E-Paper
Advertisement

Rafale Jets: భారత రక్షణ రంగంలో సరికొత్త శకం.. 114 రాఫెల్ విమానాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్!

Rafale Jets: భారత రక్షణ రంగంలో సరికొత్త శకం.. 114 రాఫెల్ విమానాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్!
Advertisement

భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. భారత వైమానిక దళం (IAF) అమ్ములపొదిలోకి మరిన్ని ‘రాఫెల్’ యుద్ధ విమానాలను చేర్చేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన భారీ డీల్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) ఆమోద ముద్ర వేసింది. సుమారు రూ. 3.25 లక్షల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ మెగా డీల్, భారత రక్షణ చరిత్రలోనే అత్యంత భారీ ఒప్పందాలలో ఒకటిగా నిలవనుంది.

ఈ ఒప్పందం కేవలం విమానాల కొనుగోలుకే పరిమితం కాకుండా.. దేశీయ తయారీ రంగానికి (Make in India) భారీ ఊతం ఇవకవపేంది. మొత్తం 114 విమానాలలో, మొదటి 12 నుంచి 18 విమానాలను ఫ్రాన్స్ నుంచి నేరుగా  దిగుమతి చేసుకోనున్నారు. అయితే.. మిగిలిన విమానాలను భారత స్వదేశీ కంపెనీల భాగస్వామ్యంతో భారత్‌లోనే తయారు చేయనున్నటు తెలుస్తోంది. విమానాల తయారీలో కనీసం 30 శాతం నుంచి 60 శాతం వరకు స్వదేశీ విడిభాగాలను వాడాలని భారత్ కఠిన నిబంధన విధించింది. దీనివల్ల దేశీయ రక్షణ పరిశ్రమలకు పని బడనుంది.

Advertisement

ఈ దఫా ఒప్పందంలో భారత్ అత్యంత కీలకమైన షరతులను ఉంచింది. రాఫెల్ యుద్ధ విమానాల సాఫ్ట్‌వేర్ ‘సోర్స్ కోడ్’ను భారత్‌కు అప్పగించాలని ఫ్రాన్స్‌ను కోరింది. సోర్స్ కోడ్ అందుబాటులో ఉంటే.. భవిష్యత్తులో మన అవసరాలకు అనుగుణంగా విమానంలోని ఆయుధ వ్యవస్థలను లేదా సాఫ్ట్‌వేర్‌ను స్వయంగా అప్‌గ్రేడ్ చేసుకునే వీలుంటుంది. ఇది రక్షణ పరంగా భారత్‌కు పూర్తి స్వయంప్రతిపత్తిని కల్పిస్తుంది.

దక్షిణ భారత దేశానికి.. ముఖ్యంగా భాగ్యనగరానికి ఈ ఒప్పందంతో కీలక గుర్తింపు లభించనుంది. రాఫెల్ ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్ హాలింగ్ కోసం హైదరాబాద్‌లో ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో విమానాల నిర్వహణ సులభతరం కావడమే కాకుండా.. స్థానికంగా నిపుణులైన ఇంజనీర్లకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

Advertisement

ప్రస్తుతం భారత వైమానిక దళంలో యుద్ధ విమానాల స్క్వాడ్రన్ల సంఖ్య ఆందోళనకరంగా 29కి పడిపోయింది. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో సవాళ్లను ఎదుర్కోవాలంటే కనీసం 42 స్క్వాడ్రన్లు ఉండాలని రక్షణ నిపుణులు చెబుతుంటారు. ఈ లోటును భర్తీ చేసేందుకు 114 కొత్త రాఫెల్ విమానాల రాక ఎంతో కీలకం కానుంది. అత్యాధునిక క్షిపణులు, రాడార్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సామర్థ్యం కలిగిన రాఫెల్ విమానాలు సరిహద్దుల్లో భారత్ ఆధిక్యతను మరింత పెంచనున్నాయి.

ALSO READ: Largest Sea Snake: ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర పాము, ఇది ఏకంగా సొరచేపలనే తినేస్తోంది!

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×