E-Paper
Advertisement

సైకో కిల్లర్ ఎత్తులకు దొంగ పై ఎత్తు… క్లైమాక్స్ వరకు నరాలు తెగే ఉత్కంఠ

సైకో కిల్లర్ ఎత్తులకు దొంగ పై ఎత్తు… క్లైమాక్స్ వరకు నరాలు తెగే ఉత్కంఠ
Advertisement

Crime Thriller OTT : ఒక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ తో వచ్చిన హాలీవుడ్ సినిమా ఓటీటీలో ఆడియన్స్ ను బాగా అలరిస్తోంది. ఈ స్టోరీ ఒక తెలివైన సైకో కిల్లర్, ఒక మామూలు దొంగ మధ్య పిల్లి ఎలక పోరాటంలా సాగుతుంది. ఈ సినిమా మొదటి నుండి చివరి వరకు సీటు అంచున కూర్చోబెట్టేలా ఉత్కంఠగా సాగుతుంది. చాలా వరకు దొంగలు ఇంట్లోకి వచ్చి యజమానిని భయపెడితే, ఇందులో రివర్స్‌లో యజమాని దొంగను భయపెట్టి వెంటాడతాడు. ఒక చిన్న తప్పు వల్ల హీరో ప్రాణాలు ఎలా ప్రమాదంలో పడ్డాయి, ఆ సైకో నుండి అతను ఎలా తప్పించుకున్నాడు అనేదే ఈ సినిమా స్పెషాలిటీ. థ్రిల్లర్ ఫ్యాన్స్ కి భలే కిక్ ఇస్తుంది ఈ సినిమా.

ఎక్కడ చూడచ్చు అంటే

2018లో వచ్చిన ఈ అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బాడ్ సమారిటన్’ (Bad Samaritan). ఈ సినిమాని డీన్ డెవ్లిన్ డైరెక్ట్ చేశారు. ఈయన ‘ఇండిపెండెన్స్ డే’, ‘గాడ్జిల్లా’ వంటి పెద్ద సినిమాలకు ప్రొడ్యూసర్‌గా పనిచేసాడు కూడా. అందుకే ఈ చిన్న సినిమాను కూడా చాలా గ్రిప్పింగ్‌గా, ఎక్కడా బోర్ కొట్టకుండా తీశారు. బ్రాండన్ బోయ్స్ రాసిన స్క్రీన్‌ప్లే సినిమా చివరి వరకు ఉత్కంఠగా సాగేలా చేస్తుంది.సినిమాలో విలన్‌గా నటించిన డేవిడ్ టెన్నాంట్ నటన హైలైట్. సీరియల్ కిల్లర్‌గా తన చూపులతోనే భయపెట్టేస్తాడు. ఇక హీరోగా నటించిన రాబర్ట్ షీహన్ తన యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాను సుమారు 80 కోట్ల బడ్జెట్‌తో తీశారు. బాక్సాఫీస్ దగ్గర ఇది యావరేజ్ రిజల్ట్ అందుకున్నప్పటికీ, ఓటీటీలో మాత్రం చాలా మందికి నచ్చిన థ్రిల్లర్ మూవీగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్, ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సీన్, డెరెక్ అనే ఇద్దరు కుర్రాళ్లు ఒక హోటల్ దగ్గర వాలెట్ పార్కింగ్ పని చేస్తుంటారు. వీళ్ల ప్లాన్ ఏంటంటే.. ఎవరైనా పెద్ద కారు వేసుకుని తినడానికి వస్తే, వాళ్ళ ఇంటి తాళాలు కొట్టేసి, వాళ్ళు తినేలోపు వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసి వచ్చేయడం. ఒకరోజు ఇలాగే ఓ పెద్దాయన కేల్ కారు తీసుకుని అతని ఇంటికి వెళ్తాడు సీన్. అక్కడ డబ్బుల కోసం వెతుకుతుంటే, ఒక గదిలో ఓ అమ్మాయిని గొలుసులతో కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి చిత్రహింసలు పెడుతుండటం చూసి సీన్ ఫ్యూజులు అవుట్ అయిపోతాయి.

భయపడిపోయిన సీన్ అక్కడి నుండి పారిపోయి వచ్చి పోలీసులకు చెప్తాడు. కానీ ఆ సైకో కేల్ మామూలోడు కాదు, బాగా డబ్బు ఉన్నోడు మాత్రమే కాదు టెక్నాలజీలో తోపు కూడా. సీన్ తన ఇంటికి వచ్చాడని కనిపెట్టేసి, రివర్స్ అటాక్ మొదలుపెడతాడు. సీన్ గర్ల్‌ఫ్రెండ్‌ను, వాడి ఫ్రెండ్‌ను, వాడి ఫ్యామిలీని టార్గెట్ చేసి నానా రకాలుగా ఇబ్బంది పెడతాడు. సీన్ ఏ పని చేసినా వాడు ముందే పసిగట్టి, సీన్‌ని ఒక క్రిమినల్‌లా అందరి ముందు ప్రొజెక్ట్ చేస్తాడు.

Advertisement

అంతేకాకుండా ఆ సైకో సీన్ గర్ల్‌ఫ్రెండ్‌ను కూడా కిడ్నాప్ చేస్తాడు. పోలీసులు నమ్మకపోయినా, సీన్ తన ప్రాణాలకు తెగించి ఆ సైకో ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆ అమ్మాయిని, తన గర్ల్‌ఫ్రెండ్‌ను కాపాడటానికి ఆ కిల్లర్‌తో పెద్ద యుద్ధమే చేస్తాడు. చివరికి ఆ సైకో వేసే స్కెచ్‌ల నుండి సీన్ తప్పించుకున్నాడా ? ఆ అమ్మాయిలను కాపాడినాడా ? అసలెందుకు అమ్మాయిలను టార్చర్ చేస్తున్నాడు ఆ సైకో ? అనే విషయాలను ఈ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : నరకం చూపించే భర్త… పక్కింటోడితో ప్రేమలో పడే భార్య … ఒంటరిగా చూడాల్సిన సినిమా

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×