E-Paper
Advertisement

Survival thriller OTT: అమెజాన్ అడవుల్లో హడలెత్తించే అడ్వెంచర్… ప్రాణాలు అరచేతిలో… ఉత్కంఠ రేపే ప్రతీ సీన్

Survival thriller OTT: అమెజాన్ అడవుల్లో హడలెత్తించే అడ్వెంచర్… ప్రాణాలు అరచేతిలో… ఉత్కంఠ రేపే ప్రతీ సీన్
Advertisement

Survival thriller OTT : మామూలుగానే ఎవరూ లేని చోట ఒంటరిగా ఉండటం కష్టంగా ఉంటుంది. అలాంటిది అమెజాన్ అడవుల్లో దారి తప్పి, దాదాపు మూడు వారాల పాటు ఒంటరిగా మృత్యువుతో పోరాడినాడు ఓ వ్యక్తి. ఈ నిజ జీవిత కథ ఆధారంగా ఓ మూవీ కూడా తెరకెక్కింది.1981లో అమెజాన్ అడవుల్లో ఇజ్రాయెల్ యాత్రికుడు యోస్సీ గిన్స్‌బర్గ్ ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

యూట్యూబ్ లో స్ట్రీమింగ్

ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘జంగిల్’ (Jungle). గ్రెగ్ మెక్లీన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రలో హ్యారీ పోటర్ ఫేమ్ డేనియల్ రాడ్‌క్లిఫ్ నటించగా, ఇతర ముఖ్య పాత్రల్లో థామస్ క్రెట్స్‌మన్, అలెక్స్ రస్సెల్, జోయెల్ జాక్సన్ నటించారు. దీనిని ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లోని గోల్డ్ కోస్ట్‌లోని మౌంట్ టాంబోరిన్‌ ప్రాంతంలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime Video, youtube లో అందుబాటులో ఉంది. తెలుగులో డబ్బింగ్ లో కుడా ఈ సినిమాను చూడవచ్చు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

యోస్సీ అనే కుర్రాడు కొత్త ప్రదేశాలు చూడాలనే ఆశతో అమెజాన్ అడవుల్లోకి వెళ్తాడు. అయితే అక్కడ ఒక కొత్త వ్యక్తి పరిచయమై, అడవి లోపల బంగారం ఉంటుందని లేని పోని మాటలు చెప్పి అతని వెంట తీసుకెళ్తాడు. దీంతో యోస్సీ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆ అపరిచితుడి వెంట దట్టమైన అడవిలోకి ప్రయాణం మొదలుపెడతాడు. కానీ అడవిలో పరిస్థితులు అనుకున్నంత సులభంగా ఉండవు. వాతావరణం అనుకూలించకపోవడంతో వాళ్ళు విడిపోవాల్సి వస్తుంది. యోస్సీ తన స్నేహితుల నుంచి విడిపోయి, ఒంటరిగా అడవిలో చిక్కుకుపోతాడు.

ఆ తరువాత ఏమీ లేని ఆ కారడవిలో యోస్సీ మూడు వారాల పాటు మృత్యువుతో పోరాడతాడు. తిండి లేక, వర్షంలో తడుస్తూ, క్రూర మృగాల నుండి తప్పుకుంటూ అతను పడే కష్టాలు చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. కాళ్ళకు ఇన్ఫెక్షన్లు వచ్చినా, ఆకలితో శరీరం సహకరించకపోయినా, ప్రాణాల మీద ఆశతో అతను ముందుకు సాగుతాడు. చివరిగా యోస్సీ ప్రాణాలతో బయట పడ్డాడా ? తన స్నేహితులను కనిపెట్టాడా ? అనేది చాలా ఎమోషనల్‌గా ఉంటుంది.

Advertisement

Read Also : తుప్పు పట్టిన కత్తులతో కాలక్షేపం … కట్ చేస్తే మైండ్ బ్లోయింగ్ మిషన్… దుమ్ము లేపే ఫైట్స్

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×