E-Paper
Advertisement

Suspense Thriller OTT : ‘మహారాజా’ ‘దృశ్యం’ను మించిన ట్విస్టులు… కదిలించే క్లైమాక్స్… IMDbలో 7.1 రేటింగ్

Suspense Thriller OTT : ‘మహారాజా’ ‘దృశ్యం’ను మించిన ట్విస్టులు… కదిలించే క్లైమాక్స్… IMDbలో 7.1 రేటింగ్
Advertisement

Suspense Thriller OTT : థియేటర్లలో కంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లను చూసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటితరం ప్రేక్షకులు ప్రతి వారం కొత్ కొత్త కంటెంట్ కోసం వెతుకుతున్నారు.అలాంటి వారి కోసమే ఈ మూవీ సజెషన్. ఇందులో ‘మహారాజా’, ‘దృశ్యం’ వంటి సినిమాలను మించిన ట్విస్టులు ఉంటాయి ఇందులో. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీ పేరేంటి ? ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం పదండి.

సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్

గత కొన్ని సంవత్సరాల నుంచి ట్విస్టులతో మైండ్ బెండయ్యే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో ఆడియన్స్ ను తెగ అలరిస్తోంది మాలీవుడ్ ఇండస్ట్రి. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీ కూడా మలయాళం థ్రిల్లరే. ఆ మూవీ పేరే “మీషా”(Meesha). IMDb లో 7.1 రేటింగ్ ఉన్న ఈ మూవీకి ఎమ్సీ జోసెఫ్ డైరెక్టర్‌ గా వ్యవహరించారు. మితున్ (కతీర్), ఆనందు (హక్కీమ్ షా), ఇమోధ్ (షైన్ టామ్ చాకో) ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ద్వారా ప్రముఖ నటుడు కథిర్ మలయాళం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇదే ఆయనకు మొదటి మలయాళ సినిమా కాగా, ఇందులో కథిర్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. మరొక కీలక పాత్రలో షైన్ టామ్ చాకో కన్పించగా, ఈ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ సినిమాలో హైలెట్ గా ఉంటాయి. 2025 ఆగస్టు 1న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం సన్ నెక్స్ట్ (Sun NXT) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also :  సినీయర్ అమ్మాయితో లవ్… ఫ్రెష్ ఫీల్ ఇచ్చే రొమాంటిక్ స్టోరీ… లవ్ లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

స్టోరీలోకి వెళ్తే…

ఈ సినిమా మొత్తం నాన్-లీనియర్ స్ట్రక్చర్‌లో ముందుకు సాగుతుంది. మిథున్ అనే వ్యక్తి ఫారెస్ట్ వార్డెన్ గా పని చేస్తాడు. ఆయన తన పాత స్నేహితులను కలవాలని ప్లాన్ చేస్తాడు. అందులో భాగంగా రీయూనియన్ పేరుతో అందరికీ ఆహ్వానాలు పంపుతాడు. మొత్తం ఆరుగురు ఫ్రెండ్స్ ను పిలుస్తాడు. అడవిలో ఉన్న గెస్ట్ హౌస్ లోనే పార్టీ ఏర్పాటు చేస్తాడు. అయితే ఈ సడన్ ఇన్విటేషన్ తో వాళ్ళు కంగారు పడతారు. అయినా సరే ఫ్రెండ్ ని కలవడానికి వెళతారు. కానీ అక్కడికి వెళ్లాకే వాళ్ళకు అసలు విషయం అర్థం అవుతుంది. ఇప్పుడు కథ ఊహించని టర్న్ తీసుకుంటుంది. మరి ఈ సర్వైవల్ గేమ్ నుంచి వాళ్ళు బయట పడ్డారా ? అక్కడ పొంచి ఉన్న ప్రమాదం ఏంటి ? అసలు ఆ ఫారెస్ట్ వార్డెన్ ఎందుకు ఫ్రెండ్స్ ను పిలిచాడు ? కేక పెట్టించే ఆ క్లైమాక్స్ ఏంటి ? అన్నది తెరపై చూడాల్సిందే. ఒకవేళ ఇప్పటిదాకా ఈ సినిమాను గనక చూడకపోతే థ్రిల్లర్ మూవీ లవర్స్ ఒక మాస్టర్ పీస్ ను మిస్ అయినట్టే. కాబట్టి వెంటనే ఓ లుక్కేయండి.

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×