E-Paper
Advertisement

ఐపీఎల్ 2026లో ఘోర ప్ర‌మాదం..లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన CSK బౌల‌ర్లు !

ఐపీఎల్ 2026లో ఘోర ప్ర‌మాదం..లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన CSK బౌల‌ర్లు !
Advertisement

IPL 2026:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ ( CSK) జట్టుకు సంబంధించిన ప్లేయర్లు లిఫ్టులో ఇరుక్కున్నట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. మొదటి మ్యాచ్ ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, ఎల్లుండి పంజాబ్ తో  (Punjab Kings) మరో మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో బస చేస్తున్న హోటల్ లిఫ్టులో (Lift)  చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు ఇరుక్కున్నారు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

Also Read: Shahid Afridi: నాకు ఛాన్స్ ఇవ్వండి..టీమిండియాకు 100 మంది బుమ్రాల‌ను త‌యారు చేస్తా

లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన CSK బౌల‌ర్లు !

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పైన భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే భారీ అంచనాల నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మహేంద్ర సింగ్ ధోని నుంచి మొదలుకొని బ్రేవిస్ వరకు చాలా మంది ప్లేయర్లు జట్టుకు దూరమయ్యారు. గాయాల కారణంగా ఒక్కో ప్లేయర్ జట్టుకు దూరమై అభిమానులకు షాక్ ఇస్తున్నారు. అయితే గాయాల బారిన పడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో ఊహించని షాక్ ఎదురైనట్లు తెలుస్తోంది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన ప్లేయర్లు లిఫ్టులో ఇరుక్కుపోయినట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. శివమ్ దుబే, సర్ఫరాజ్ ఖాన్, మరో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ముగ్గురు కూడా లిఫ్టులో ఇరుక్కున్నారు. లిఫ్ట్ ఎక్కిన తర్వాత ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయింది. ఈ నేపథ్యంలోనే లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు లిఫ్ట్ లోనే ఉక్కిరి బిక్కిరి అయ్యారు. భయాందోళనతో వణికిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే ఇది చూసిన క్రికెట్ అభిమానులు ఫేక్ అంటున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ కాబట్టి అందరిని పూల్స్ చేయడానికి ఇలాంటి వీడియోలు పెడుతున్నారని మండి పడుతున్నారు.

ఐపీఎల్ 2026 టోర్నమెంటులో చెన్నై తొలి ఓటమి

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అద్భుతంగా రాణిస్తుందని అందరూ అంచనా వేసుకున్నారు. కానీ మొదటి మ్యాచ్ లోనే చిత్తుగా ఓడిపోయింది చెన్నై సూపర్ కింగ్స్. పిల్ల బచ్చాగాళ్లు ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు చేతిలో ఏకంగా 8 వికెట్ల తేడాతో ఓటమిపాలై చెత్త రికార్డు నమోదు చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. మహేంద్ర సింగ్ ధోని గాయం కారణంగా దూరమైన నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొంది. ఇక తన తర్వాతి మ్యాచ్ ఎల్లుండి పంజాబ్ కింగ్స్ తో చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఆడనుంది. ఈ మ్యాచ్ సందర్భంగా మహేంద్రసింగ్ ధోని అందుబాటులోకి వస్తాడని అంటున్నారు. ఇప్పటికే నెట్ ప్రాక్టీస్ లో కూడా ధోని పాల్గొన్నారు. దీంతో తుది జట్టులో అతనికి అవకాశం వస్తుందని అంచనా వేస్తున్నారు.

 

Also Read: PSL 2026: PSLను అత‌లాకుత‌లం చేసిన తుఫాన్‌..గాల్లో ఎగిరిప‌డ్డ గ్రౌండ్ మెన్లు

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×