E-Paper
Advertisement

హిమాలయ లోయల్లో అదృశ్యమవుతున్న విద్యార్థులు… ఒళ్ళు గగుర్పొడిచే క్రైమ్ థ్రిల్లర్

హిమాలయ లోయల్లో అదృశ్యమవుతున్న విద్యార్థులు… ఒళ్ళు గగుర్పొడిచే క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Crime Thriller OTT : క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లనే ఇప్పుడు ఎక్కువగా వాచ్ చేస్తున్నారు ఆడియన్స్. నచ్చిన సిరీస్ లను దొరికిన సమయంలో చూసి ఎంటర్టైన్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ అదిరిపోయే థ్రిల్లర్ సిరీస్ గురించి చెప్పుకోవాల్సిందే. ఇది టాప్ రేటింగ్ తో ఆకట్టుకున్న సిరీస్.
ఈ సిరీస్ అంతా మంచు కొండల్లో, దట్టమైన అడవుల్లో సాగుతుంది. దీనిని ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్ లోని అందమైన లోకేషన్లలో షూట్ చేశారు. ఆ విజువల్స్ చూస్తుంటే మనకి నిజంగానే ఏదో తెలియని భయం, క్రైమ్ ఫీలింగ్ కలుగుతుంది. ఈ కథ హిమాలయాల్లోని ‘రుద్రకుండ్’ అనే ఒక హిల్ స్టేషన్ నేపథ్యంలో సాగుతుంది. అక్కడ ఒక హైస్కూల్ విద్యార్థి దారుణంగా హత్యకు గురవుతాడు. ఈ కేసును దర్యాప్తు చేసే క్రమంలో నమ్మలేని నిజాలు బయటపడుతాయి. థ్రిల్లర్ ఫ్యాన్స్ ఈ సిరీస్ ను తెగ చూస్తున్నారు కూడా. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘కాండీ’ (Candy). ఇది 2021 సెప్టెంబర్ 8న మొదట ‘వూట్ సెలెక్ట్’ (Voot Select) లో విడుదలైంది. ప్రస్తుతం JioHotstar లో అందుబాటులో ఉంది. దీనికి ఆశిష్ ఆర్. శుక్లా దర్శకత్వం వహించారు. ఈయన ఇంతకుముందు ‘ఉందేఖి’ (Undekhi) అనే హిట్ సిరీస్ తీశారు. అందుకే ఇందులో కూడా సస్పెన్స్, క్రైమ్ ఎలిమెంట్స్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటాయి. ఈ సిరీస్ లో ప్రధాన పాత్రల్లో రోనిత్ రాయ్ (జయంత్ పరేఖ్), రిచా చద్దా (రత్న సంఖ్వార్) నటించారు. 8 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ కి ఐయండిబిలో 8.0 రేటింగ్ కూడా ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

రుద్రకుండ్ అనే ఒక మంచు కొండల ఊర్లో ఒక స్కూల్ పిల్లాడు దారుణంగా మర్డర్ అవుతాడు. ఆ ఊర్లో ఏదో భయంకరమైన అడవి మృగం తిరుగుతుందని, అదే మనుషుల్ని చంపేస్తుందని జనం తెగ భయపడిపోతుంటారు. కానీ ఆ స్కూల్లో మాస్టారుగా చేసే జయంత్ (రోనిత్ రాయ్) కి మాత్రం ఇది జంతువు చేసిన పని కాదని, ఎవరో మనుషులే పక్కా ప్లాన్‌తో చేస్తున్నారని డౌట్ వస్తుంది. తన సొంత కూతుర్ని కూడా ఇలాగే పోగొట్టుకున్న జయంత్, ఎలాగైనా ఈ చావుల వెనుక ఉన్న అసలు దొంగని పట్టుకోవాలని డిసైడ్ అవుతాడు.

ఇక అదే ఊర్లో రత్న (రిచా చద్దా) అనే ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ఉంటుంది. ఆమెకి లోకల్ రాజకీయ నాయకులతో, రౌడీలతో కాస్త లోపాయికారీ సంబంధాలు ఉంటాయి. కానీ ఈ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఒక షాకింగ్ నిజం బయటపడుతుంది. అదేంటంటే, ఆ ఊర్లోని స్కూల్ పిల్లలకి ఎవరో రంగు రంగుల ‘కాండీ’ (చాక్లెట్లు) అలవాటు చేసి, వాళ్ళని డ్రగ్స్‌కి బానిసలుగా మారుస్తుంటారు. ఈ డ్రగ్స్ ధందా వెనుక ఊర్లో పెద్ద తలకాయలు, వాళ్ళ కొడుకులు ఉన్నారని అర్థమవుతుంది. చివరికి ఆ మాస్టారు, పోలీస్ ఆఫీసర్ కలిసి ఈ డ్రగ్స్ మాఫియాని ఎలా తొక్కేసారు? అసలు ఆ అడవి మృగం కథ ఏంటి? అది నిజంగా ఉందా లేక ఎవరైనా ముసుగు వేసుకుని తిరుగుతున్నారా? అనే విషయాలతో స్టోరీ క్లైమాక్స్ వరకు ఉత్కంఠంగా నడుస్తుంది.

Advertisement

Read Also :  ఆర్మీ అడ్డాలో అదిరిపోయే వేట… నిజాన్ని నిగ్గు తేల్చే మేజర్… క్రేజీగా ప్రతి ఎపిసోడ్

Related News

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

Big Stories

Advertisement
×