E-Paper
Advertisement

Romantic Movie OTT: పెళ్ళిరోజు పారిపోయే ప్రియుడు… ఫోటో గ్రాఫర్ తో ప్రేమ పాఠాలు… జీవితం చూపించే సినిమా

Romantic Movie OTT: పెళ్ళిరోజు పారిపోయే ప్రియుడు… ఫోటో గ్రాఫర్ తో ప్రేమ పాఠాలు… జీవితం చూపించే సినిమా
Advertisement

Romantic Movie OTT : ఓటీటీలో ఒక అందమైన ప్రేమ కథ స్ట్రీమింగ్ లో ఉంది. ఇది పెళ్లి పీటల మీద మోసపోయిన ఒక సౌత్ ఆఫ్రికా అమ్మాయి, ఒక నైజీరియన్ ఫోటోగ్రాఫర్‌ తో ప్రేమలో పడే సన్నివేశాల చుట్టూ ఉంటుంది. ఈ సినిమాలో వీళ్ళ ప్రేమతో పాటు, ఈ రెండు దేశాల సంస్కృతులను కూడా చాలా అందంగా చూపించారు. ఈ సినిమాలోని, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్‌కి సరిగ్గా సెట్ అయ్యింది. ఆఫ్రికన్ దేశాల్లో ఇప్పుడు ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత ఒక అమ్మాయి, తన జీవితాన్ని మళ్ళీ ఎలా మొదలుపెట్టిందనే పాయింట్ మహిళా ప్రేక్షకులకు బాగా నచ్చింది

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్

ఈ రొమాంటిక్ సౌత్ ఆఫ్రికన్ మూవీ పేరు ‘సాఫ్ట్ లవ్’ (Soft Love). హోమ్స్ అవా దర్శకత్వంలో తెరకెక్కిన ఒక అందమైన ప్రేమ కథ ఇది. ఇందులో సిందీ మ్లాంగు, ఎఫా ఇవారా ప్రధాన పాత్రల్లో నటించారు. నైజీరియాకు చెందిన నెమ్సియా స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించింది. ఇది డైరెక్ట్‌గా 2024లో అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఇది 2025 ఆఫ్రికా మ్యాజిక్ వ్యూయర్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఎడిటింగ్ అవార్డుకు కూడా నామినేట్ అయింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఇందులో హీరోయిన్ జాందీ ఒక పెద్ద రిలేషన్ షిప్ ఎక్స్‌పర్ట్, అంటే అందరికీ ప్రేమ పాఠాలు చెబుతుంటుంది. కానీ తీరా తన పెళ్లి టైమ్ వచ్చేసరికి, పెళ్లి కొడుకు హ్యాండ్ ఇచ్చి పారిపోతాడు. దాంతో పాప మైండ్ బ్లాక్ అయిపోయి, అసలు ఈ లోకంలో ప్రేమా గీమా అంతా ట్రాష్ అని ఫిక్స్ అయిపోతుంది. గుండె పగిలిన బాధలో మళ్ళీ ఎవరినీ నమ్మకూడదని గట్టిగా డిసైడ్ అవుతుంది. ఇలాంటి టైమ్‌లో మన హీరో ఎడ్వర్డ్ ఎంట్రీ ఇస్తాడు. ఇతగాడు నైజీరియా నుంచి వచ్చిన ఒక ఫోటోగ్రాఫర్. అనుకోకుండా వీళ్ళిద్దరూ కలవాల్సి వస్తుంది. జాందీకి అస్సలు ఇంట్రెస్ట్ లేకపోయినా, ఎడ్వర్డ్ తన మంచితనంతో, స్టైల్‌తో మెల్లమెల్లగా ఆమెను ఆకట్టుకుంటాడు. లైఫ్ అంటే ఒక్క ఫెయిల్యూర్ తో ఆగిపోయేది కాదని తన పద్ధతిలో ఆమెకు అర్థమయ్యేలా చేస్తాడు. ఇక ఒక దక్షిణాఫ్రికా అమ్మాయి, నైజీరియా అబ్బాయి మధ్య కెమిస్ట్రీ అదిరిపోతుంది. అయితే మధ్యలో కొన్ని గొడవలు, అపార్థాలు వచ్చి మళ్ళీ దూరం అవుదాం అనుకుంటారు. కానీ చివరికి ఒకరి మీద ఒకరికి ఉన్న ఇష్టం వీళ్ళ ప్రేమను గెలిపిస్తుంది. సాఫ్ట్‌గా, క్యూట్‌గా సాగిపోయే లవ్ స్టోరీ మావా ఇది.

Read Also : తమ్ముడి జోలికొస్తే తలలు తీసే అన్న… ఐయండిబిలో 7.5 రేటింగ్…ఇదో ఆగని ప్రతీకార సెగ

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×