E-Paper
Advertisement

Hyderabad Cab Rides: రాత్రికి క్యాబ్, ఆటో రైడ్ రిజెక్ట్ చేస్తే.. ఈ నెంబర్ కు వాట్సప్ చేయండి: సీపీ సజ్జనార్

Hyderabad Cab Rides: రాత్రికి క్యాబ్, ఆటో రైడ్ రిజెక్ట్ చేస్తే.. ఈ నెంబర్ కు వాట్సప్ చేయండి: సీపీ సజ్జనార్
Advertisement

Hyderabad Cab Rides: న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ హోటళ్లు, బార్ లు.. ప్రత్యేక ఈవెంట్లు నిర్వహిస్తుంటాయి. అలాగే ఫ్రెండ్స్, ఆఫీస్ సహా ఉద్యోగులు, కంపెనీలు.. న్యూ ఇయర్ పార్టీలు జరుగుతాయి. ఈవెంట్లు, పార్టీలకు హాజరయ్యే వాళ్లు తిరిగి ఇంటికి వచ్చేందుకు సాధారణంగా క్యాబ్ లేదా ఆటో రైడ్ బుక్ చేసుకుంటారు. అయితే న్యూ ఇయర్ సందర్భంగా రద్దీ ఎక్కువగా ఉండడం, ట్రాఫిక్ సమస్యలు, అర్ధరాత్రి సమయాల్లో ఎక్కువ ఛార్జీ వసూలు చేయడం, రైడ్ క్యాన్సిల్ చేయడం వంటి సమస్యలు వస్తుంటాయి. దీనికి హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఓ పరిష్కారం చూపారు.

వాట్సప్ చేయండి

న్యూ ఇయర్ సందర్బంగా క్యాబ్ లేదా ఆటో డ్రైవర్లు రైడ్ రావడానికి నిరాకరించినా, బుకింగ్ ధర కంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినా ఉపేక్షించేది లేదని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించే వారిపై మోటార్ వెహికల్ చట్టం సెక్షన్ 178(3)(b) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రయాణికులకు ఎక్కడైనా ఇబ్బంది ఎదురైతే, వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

Advertisement

రైడ్ చేస్తున్న వాహనం నంబర్, సమయం/ప్రదేశం, రైడ్ వివరాల స్క్రీన్‌షాట్ ను హైదరాబాద్ పోలీస్ వాట్సప్ నంబర్ 9490616155 కు పంపించాలని సూచించారు.

Also Read: Hyderabad Metro Rail: అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు.. న్యూ ఇయర్ వేళ సమయాల్లో మార్పులు

సందుల్లో దూరి విన్యాసాలు చేస్తే

Advertisement

చౌరస్తాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తనిఖీలు ఉన్నాయని.. సందుల్లో దూరి, ప్రమాదకర విన్యాసాలతో వాహనాలు నడపడం విజ్ఞత అనిపించుకోదని సీపీ సజ్జనార్ అన్నారు. ఆ అజాగ్రత్త వల్ల జరిగే ప్రమాదంలో పోయేది మీ ప్రాణమో, ఎదుటివారి ప్రాణమో ఎవరికెరుక? అన్నారు. ‘ఎవరు మరణించినా.. కన్నవారికి మిగిలేది కడుపుకోతే. మీ క్షేమం కోరే తల్లిదండ్రులకు జీవితాంతం తీరని శోకాన్ని మిగల్చకండి. మద్యం మత్తులో వాహనం నడపడమంటే.. మృత్యువును ఆహ్వానించడమే. ఒకవేళ యముడు మిమ్మల్ని వదిలేసినా, చట్టం నుంచి మాత్రం తప్పించుకోలేరు’ అని సజ్జనార్ అన్నారు.

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×