E-Paper
Advertisement

Web Film OTT : ఓటీటీలోకి వస్తున్న జీవీ ప్రకాష్ వెబ్ ఫిల్మ్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

Web Film OTT : ఓటీటీలోకి వస్తున్న జీవీ ప్రకాష్ వెబ్ ఫిల్మ్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?
Advertisement

Web Film OTT : జివి ప్రకాష్ కుమార్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘లక్కీ ది సూపర్ స్టార్’ వెబ్ ఫిల్మ్ ఓటీటీలోకి వస్తోంది. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రూపొందింది. ఇది ఒక తప్పిపోయిన కుక్కపిల్ల చుట్టూ తిరిగే ఎమోషనల్ డ్రామా. పిల్లలతో కలిసి, ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చెయ్యచ్చు ఈ సినిమాను చూస్తూ. మరి ఇది ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో తెలుసుకుందాం పదండి.

ఎప్పుడు ఎక్కడ చూడచ్చు అంటే

‘లక్కీ ది సూపర్ స్టార్’ (Lucky The Superstar) 2026 ఫిబ్రవరి 20 నుండి నేరుగా జియో హాట్ స్టార్ (JioHotstar) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో జి.వి. ప్రకాష్ కుమార్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటించగా, శరత్ కుమార్, కోవై సరళ, దేవదర్శిని ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌లో ‘చెల్లం సార్’గా పేరు తెచ్చుకున్న ఉదయ్ మహేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ (ఖుషి ఫేమ్) సంగీతాన్ని అందించారు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా రానుంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఈ కథ లక్కీ అనే ఒక కుక్కపిల్ల చుట్టూ తిరుగుతుంది. ఒక రోజు అనుకోకుండా, లక్కీ తన యజమాని నుంచి దూరమై పోతుంది. అలా దారితప్పిన ఆ కుక్కపిల్ల వేర్వేరు మనుషుల దగ్గరకు వెళ్తుంది. ఆశ్చర్యకరంగా, లక్కీ వెళ్ళిన ప్రతిచోటా ఏదో ఒక మంచి జరుగుతుంటుంది. దిగులుగా ఉన్న ఒక చిన్న పాపను నవ్వించడం, గొడవ పడుతున్న ఒక ఫ్యామిలీని కలపడం, ఒక మ్యూజిషియన్‌కి తోడుగా ఉండటం ఇలా అందరి జీవితాల్లో అది ఒక ‘సూపర్ స్టార్’లా మారిపోతుంది.

కానీ ఇంతలో మున్సిపాలిటీ వాళ్లు వీధి కుక్కలను పట్టుకునే పని మొదలుపెడతారు, అందులో లక్కీ కూడా చిక్కుకుంటుంది. ప్రాణంగా పెంచుకున్న కుక్కపిల్ల కనిపించకపోవడంతో హీరో (జి.వి. ప్రకాష్) కంగారుపడి దాన్ని వెతకడం మొదలుపెడతాడు. చివరికి లక్కీని అతను ఎలా కనిపెట్టాడు? ఆ కుక్కపిల్ల వల్ల ఎన్ని జీవితాలు మారాయి? అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ.

Advertisement

Read Also : అప్పులు తీర్చడానికి 400 ఏళ్ల నాటి రాజభవనం అమ్మకం… తోలు తీసే ప్రేతాత్మ… ఐయండిబిలో టాప్ రేటింగ్

Tags

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×