E-Paper
Advertisement

Crime Thriller OTT : భార్య ఉండగానే ప్రియురాలితో… మర్డర్ మిస్టరీలో మతిపోగొట్టే ట్విస్ట్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

Crime Thriller OTT : భార్య ఉండగానే ప్రియురాలితో… మర్డర్ మిస్టరీలో మతిపోగొట్టే ట్విస్ట్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Crime Thriller OTT : మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. మైండ్ బెండింగ్ ట్విస్టులు ఉండే ఈ జానర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటాయి. మీరు కూడా ఇలాంటి సినిమాల కోసం వెతుకుతుంటే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. మరి ఇంతకీ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.

జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్

2023లో వచ్చిన బెంగాలీ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఛోటోలోక్ (Chhotolok). ఇంద్రనీల్ రాయ్‌ చౌధురి డైరెక్ట్ చేశాడు. లవ్, డిజైర్, యాంబిషన్, కాస్ట్ ఇష్యూస్ చుట్టూ తిరిగే డార్క్ స్టోరీ ఇది. 9 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ 2023 నవంబర్ 3న ZEE5లో రిలీజ్ అయింది. క్రిటిక్స్ నుండి సూపర్ రివ్యూస్ వచ్చాయి. బెంగాలీ ఓటీటీలో బెస్ట్ షోల్లో ఒకటిగా ప్రశంసలు అందుకుంది. బెంగాలీ ఒరిజినల్‌తో మల్టీ లాంగ్వేజ్ సబ్‌టైటిల్స్ ఆప్షన్ ఉంది.

Advertisement

మెయిన్ లీడ్స్ గా గౌరవ్ చక్రవర్తి (రాజా భట్టాచార్య), ఉషాసి రాయ్ (రూప్షా), దమినీ బెన్నీ బాసు (SI సబిత్రి మండల్), ప్రియాంకా సర్కార్, ఇంద్రాణి హల్దార్, ఉషాసి చక్రవర్తి లాంటి స్ట్రాంగ్ కాస్ట్ ఇందులో నటించారు. దమినీ బెన్నీ బాసు పెర్ఫార్మెన్స్ సిరీస్‌కి సోల్, కాస్ట్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేసే పోలీస్ ఆఫీసర్‌గా అద్భుతంగా నటించింది. ఇంద్రనీల్ రాయ్‌చౌధురి డైరెక్షన్‌ లో సోషల్ కామెంటరీ, సస్పెన్స్ బాగా బ్యాలెన్స్ చేశారు.

Read Also : ఇదేం పిచ్చి ప్రేమ భయ్యా ? కనికరం లేకుండా మర్డర్స్… ఈ సైకో ఏంది భయ్యా ఇంత బ్రూటల్ గా ఉన్నాడు ?

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

కథ స్టోరీ రాజా (గౌరవ్ చక్రవర్తి) చుట్టూ తిరుగుతుంది. మిడిల్ క్లాస్ మ్యారీడ్ మనిషి రాజా. తన ఫెయిల్డ్ మ్యారేజ్ నుండి ఎస్కేప్ కావడానికి రూప్షా (ఉషాసి రాయ్)తో అఫైర్ స్టార్ట్ చేస్తాడు. కానీ రూప్షాకి క్రిమినల్ పాస్ట్ ఉంటుంది. రాజా లైఫ్ ఆబ్సెషన్, డిజైర్‌ తో నిండిపోతుంది. కానీ రూప్షా సడన్ గా మిస్టీరియస్‌ గా చనిపోతుంది. విషయం కూపీ లాగిన పోలీసులకు రాజా ప్రైమ్ సస్పెక్ట్ అవుతాడు. ఇక కేస్ ఇన్వెస్టిగేట్ చేసే SI సబిత్రి మండల్ (దమినీ బెన్నీ బాసు) రంగంలోకి దిగుతుంది. సబిత్రి కాస్ట్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తూ కేస్ సాల్వ్ చేయడానికి పోరాడుతుంది. క్లాస్ డిఫరెన్సెస్, కాస్ట్ ఇష్యూస్, స్ట్రక్చరల్ వయలెన్స్… ఇవన్నీ కథలో డీప్‌గా టచ్ చేశారు. ట్విస్ట్స్ ఫుల్‌గా ఉంటాయి. చివరి ఎపిసోడ్స్ షాకింగ్ గా ఉంటాయి. మరి ఇంతకీ రూప్షా ఎలా చనిపోయింది ? దీంతో రాజాకు సంబంధం ఉందా ? అనేది సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే. ‘ఛోటోలోక్’ ఒక మాస్టర్‌పీస్ బెంగాలీ సిరీస్. క్రైమ్ థ్రిల్లర్ ఫ్యాన్స్‌కి తప్పక చూడాలి.

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×