E-Paper
Advertisement

వెన్నులో వణుకు పుట్టించే వేట… నేరగాళ్లకు నరకం నేరుగా చూపించే స్టూడెంట్… ఓటీటీలో ఉత్కంఠ భరితమైన థ్రిల్లర్

వెన్నులో వణుకు పుట్టించే వేట… నేరగాళ్లకు నరకం నేరుగా చూపించే స్టూడెంట్… ఓటీటీలో ఉత్కంఠ భరితమైన థ్రిల్లర్
Advertisement

Crime Thriller OTT : క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లు ప్రేక్షకులు చూసేందుకు ఇప్పుడు చాలా ఇష్టపడుతున్నారు. ఇక కొరియెన్ కంటెంట్ ను అస్సలు వదలటం లేదు. డిఫరెంట్ కంటెంట్ తో వచ్చిందంటే ఆ సిరీస్ టాప్ ట్రెండింగ్ లో ఉండాల్సిందే. ఇప్పుడు మనం ఐయండిబిలో టాప్ రేటింగ్ తో నడుస్తున్న ఒక సిరీస్ గురించి చెప్పుకోబోతున్నాం. ఇది ఒక కాలేజ్ విద్యార్థి అనుకోకుండా సీరియల్ కిల్లర్‌ గా మారడంతో ఊహించని మలుపులు ఇస్తుంది. దీని స్టైలిష్ మేకింగ్, వేగవంతమైన స్క్రీన్ ప్లే తో ఈ సిరీస్, ప్రేక్షకులని చివరి వరకు ఉత్కంఠకు గురిచేస్తుంది. ఒక్క ఎపిసోడ్ చూస్తే ఇక మిగతా ఎపిసోడ్ ను అస్సలు చూడకుండా వదలలేరు.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

ఈ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఎ కిల్లర్ పారడాక్స్’ (A Killer Paradox)’. ఇది కొమాబి అనే రచయిత రాసిన పాపులర్ వెబ్‌టూన్ ఆధారంగా రూపొందింది. దీనిని ‘స్ట్రేంజర్స్ ఫ్రమ్ హెల్’ ఫేమ్ దర్శకుడు లీ చాంగ్-హీ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. విమర్శకుల నుండి ఈ సిరీస్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా ‘రోటెన్ టొమాటోస్’లో దీనికి 100% స్కోర్ రావడం విశేషం. నటుడు చోయ్ వూ-శిక్ తన పాత్రలో ఒదిగిపోగా, డిటెక్టివ్‌గా చేసిన సన్ సుక్-కు నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సిరీస్ 2025 డైరెక్టర్స్ కట్ అవార్డ్స్‌లో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు వంటి ప్రధాన విభాగాల్లో అవార్డులను గెలుచుకున్నారు. అలాగే ఏషియా కంటెంట్స్ అవార్డ్స్‌లో కూడా దీనికి గుర్తింపు లభించింది. ఎనిమిది ఎపిసోడ్ లు ఉన్న ఈ సిరీస్ 2024 ఫిబ్రవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

టాంగ్ అనే ఒక కాలేజీ కుర్రాడు పొరపాటున ఒక వ్యక్తిని చంపేస్తాడు. తను చేసిన పనికి భయపడిపోయి పోలీసులకు దొరికిపోతానని ఆందోళన చెందుతుంటే, అతనికి ఒక వింత విషయం తెలుస్తుంది. తను చంపిన వ్యక్తి గతంలో ఎన్నో నేరాలు చేసిన క్రూరమైన నేరస్థుడని అర్థమవుతుంది. చిత్రంగా అతను హత్య చేసిన ప్రదేశంలో ఏ సాక్ష్యం కూడా పోలీసులకు దొరకదు. ఆ సంఘటన తర్వాత, లీ టాంగ్‌కు తనలో ఒక వింత శక్తి ఉందని తెలుస్తుంది. సమాజంలో నేరాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న వాళ్ళను అతను గుర్తించగలడు. దీంతో తనే అలాంటి నేరస్థులను చంపడం మొదలుపెడతాడు. అతను చంపే ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఘోరమైన నేరం చేసినవారే అయివుంటారు.

ఇక ఈ వరుస హత్యల వెనుక ఎవరున్నారో కనిపెట్టడానికి జాంగ్ నాన్-గామ్ అనే ఒక తెలివైన పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. లీ టాంగ్ చేసే ప్రతి హత్యను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అతనిని వెంబడిస్తుంటాడు. ఈ ఇద్దరి మధ్య జరిగే మైండ్ గేమ్స్, అలాగే మధ్యలో వచ్చే ఇతర పాత్రల వల్ల కథ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. చివరికి టాంగ్ ను పోలీస్ ఆఫీసర్ పట్టుకుంటాడా ? టాంగ్ హత్యల పరంపరను కొనసాగిస్తూనే ఉంటాడా ? అనే విషయాలను,ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : మైండ్ గేమ్‌ తో మతిపోగొట్టే అంతుచిక్కని మిస్టరీ… అసలు పిచ్చి ఎవరికో అర్థం కాక బుర్ర తిరిగిపోయే థ్రిల్లర్

Tags

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×