E-Paper
Advertisement

చిన్న డిటెక్టివ్ చేతికి పెద్ద కేసు… నవ్వులు పూయిస్తూనే వెన్నులో వణుకు పుట్టించే మర్డర్ మిస్టరీ

చిన్న డిటెక్టివ్ చేతికి పెద్ద కేసు… నవ్వులు పూయిస్తూనే వెన్నులో వణుకు పుట్టించే మర్డర్ మిస్టరీ
Advertisement

Mystery Thriller Movie on OTT : ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలలో వచ్చే ఊహించని ట్విస్టులు ఆడియన్స్ కు మంచి థ్రిల్ ఇస్తాయి. అయితే సాధారణంగా డిటెక్టివ్ సినిమాలు అనగానే సీరియస్ మోడ్ లో యాక్షన్ తో దుమ్మురేపే జేమ్స్ బాండ్ సినిమాలే గుర్తొస్తాయి. కానీ ఇలాంటి జానర్ కు కాస్త కామెడీ టచ్ ఇస్తే, అందులోనూ చిన్న పిల్లలే డిటెక్టివ్ గా మారితే… ఊహించడానికే క్రేజీగా ఉంది కదూ. ఇలాంటి స్టోరీలైన్ తో వచ్చిన సినిమానే ఈరోజు మన మూవీ సజెషన్.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

కామెడీ అండ్ మిస్టరీ కలగలిసి తెరకెక్కిన వినూత్నమైన డార్క్ థ్రిల్లర్ The Kid Detective (2020). బాల్యంలోనే అద్భుతమైన తెలివితేటలతో కేసులు ఛేదించి ‘కిడ్ డిటెక్టివ్’గా పేరు తెచ్సుకుంటాడు హీరో. కానీ అతనే పెద్దయ్యాక తన జీవితంలో ఎలా దెబ్బతిన్నాడనేది ఈ సినిమా ప్రధానాంశం. ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Video, Apple TV అనే రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ట్విస్ట్ ఏంటంటే… ఈ మూవీని ఫ్రీగా చూసే ఛాన్స్ లేదు. రెండు ఓటీటీలలోనూ రెంట్‌ కి అందుబాటులో ఉంది. మామూలు డిటెక్టివ్ సినిమాలా కాకుండా, ఒక మనిషి ఫెయిల్యూర్ అయితే, సమాజం అతన్ని చూసే తీరును ఇందులో చక్కగా విశ్లేషించారు. ఆడమ్ బ్రాడీ నటన ఈ సినిమాకు ప్రాణం పోసిందని చేప్పాలి. సస్పెన్స్ మిస్టరీలతో పాటు డార్క్ హ్యూమర్ ను ఇష్టపడే వారికి ఈ మూవీ బెస్ట్ సజెషన్.

కథలోకి వెళ్తే…

Advertisement

మన హీరో పేరు అబే యాపిల్‌బామ్ (ఆడమ్ బ్రాడీ). అతను చిన్నప్పుడే డిటెక్టివ్ ఆఫీస్ ఓపెన్ చేస్తాడు. ఊర్లో చిన్న చిన్న కేసులను అవలీలగా ఛేదిస్తూ, అందరి చేత హీరో అన్పించుకుంటాడు. కానీ చిన్నతనంలోనే తన స్నేహితురాలు ‘గ్రేసీ’ కిడ్నాప్ అవుతుంది. అప్పటికే పలు కేసులను సాల్వ్ చేసిన ఈ చిన్ని డిటెక్టివ్, ఫ్రెండ్ కిడ్నాప్ కేసును మాత్రం ఛేదించలేకపోతాడు. ఆ ఫెయిల్యూర్ అతన్ని కుంగదీస్తుంది. ఆ తరువాత పెద్దవాడై, 32 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా అదే ఆఫీసులో ఉంటూ, మత్తుకు బానిస అవుతాడు. ఎవరూ పట్టించుకోని సాదాసీదా కేసులు సాల్వ్ చేస్తూ ఉంటాడు.

ఓరోజు మాత్రం కరోలిన్ అనే టీనేజ్ అమ్మాయి అబే దగ్గరికి వచ్చి షాకింగ్ విషయం చెప్తుంది. తన ప్రియుడిని ఎవరో దారుణంగా చంపేశారని, ఆ హంతకుడిని పట్టుకోవాలని అతన్ని రిక్వెస్ట్ చేస్తుంది ఇన్నాళ్లూ తప్పిపోయిన పిల్లులను వెతికి పెడుతున్న అబేకి, ఇది గోల్డెన్ ఛాన్స్ లా అన్పిస్తుంది. తన జీవితంలోనే మొదటి ‘రియల్ మర్డర్ మిస్టరీ’. ఈ కేసును ఛేదించి, పాత గౌరవాన్ని తిరిగి దక్కించుకోవాలన్న ఆలోచనతో రంగంలోకి దిగుతాడు. కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొద్దీ, ఈ హత్యకు 20 ఏళ్ల క్రితం జరిగిన గ్రేసీ కిడ్నాప్ కేసుకు సంబంధం ఉందని తెలుసుకుంటాడు.

Advertisement

అబే ఇన్వెస్టిగేషన్ లో ఈ కేసు ఊహించని మలుపులు తిరుగుతుంది. హంతకుడు ఎవరో కాదు, అతనికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి అనే షాకింగ్ విషయం బయట పడుతుంది. ఆ వ్యక్తి కేవలం కరోలిన్ ప్రియుడిని మాత్రమే కాదు, గతంలో గ్రేసీని కిడ్నాప్ చేసి ఇన్నాళ్లూ తన ఇంట్లోనే బందీగా ఉంచినట్టు అబే కనిపెడతాడు. క్లైమాక్స్‌ సీన్ ఎమోషనల్‌ గా, షాకింగ్‌ గా ఉంటుంది. చివరకు అబే ఆ హంతకుడిని ఎలా పట్టుకున్నాడు? తన స్నేహితురాలిని ఎలా కనిపెట్టాడు ? అనేది తెలియాలంటే మూవీని చూడాల్సిందే.

Read Also : క్లీనర్ గా వెళ్తే బయటపడే దిమ్మతిరిగే సీక్రెట్… ఇకపై ప్రాణాలపై ఆశ ఉంటే పని మనిషిగా వెళ్లరు

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×