E-Paper
Advertisement

Crime Thriller Web Series OTT : భార్య మిస్సింగ్… పోలీసే అనుమానితుడు… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ భయ్యా

Crime Thriller Web Series OTT : భార్య మిస్సింగ్… పోలీసే అనుమానితుడు… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ భయ్యా
Advertisement

Crime Thriller Web Series OTT : ఈ మధ్య ఇన్వెస్టిగేషన్, సీరియల్ కిల్లర్ ల కథలు ఎక్కువ ట్రెండింగ్ లో ఉంటున్నాయి. ప్రేక్షకులు కూడా వీటిని కళ్లార్పకుండా చూస్తున్నారు. ఆడియన్స్ కి కావాల్సినంత థ్రిల్ ని ఇస్తున్నాయి ఈ జోనర్ సినిమాలు. ఇక వెబ్ సిరీస్ ల గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎక్కువ శాతం ఇలాంటి జానర్ లే వస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే తమిళ సిరీస్ మొదటి సీజన్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కూడా వచ్చింది. దానికి కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. వరుస హత్యల నేపథ్యంలో ఈ స్టోరీ ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ ఇంటెన్స్ గా సాగుతుంది. దీని పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘ఇరు ధురువం’ (iru dhuruvam) తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది సోనీలివ్ ఒరిజినల్‌ సిరీస్. కొత్త దర్శకుడు ఎం కుమరన్ దీనిని తెరకెక్కించాడు. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎ సైన్ ఆఫ్ లైఫ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సమీర్ నాయర్ దీనిని నిర్మించారు. ఈ సిరీస్‌ ప్రధాన పాత్రలో నంద దురైరాజ్ నటించగా, అబ్దుల్,సెబాస్టిన్ ఆంటోని, అభిరామి వెంకటాచలం మిగతా పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ SonyLIV కోసం రూపొందించబడిన మొదటి తమిళ ఒరిజినల్ స్ట్రీమింగ్ సిరీస్‌గా గుర్తించబడింది. మొదటి సీజన్ 2019 సెప్టెంబర్ 29న తొమ్మిది ఎపిసోడ్‌లతో విడుదలైంది. 2023 ఫిబ్రవరి 24న10 ఎపిసోడ్‌లతో రెండవ సీజన్ విడుదలైంది. ఈ సిరీస్ ప్రస్తుతం Sony LIV లో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : కిల్లర్ ని పరుగులు పెట్టించే హ్యాకర్… బుర్రకు పదును పెట్టే థ్రిల్లర్ మూవీ

స్టోరీ ఏమిటంటే

విక్టర్ సెల్వరాజ్(నంద) అనే ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అతను నగరంలో జరుగుతున్న వరుస హత్యలను విచారిస్తుంటాడు. ఈ హంతకుడు హత్యలు చేయడమే కాకుండా, సంఘటనా స్థలంలో క్లూస్ కూడా వదిలి వెళ్తుంటాడు. ఇదే సమయంలో విక్టర్ భార్య కూడా మిస్సింగ్ అవుతుంది. ఇక ఈ హత్యలతో పాటు, తన భార్య మిస్సింగ్ వెనుక ఉన్న రహస్యాన్ని కూడా ఛేదించాల్సి వస్తుంది. రెండు సీజన్లు చాలా ఉత్కంఠంగా ఉంటాయి. మొదటి సీజన్ ముగిసిన చోటు నుండే రెండో సీజన్ కూడ ప్రారంభమవుతుంది. విక్టర్ తన భార్య కోసం వెతుకుతూనే, హై ప్రొఫైల్ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న కొత్త హత్యల కేసును విచారిస్తాడు. చివరికి కిల్లర్ ఎవరు ? ఎందుకు హత్యలు చేస్తున్నాడు ? విక్టర్ భార్య మిస్సింగ్ వెనుక సీక్రెట్ ఏమిటి ? అనే విషయాలను ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×