E-Paper
Advertisement

TVS XL EV 2026: TVS XLఇక ఎలక్ట్రిక్ వెర్షన్ లో.. లాంచింగ్ ఎప్పుడో తెలుసా?

TVS XL EV 2026: TVS XLఇక ఎలక్ట్రిక్ వెర్షన్ లో.. లాంచింగ్ ఎప్పుడో తెలుసా?
Advertisement

TVS XL EV 2026: గ్రామీణ ప్రాంతాల్లో రైతు కూలీలు TVS XLను ఎంతగానో ఇష్టపడుతారు. ఈజీ ఆపరేటింగ్, అదిరిపోయే మైలేజ్, చక్కగా బరువులను మోసే అవకాశం ఉన్న నేపథ్యంలో మంచి ప్రజాదరణ దక్కించుకుంది. ఈ మోపెడ్ ఇకపై ఎలక్ట్రిక్ వెర్షన్(TVS XL EV)లో అందుబాటులోకి రానుంది. TVS మోటార్ కంపెనీ అప్‌కమింగ్ ఎలక్ట్రిక్ మోపెడ్ గా మార్కెట్ కు పరిచయం కాబోతోంది. గ్రామీణ, లాస్ట్ మైల్ డెలివరీలకు సూటబుల్ యుటిలిటీ వెహికల్‌గా మారబోతోంది.

TVS XL EV లాంచ్ డేట్

TVS XL EV ఏప్రిల్ 2026లో లాంచ్ కాబోయే అవకాశం ఉంది. అయితే, ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. టెస్టింగ్, ప్రొడక్షన్, మార్కెట్ కండిషన్స్ కారణంగా లాంచ్ డేట్ డిలే అవుతోంది. ఈ మోపెడ్ Kinetic Green E-Lunaకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

TVS XL EV ధర  

Advertisement

TVS XL EV అంచనా ధర రూ. 60,000 నుంచి రూ.70,000 (ఎక్స్-షోరూమ్, ఇండియా) వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇది ప్రస్తుత పెట్రోల్ XL 100 వెర్షన్ తో పోల్చితే (ప్రస్తుత ధర రూ.44,999 – రూ.60,905) కంటే  కాస్త ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, ఇండియాలో అతి చౌకైన ఎలక్ట్రిక్ వెహికల్స్‌ లో ఒకటిగా మారబోతోంది. FAME సబ్సిడీలు అప్లై అయితే ధర మరింత తగ్గవచ్చు.

TVS XL EV రేంజ్, పనితీరు

TVS XL EV అంచనా రేంజ్ 70 km నుంచి 100 km వరకు ఉంటుంది.  హబ్ మోటర్, మోడెస్ట్ పవర్ తో వస్తుంది. టాప్ స్పీడ్ 25-40 kmph ఇస్తుంది. మోపెడ్ కేటగిరీలో లో-స్పీడ్ EVగా గుర్తింపు తెచ్చుకుంది. లిథియం ఐయాన్, స్వాపబుల్ ఆప్షన్ ఉండవచ్చు. లాస్ట్-మైల్ డెలివరీలకు సౌకర్యంగా ఉంటుంది. స్టాండర్డ్ హోమ్ చార్జర్‌తో 4-6 గంటల్లో ఫుల్ చార్జ్ అవుతుంది. ఇది హై స్పీడ్ స్కూటర్ కాదు. హెవీ లోడ్ క్యారీయింగ్ (150-200 kg పేలోడ్), రఫ్ రోడ్స్‌ కు సూటబుల్.

TVS XL EV డిజైన్, ఫీచర్లు

Advertisement

TVS XL EV డిజైన్ పెట్రోల్ TVS XL 100తో సిమిలర్ గా ఉంటుంది. రగ్డ్, యుటిలిటీ ఫోకస్డ్ లుక్ ఉంటుంది. రౌండ్ హెడ్‌ల్యాంప్, సింపుల్ బాడీ, హెవీ డ్యూటీ ఫ్రేమ్ తో వస్తుంది.  టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, రియర్ డ్యూయల్ షాక్స్ ఉంటాయి. ఫ్రంట్, రియర్ డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. బేసిక్ డిజిటల్ డిస్‌ప్లే, USB చార్జింగ్ పోర్ట్ ఉంటుంది. హెవీ లోడ్ క్యారీయింగ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. సింపుల్, లో మెయింటెనెన్స్ డిజైన్ – గ్రామీణ ప్రాంతాలు, స్మాల్ బిజినెస్, డెలివరీలకు ఐడియల్ గా ఉంటుంది. .

టార్గెట్ యూజర్స్ రూరల్ కమ్యూటర్స్, స్మాల్ బిజినెస్ ఓనర్స్, డెలివరీ ఏజెంట్స్ కు అనుగుణంగా ఉంటుంది. లో రన్నింగ్ కాస్ట్, హై డ్యూరబిలిటీ లభిస్తుంది. చౌక ధర, TVS రిలయబిలిటీ, ఎలక్ట్రిక్ ఎఫిషియెన్సీని కలిగి ఉంటుంది. లో రేంజ్, స్పీడ్ డిస్‌అడ్వాంటేజెస్. హైవే యూస్‌కు సూటబుల్ కాదు. ఇది TVS ఎలక్ట్రిక్ లైనప్‌ లో iQube, Orbiter తర్వాత అతి చౌక ఆప్షన్‌గా ఉంటుంది.

Read Also: అదిరిపోయే డిజైన్, ఆకట్టుకునే మైలేజ్.. TVS నుంచి అదిరిపోయే ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×