E-Paper
Advertisement

Crime Thriller OTT: జంట హత్య కేసులో దుమ్ములేపే ఇన్వెస్టిగేషన్… ఊహించని మలుపుతో క్రేజీ క్లైమాక్స్

Crime Thriller OTT: జంట హత్య కేసులో దుమ్ములేపే ఇన్వెస్టిగేషన్… ఊహించని మలుపుతో క్రేజీ క్లైమాక్స్

Crime Thriller OTT : ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన సినిమాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈ సినిమాలు ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్నాయి కూడా. ప్రతి భాషలో ఈ సినిమాలు సరికొత్త క్రైమ్ కథలతో వస్తున్నాయి. ఇక తెలుగులో కూడా ఇలాంటి కథలు బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఒక తెలుగు క్రైమ్ థ్రిల్లర్ గురించి చెప్పుకోవాలి. ఇందులో ‘చిలసౌ’ సినిమాలో సాఫ్ట్ క్యారెక్టర్ చేసిన రుహాని శర్మ, చాలా సీరియస్ పవర్‌ఫుల్ ACP పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి ఇందులో. సుమారు 103 నిమిషాల నిడివితో ఇన్వెస్టిగేషన్ సీన్లు ఆసక్తికరంగా ఉంటాయి. భారీ బడ్జెట్ కాకపోయినా, ఒక నీట్ అండ్ గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా దీనిని తెరకెక్కించారు.

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్

ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ తెలుగు సినిమా పేరు ‘Her – Chapter 1’. శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో రుహాని శర్మ, వికాస్ వశిష్ట, జీవన్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి Double Up Media బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమా 2023 జూలై 21న థియేటర్లలో విడుదలై మంచి టాక్ తో నడిచింది. 2023 సెప్టెంబర్ 15 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ మొదలైంది. ఈ కథ మామూలు మర్డర్ మిస్టరీతో మొదలై, అది ఒక పెద్ద నెట్‌వర్క్‌కి ఎలా కనెక్ట్ అవుతుందో రియలిస్టిక్‌గా చూపించారు.

స్టోరీ ఏమిటంటే

సినిమా మొదలవ్వడమే అర్చన ప్రసాద్ అనే ఒక పవర్ ఫుల్ లేడి పోలీస్ ఆఫీసర్‌తో మొదలవుతుంది. ఆమె ఏదో పాత గొడవ వల్ల ఆరు నెలలు సస్పెన్షన్‌లో ఉండి, ఇప్పుడే మళ్ళీ డ్యూటీలో చేరుతుంది. రాగానే ఆమె చేతికి ఒక డబుల్ మర్డర్ కేసు తగులుతుంది. స్వాతి అనే అమ్మాయిని, ఆమె ప్రియుడు విశాల్‌ని ఎవరో దారుణంగా చంపేస్తారు. ఆ శవాల్ని చూస్తేనే అర్థమవుతుంది ఇది మామూలు హత్య కాదు, దీని వెనుక ఏదో పెద్ద స్కెచ్ ఉందనే విషయం. ఇక అర్చన తన టీంతో కలిసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెడుతుంది. లోతుగా తవ్వే కొద్దీ ఈ కేసులో చాలా మెలికలు బయటపడతాయి. ముఖ్యంగా ఆ చనిపోయిన అమ్మాయి ఫోన్ మిస్ అవ్వడం, ఆ గ్యాంగ్‌స్టర్ కేశవ్ అనే వాడు ఈ సీన్ లోకి రావడం కథ మాంచి స్పీడు అందుకుంటుంది. క్లైమాక్స్ ఊహించని ట్విస్ట్ ఇస్తుంది. అసలు ఆ చనిపోయిన జంట ఎవరు? ఈ హత్యల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ఎందుకు చేశారు ? అనే విషయాలతో ఈ స్టోరీ చాలా ఉత్కంఠంగా సాగుతుంది.

Read Also :  పెళ్ళిరోజు పారిపోయే ప్రియుడు… ఫోటో గ్రాఫర్ తో ప్రేమ పాఠాలు… జీవితం చూపించే సినిమా

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×