రిస్ పైన్, బెన్ ఫోస్టర్, మరియు జెఫ్ బ్రిడ్జెస్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. జెఫ్ బ్రిడ్జెస్ రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న టెక్సాస్ రేంజర్ పాత్రలో ఆకట్టుకున్నారు. 2016 ఆగస్టు 12న యునైటెడ్ స్టేట్స్‌ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ దీనిని ఆ సంవత్సరంలోని 10 బెస్ట్ సినిమాలలో ఒకటిగా ఎంపిక చేసింది. అంతేకాకుండా ఇది ఉత్తమ చిత్రంతో సహా నాలుగు ఆస్కార్ నామినేషన్లను పొందింది. సుమారు $12 మిలియన్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా $37.9 మిలియన్లకు పైగా వసూలు చేసి ఘనవిజయం సాధించింది. ఈ సినిమాను ప్రస్తుతం Netflix, Prime video ప్లాట్‌ఫామ్‌లలో చూడవచ్చు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

టెక్సాస్‌లోని గ్రామీణ ప్రాంతంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే ఇద్దరు సోదరుల కథ ఇది. టోబీ అనే వ్యక్తి తన భార్యకు, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని తపన పడుతుంటాడు. అయితే వాళ్ల అమ్మ చనిపోయాక, వాళ్ళకు చెందిన పొలం, బ్యాంకు అప్పుల వల్ల జప్తు అయ్యే పరిస్థితికి చేరుతుంది. అయితే ఆ భూమిలో విలువైన ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయని టోబీకి తెలుస్తుంది. ఎలాగైనా ఆ అప్పు తీర్చి భూమిని దక్కించుకోవాలని, తన అన్న టానర్ సహాయం కోరతాడు. టానర్ గతంలో చేసిన ఒక నేరానికి జైలుకు వెళ్ళి ఈ సమయంలో బయటకు వస్తాడు. పైగా తన తమ్ముడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండే రకం.

ఇక వీరిద్దరూ కలిసి ఒక పక్కా ప్లాన్ వేస్తారు. పెద్ద పెద్ద బ్యాంకుల జోలికి వెళ్లకుండా, ఊర్లలో ఉండే చిన్న చిన్న బ్యాంకులనే టార్గెట్ చేస్తారు. పెద్ద నోట్లు కాకుండా కేవలం చిన్న నోట్లను మాత్రమే దొంగతనం చేస్తారు. దీన వల్ల పోలీసులు సులభంగా ట్రాక్ చేయలేరని అనుకుంటారు. ముఖ్యంగా ఏ బ్యాంక్ అయితే వాళ్ళ భూమిని లాక్కోవాలని చూస్తుందో, అదే బ్యాంకులో దొంగతనం చేసి, ఆ డబ్బుతోనే అదే బ్యాంకులో అప్పు తీర్చాలని ప్లాన్ చేస్తారు. ఈ దొంగతనాల్లో టానర్ తన ఆవేశంతో అప్పుడప్పుడు రిస్క్ తీసుకుంటున్నా, టోబీ మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాడు.

Advertisement

మరోవైపు రిటైర్మెంట్‌కు సరిగ్గా ఒక వారం ముందు ఉన్న మార్కస్ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెడతాడు. దొంగలు చేస్తున్న పద్ధతిని బట్టి వాళ్ళు ప్రొఫెషనల్స్ కాదని, ఏదో బలమైన కారణంతోనే చేస్తున్నారని గ్రహిస్తాడు. ఇక ఈ క్లైమాక్స్ కూడా ఊహించని షాక్ ఇస్తుంది. చివరికి మార్కస్ ఆ బ్రదర్స్ ని పట్టుకుంటాడా ? వాళ్ళు బ్యాంక్ అప్పు తీరుస్తారా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : అమెజాన్ అడవుల్లో హడలెత్తించే అడ్వెంచర్… ప్రాణాలు అరచేతిలో… ఉత్కంఠ రేపే ప్రతీ సీన్

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×