E-Paper
Advertisement

Psycho Thriller OTT : ఇదేం పిచ్చి ప్రేమ భయ్యా ? కనికరం లేకుండా మర్డర్స్… ఈ సైకో ఏంది భయ్యా ఇంత బ్రూటల్ గా ఉన్నాడు ?

Psycho Thriller OTT : ఇదేం పిచ్చి ప్రేమ భయ్యా ? కనికరం లేకుండా మర్డర్స్… ఈ సైకో ఏంది భయ్యా ఇంత బ్రూటల్ గా ఉన్నాడు ?
Advertisement

Psycho Thriller OTT :  ప్రేమలో పడితే ఎంత బాగుంటుందో కదా ? ఆ అందమైన అనుభూతి వర్ణించడం కష్టమే. కానీ అదే ప్రేమ పీడకలలా మారేలా ఉంటే జీవితం నరకం అవుతుంది. కొంతమంది ప్రేమ పేరుతో చేసే అరాచకం ప్రాణాలు తీస్తుంది. అలా ఓ వ్యక్తి ప్రేమ అంటూ వెంటపడి స్టాక్ చేయడమే కాకుండా, తనకు అడ్డుగా ఉన్నారనుకుంటే వాళ్ళను లేపేయడానికి కూడా వెనకాడడు. మరి వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉన్న ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? కథ ఏంటి? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో

నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఒరిజినల్ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ You. 2018లో విడుదలైన ఈ సిరీస్ ను కెరోలిన్ కెప్నెస్ నవలల ఆధారంగా గ్రెగ్ బెర్లాంటి, సెరా గ్యాంబుల్ క్రియేట్ చేశారు. పెన్ బాడ్గ్లీ మెయిన్ లీడ్‌గా జో గోల్డ్‌బర్గ్ పాత్రలో నటించాడు. చార్మింగ్ గా కన్పించే ఈ అబ్బాయి ఆబ్సెసివ్ స్టాకర్, సీరియల్ కిల్లర్ గా అద్భుతంగా నటించాడు. సిరీస్ మొత్తం 5 సీజన్లు ఉండగా, ఫైనల్ సీజన్ 2025 ఏప్రిల్ 24న రిలీజ్ అయింది. ఆబ్సెషన్, లవ్, మర్డర్ చుట్టూ తిరిగే డార్క్ స్టోరీ ఇది. నెట్‌ఫ్లిక్స్‌లో అన్ని సీజన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే మల్టీ లాంగ్వేజ్ లో ఆడియో అందుబాటులో ఉంది. పెన్ బాడ్గ్లీ (జో గోల్డ్‌బర్గ్) పర్ఫార్మెన్స్ సిరీస్ హైలైట్. ఎలిజబెత్ లైల్ (సీజన్ 1లో బెక్), విక్టోరియా పెడ్రెట్టి (సీజన్ 2లో లవ్ క్విన్), షార్లెట్ రిచీ (సీజన్ 4-5లో కేట్), టాటి గాబ్రియెల్ (మారియెన్) వంటి వాళ్లు ఈ సిరీస్ లో కీ రోల్స్ పోషించారు. సీజన్ 5లో మడెలిన్ బ్రూవర్ (బ్రాంటే), అన్నా క్యాంప్ వంటి కొత్త క్యాస్ట్ జాయిన్ అయ్యారు.

Advertisement

Read Also :  హాంటెడ్ హౌస్ లో కాపురం… కొత్త పెళ్లి కూతురిపై దిక్కుమాలిన దెయ్యం కన్ను… ఒంటరిగా చూడకూడని మూవీ

స్టోరీలోకి వెళ్తే…

కథ జో గోల్డ్‌బర్గ్ ఒక బుక్‌స్టోర్ మేనేజర్, చార్మింగ్‌గా కనిపించే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. కానీ అతని లవ్ ఆబ్సెషన్‌కి లిమిట్ ఉండదు. స్టాకింగ్ నుంచి మొదలు పెడితే మానిప్యులేషన్, మర్డర్ వరకు వెళ్తాడు. సీజన్ 1లో న్యూయార్క్‌లో బెక్ అనే రచయిత్రిని చూసి అట్రాక్ట్ అవుతాడు. సీజన్ 2లో LAకి మారి లవ్ క్విన్‌ని ఇష్టపడతాడు. సీజన్ 3లో మరొకరిని, సీజన్ 4లో లండన్‌లో ప్రొఫెసర్‌గా మారి కేట్‌ని టార్గెట్ చేస్తాడు. సీజన్ 5 (ఫైనల్)లో న్యూయార్క్‌కి తిరిగి వచ్చి, పాత రహస్యాలు, కొత్త ఆబ్సెషన్స్‌తో కథ ముగుస్తుంది. జో తనను తాను రొమాంటిక్ హీరోగా భావిస్తాడు. కానీ అతని డార్క్ సైడ్ భయపెడుతుంది. ట్విస్ట్స్, సస్పెన్స్ ఫుల్‌గా ఉండే ఈ సిరీస్ ను థ్రిల్లర్ ఫ్యాన్స్‌కి తప్పక చూడాలి. కానీ డార్క్ థీమ్స్, వయలెన్స్ ఉన్నాయి కాబట్టి స్ట్రాంగ్ హార్ట్ ఉన్నవాళ్లకే ఈ సిరీస్. మరి హీరో ప్రేమలో పడ్డ వాళ్ళను ఏం చేశాడు ? క్లైమాక్స్ లో ఏం జరిగింది ? అన్నది తెరపై చూడాల్సిందే.

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×