E-Paper
Advertisement

Crime Thriller Series OTT: ఆర్మీ అడ్డాలో అదిరిపోయే వేట… నిజాన్ని నిగ్గు తేల్చే మేజర్… క్రేజీగా ప్రతి ఎపిసోడ్

Crime Thriller Series OTT: ఆర్మీ అడ్డాలో అదిరిపోయే వేట… నిజాన్ని నిగ్గు తేల్చే మేజర్… క్రేజీగా ప్రతి ఎపిసోడ్
Advertisement

Crime Thriller Series OTT : ఇప్పుడు వెబ్ సిరీస్ ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటిలో కూడా క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ సిరీస్ లు బాగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ మాత్రం ఆర్మీ నేపథ్యంలో జరుగుతుంది. ఈ కథ ఇండియన్ ఆర్మీ లాయర్ అయిన మేజర్ చుట్టూ తిరుగుతుంది. ఆ ఆర్మీ ఆఫీసర్ ఇద్దరు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్ కేసును విచారించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రతి ఎపిసోడ్ మిమ్మల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇది కేవలం క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు, సైన్యంలో ఉండే అంతర్గత రాజకీయాలను కూడా చూపిస్తుంది. ఈ సిరీస్ షూటింగ్ ప్రధానంగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. అక్కడి ఆర్మీ క్యాంపులు, ఎడారి వాతావరణం కథకు ఒక నేచురల్ లుక్ ఇచ్చాయి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే 

ఈ క్రైమ్ మిస్టరీ వెబ్ సిరీస్ పేరు ‘కోడ్ ఎమ్’ (Code M). టీవీ సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన జెన్నిఫర్ వింగెట్, ఈ సిరీస్‌తోనే మొదటిసారి ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇందులో ఆమె మేజర్ పాత్ర కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకుంది. ఈ సిరీస్‌ను ఏక్తా కపూర్ కి చెందిన ‘ఆల్ట్ బాలాజీ’, ‘జీ5’ కలిసి నిర్మించాయి. 2020 జనవరి 15 నుంచి సీజన్ 1 ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. 8 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ ను అక్షయ్ చౌబే డైరెక్ట్ చేశారు. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో, 2022లో సీజన్ 2 ని కూడా విడుదల చేశారు. ఇందులో మోనికా మెహ్రా ఒక కొత్త మిషన్ (కార్గిల్ రోడ్ సేఫ్టీ ప్రాజెక్ట్ చుట్టూ తిరిగే కుట్ర) మీద పని చేస్తుంది. ఇది హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కూడా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఆర్మీలో లాయర్‌గా పనిచేసే మోనికా మెహ్రా (జెన్నిఫర్ వింగెట్) పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఒక కేసు వచ్చి పడుతుంది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఒక ఎన్‌కౌంటర్ జరుగుతుంది, అందులో ఒక ఆర్మీ ఆఫీసర్‌తో పాటు ఇద్దరు టెర్రరిస్టులు చనిపోతారు. పైకి చూస్తే ఇది మామూలు ఎన్‌కౌంటర్ లాగే కనిపిస్తుంది, కానీ దీని వెనుక ఏదో పెద్ద స్కామ్ ఉందని మోనికాకు డౌట్ వస్తుంది. పై అధికారులు కేసును తొందరగా క్లోజ్ చేయమని ఒత్తిడి తెచ్చినా వినకుండా, రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ మొదలుపెడుతుంది. ఈ కేసును తవ్వుతున్న కొద్దీ షాకింగ్ నిజాలు బయటపడతాయి. ఆ చనిపోయిన ఇద్దరు అసలు టెర్రరిస్టులే కారని, వాళ్లు అమాయకులని మోనికా కనిపెడుతుంది.

ఇక పాత పగలు, ఆర్మీలోని కొందరు పెద్ద తలకాయల హస్తం ఉందని అర్థమవుతుంది. సిస్టమ్‌లో ఉన్న లొసుగులను వాడుకుని కొందరు ఆఫీసర్లు ఎలా ఆడుకుంటున్నారో చూసి ఆమె షాక్ అవుతుంది. చివరికి తన సొంత డిపార్ట్‌మెంట్‌లోని వాళ్లే తనకు ఎదురు తిరిగినా, ప్రాణాలకు తెగించి మోనికా పోరాడుతుంది. చివరికి ఆ తప్పుడు ఎన్‌కౌంటర్ వెనుక ఉన్న అసలు విలన్ ఎవరు? ఎందుకు అలా ప్లాన్ చేశారు? మోనికా ఈ గుట్టును ఎలా రట్టు చేస్తుంది ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : తల్లి పెళ్లి కోసం అదిరిపోయే స్కెచ్ వేసే కొడుకు… ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ ఎంటర్టైనర్

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×