E-Paper
Advertisement

Crime Thriller ott : శవాలతో నిండిపోయే నది… వరుస హత్యలతో వణుకు పుట్టించే ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్

Crime Thriller ott : శవాలతో నిండిపోయే నది… వరుస హత్యలతో వణుకు పుట్టించే ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Crime Thriller ott : ఇప్పుడు ఏ ఓటీటీలో చూసినా క్రైమ్ థ్రిల్లర్ ల హవా కొనసాగుతోంది. అందులోనూ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అంటే ఆడియన్స్ చెవి కోసుకుంటున్నారు. ఇక వీటిని ఏభాషలో వచ్చినా ఆదరిస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలో మరో కన్నడ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. వరుసగా జరిగే దారుణ హత్యల నేపథ్యంలో ఈ సినిమా నరాలు కట్టయ్యే సస్పెన్స్ తో సాగుతుంది. థియేటర్లలోకి వచ్చిన 7 నెలలకు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ కన్నడ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బందూక్’ (Bandook). దీని అర్థం తుపాకీ అని వస్తుంది. గతేడాది 2025లో జూలై 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఐఎమ్‌డీబీలో 7.5 రేటింగ్ ను సాధించింది కూడా. మహేష్ రవికుమార్ దర్శకత్వం వహించడంతోపాటు దీనికి కథను కూడా అందించారు. ఈ సినిమాతోనే మహేష్ రవికుమార్ డైరెక్టర్‌గా కన్నడ నాట పరిచయం అయ్యారు. సినిమాలో పార్థా, గోపాలకృష్ణ దేశ్‌పాండే, బాలాజీ మనోహర్, శ్వేతా ప్రసాద్, హరీష్ రాయ్, శంకర్ అశ్వత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. లయన్స్ గేట్ ప్లే (Lionsgate play) ఓటీటీలో జనవరి 16 నుంచి ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం కన్నడ భాషలో మాత్రమే ఇది ఓటీటీలో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : అందమైన అమ్మాయిపై పోలీస్ కన్ను… కట్ చేస్తే హత్య కేసులో దుమ్ములేపే ఇన్వెస్టిగేషన్

స్టోరీ ఏమిటంటే

ఒక నిర్మానుష్యమైన నదీ ద్వీపంలో వరుసగా దారుణ హత్యలు జరుగుతుంటాయి. ఈ కేసును ఛేదించడానికి ఐపీఎస్ ఆఫీసర్ రూపా రుద్రరావు (శ్వేత ప్రసాద్) రంగంలోకి దిగుతుంది. తన కూతురి మరణంతో కుంగిపోయి, వ్యసనాలకు బానిసైన భర్త రుద్ర (బాలాజీ మనోహర్) కూడా ఈ ఇన్వెస్టిగేషన్‌లో పాలుపంచుకుంటాడు. ఇక నదిలో ఉన్న శవాలను వెలికితీయడంలో పోలీసులకు మిత్ర (పార్థ కె) అనే యువకుడు సహాయం చేస్తుంటాడు. అతను చేపల రేవులో పనిచేస్తూనే, రహస్యంగా అక్రమ ఆయుధాల వ్యాపారం చేస్తుంటాడు. ఆ తరువాత స్టోరీ మరిన్ని మలుపులు తిరుగుతుంది. చివరికి కిల్లర్ ఎవరు ? ఎందుకు హత్యలు చేస్తున్నాడు ? పోలీసులు అతన్ని పట్టుకుంటారా ? అనేది ఈ కన్నడ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×