E-Paper
Advertisement

Hyderabad News: ప్రపంచవ్యాప్తంగా అంబరాన్ని తాకిన న్యూఇయర్ వేడుకలు.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి

Hyderabad News: ప్రపంచవ్యాప్తంగా అంబరాన్ని తాకిన న్యూఇయర్ వేడుకలు.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి
Advertisement

Hyderabad News: ప్రపంచవ్యాప్తంగా న్యూఇయర్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిగాయి. అర్ధరాత్రి రెండు గంటల వరకు చిన్నారులు, పెద్దలు అర్థరాత్రి వరకు రోడ్లపైకి వచ్చి కొత్త సంవత్స శుభాకాంక్షలు చెప్పుకొచ్చారు. బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్‌లో నూతన సంవత్సర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

హైదరాబాద్ న్యూఇయర్ వేడుకలకు హాజరైన సీఎం రేవంత్

Advertisement

ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ దేశాల్లో ప్రజలు అర్థరాత్రి వరకు సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని బేగంపేటలో ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ క్లబ్‌లో నూతన సంవత్సరం బుధవారం రాత్రి వైభవంగా జరిగాయి. ఈ వేడుకల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ దంపతులు స్వాగతం పలికారు. పలువురు ఐఏఎస్‌ అధికారులు వారి వారి కుటుంబసభ్యులతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సీఎం రేవంత్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.  కొత్త ఏడాదిలో ప్రతీ కుటుంబం ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. కొత్త ఏడాది అందరి జీవితాల్లో కొత్త ఆశలు, విజయాలు, సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. 2026 ఏడాది తెలంగాణ పురోగతిలో అద్భుతమైన మైలురాళ్లను అధిగమిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రైతులు, యువత, మహిళల సంక్షేమంతోపాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి విజన్–2047 లక్ష్యాలను సాధించడంలో మరింత వేగవంతమైన ప్రణాళికలతో ముందుకు సాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల మద్దతు సహకారంతో అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని కోరారు.

Advertisement

రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

అటు మాజీ సీఎం కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు రాజీలేని పోరాటం బీఆర్ఎస్ పార్టీ చేస్తోందన్నారు. నూతన సంవత్సరంలో ప్రజలు తమకు అప్పగించిన బాధ్యతను నిర్వహిస్తుందని తెలిపారు.  వ్యవసాయ, సాగునీటి రంగాలు గాడినపడి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తెలంగాణ రైతాంగం,మహిళలు, సకల జనులు, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు మాజీ సీఎం కేసీఆర్.

హైదరాబాద్‌ నగర ప్రజలకు సీపీ సజ్జనార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నేరాల నియంత్రణలో ప్రజల నుంచి చక్కని సహకారం ఉందన్నారు. ఈ ఏడాది అదే కంటిన్యూ కావాలని ఆకాంక్షించారు. తాము అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. కొత్త ఏడాదిలో అందరూ ఆయురారోగ్యాలు ఉండాలన్నారు. న్యూఇయర్ సందర్భంగా 10 వేల మందికి పైగా విధుల్లో పాల్గొన్న పోలీసులకు, సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ALSO READ:  కేసీఆర్‌తో మాజీ మంత్రులు భేటీ, అసెంబ్లీ యుద్ధానికి  వ్యూహ రచన

 

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×