E-Paper
Advertisement

కేసీఆర్ దగ్గర జీవన్ రెడ్డి చేతులు కట్టుకుని నిలబడటం బాధాకరం.. జగిత్యాల నేతలతో సీఎం వ్యాఖ్య‌లు

కేసీఆర్ దగ్గర జీవన్ రెడ్డి చేతులు కట్టుకుని నిలబడటం బాధాకరం.. జగిత్యాల నేతలతో సీఎం వ్యాఖ్య‌లు
Advertisement

CM Revanth Reddy: మంగళవారం జగిత్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీల‌క‌ వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి పార్టీ వీడటం పట్ల సీఎం ఆవేదన వ్యక్తం చేస్తూనే, ఆయన నిర్ణయాలను తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ జీవన్ రెడ్డిని తక్కువ చేసి చూడలేదని, ఆయన గౌరవ మర్యాదలకు భంగం కలిగేలా తాము ఎప్పుడూ వ్యవహరించలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలుపు కోసం పార్టీ శ్రేణులన్నీ కష్టపడ్డాయని, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయన కోరిక మేరకే నిజామాబాద్ టికెట్ ఇచ్చామని సీఎం గుర్తు చేశారు. “దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు రాజకీయ భవిష్యత్తుపై తాను స్వయంగా హామీ ఇచ్చాను. కానీ ఆయన మొండి పట్టుతో పార్టీని వీడి, 40 ఏళ్లుగా తన కోసం పనిచేసిన కార్యకర్తలను మోసం చేశారు.” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామని కుట్రలు చేస్తున్న కేసీఆర్ చెంతకు జీవన్ రెడ్డి చేరడం అత్యంత బాధాకరమని ఆయన అన్నారు.

Advertisement

జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని జీవన్ రెడ్డి కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని సీఎం మండిపడ్డారు. ఆయన వయసుకి, అనుభవానికి ఇది ఏమాత్రం తగదని హితవు పలికారు. ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్రలను తాము తిప్పికొడుతుంటే, అటువైపు వెళ్లిన జీవన్ రెడ్డి నిర్ణయం మంచో చెడో కార్యకర్తలే ఆలోచించాలని కోరారు. “ప్రభుత్వాన్ని కాపాడుకోవడం తప్పా? నేను చేస్తున్నది తప్పో ఒప్పో మీరే నిర్ణయించండి. ఎవరు ఏమిటి అనేది కాలమే నిర్ణయిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. వ్యక్తి కంటే పార్టీయే ముఖ్యమని నిరూపిస్తూ కాంగ్రెస్ వెంట నడుస్తున్న కార్యకర్తలను ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు.

కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, త్వరలోనే తాను వ్యక్తిగతంగా జగిత్యాలకు వచ్చి అందరినీ కలుస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అంతా కలిసికట్టుగా జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. కుట్రలను ఎదుర్కొంటూ మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని కోరారు. రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమని, కానీ సిద్ధాంతాల కోసం నిలబడటమే ముఖ్యమని ఆయన తన ప్రసంగం ద్వారా కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

Advertisement

Read Also: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన లేఖ.. మహిళా రిజర్వేషన్లపై ప్రధానికి కీలక సూచనలు

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×