E-Paper
Advertisement

Brahmamudi Serial Today January 1st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: పసరు మందు జ్యూస్ లో కలిపిన రుద్రాణి

Brahmamudi Serial Today January 1st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: పసరు మందు జ్యూస్ లో కలిపిన రుద్రాణి
Advertisement

Brahmamudi serial today Episode:

కావ్య కడుపులో బిడ్డను చంపేసి ఇక కావ్యకు ఎప్పటికీ పిల్లలు కాకుండా చేస్తే.. కావ్యే ఇంటిల్లిపాదిని ఒప్పించి మరీ రాజ్‌కు మరో పెళ్లి చేస్తుంది. అప్పుడు రాజ్‌కు భార్యగా ఈ ఇంటికి కోడలిగా నా కూతురు రేఖ అన్ని విధాలా అర్హురాలు అని వాళ్ల ముందు నువ్వు నా చెల్లిని నిలబెట్టావో అనుకో రేఖ, రాజ్‌ కు భార్య అయ్యే చాన్స్‌ ఉండదంటావా మమ్మీ అని అడుగుతాడు. రాహుల్‌. దీంతో రేఖ ఆనందంతో అన్నయ్య థాంక్స్‌ అన్నయ్య నా లైఫ్‌ను నిలబెట్టే మాట చెప్పావు. మమ్మీ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. అన్నయ్య చెప్పింది జరగాలి జరిగి తీరాలి అంతే.. అంటుంది.

దీంతో రుద్రాణి కూడా సరే మీరు ఒక నిర్ణయానికి వచ్చాక నేను మాత్రం కాదనేదేముంది. నా కూతురు ఈ ఇంటి కోడలు అవుతుందంటే అంతకన్నా కావాల్సింది ఏముంది. నాకు సంతోషమే అంటుంది రుద్రాణి.. దీంతో రాహుల్‌ ఆ సంతోషం నీ సొంతం కావాలంటే ముందు కావ్య కడుపులో ఉన్న బిడ్డ కన్నుమూయాలి మమ్మీ అని చెప్తాడు. రుద్రాణి అది నేను చూసుకుంటాను నువ్వు ఆ రాజ్‌ గాడి సంగతి చూసుకో అని చెప్తుంది. దీంతో రాహుల్‌ ఆల్‌ రెడీ ప్లాన్‌ అమలు అవుతుంది మమ్మీ అని చెప్తాడు రాహుల్‌. రేఖ హ్యాపీగా ఫీలవుతుంది.

Advertisement

హాల్లో కూర్చున్న కావ్య, అప్పులు గార్డెన్‌లో ఉన్న కళ్యాణ్‌, రాజ్‌ దగ్గరకు వెళ్లి తమకు బోర్‌ కొడుతుందని గొడవ పడతారు. దీంతో అయితే వెయిట్‌ చేయండి మీకు బోర్‌ కొట్టకుండా ఎంటర్‌టైన్‌ చేస్తే సరిపోతుంది కదా అంటాడు రాజ్‌. అదెలా చేస్తారని అప్పు అడుగుతుంది. సర్‌ఫ్రైజ్‌ బోరింగ్‌తో అలిసిపోయిన మీ జీవితాలు రేపటి నుంచి వేంగం పుంజుకుటాయి అని రాజ్‌ చెప్పగానే.. ఎలా ఏంటనేది రేపు బుల్లి తెర మీద మీరే చూడండి పద అన్నయ్య అంటూ ఇద్దరూ కలిసి వెళ్లిపోతారు. తర్వాత పసరు మందు వీరయ్య ఇంటి ముందు నిలబడి రుద్రాణికి ఫోన్‌ చేస్తాడు. పసరు మందు తీసుకొచ్చానని చెప్తాడు. దీంతో రుద్రాణి బయటకు వెళ్తుంది. ఏదీ నేను అడిగిన మందు అని అడుగుతుంది రుద్రాణి. ఒక మందు తీసి రుద్రాణికి ఇస్తూ.. ఇదేనమ్మా మీరు అడిగిన పసరు మందు అని చెప్తాడు. ఇది పని చేస్తుందా అని రుద్రాణి అడగ్గానే..

ఈ పసరు మందు ఒక్కసారి కడుపులోకి వెళ్లిందంటే పిండం కకావికలం అవ్వడం కాయం. కడుపునొప్పి మొదలవుతుంది. మీరు తాగించండి అమ్మ అని చెప్తాడు వీరయ్య. పూర్తిగా కడుపు కడిగినట్టు కావాలని చెప్పాను కదా..? అవుతుందా..? అని అడగ్గానే.. రేపు ఇంకో పసరు మందు తెచ్చి ఇస్తాను. అది కూడా ఒక చెంచాడు ఏ పాలల్లోనో జ్యూస్‌లోనో కలిపి ఇచ్చారంటే మొత్తం కడిగేస్తుంది. ఇక జీవితంలో నిలబడదు అని చెప్తాడు. దీంతో రుద్రాణి ఆ వీరయ్యకు డబ్బులు ఇచ్చి రేపు తప్పకుండా ఆ పసరు కూడా తీసుకురా అని చెప్తుంది. వీరయ్య అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రుద్రాణి హ్యాపీగా చూస్తూ.. కావ్య నీ బ్యాడ్‌ టైమో.. నాగుడ్‌ టైమో అర్థం కావడం లేదు కరెక్ట్‌ టైంలో నా కూతురు దిగింది. నీకు ఈ కుటుంబానికి తెలియకుండానే ఈ ఆస్థి అంతా నా కూతురుకు దక్కబోతుంది. అందుకు  ఈ పసరు మందు సాయం చేయబోతుంది. చెప్తా.. అనుకుంటూ లోపలికి వెళ్లిపోతుంది రుద్రాణి.

Advertisement

మరుసటి రోజు సుభాష్‌, ప్రకాష్‌ టిఫిన్‌ చేయడానికి వెళ్లే సరికి అందరూ టిఫిన్‌ చేస్తూ ఉంటారు. అందరూ వాళ్లిద్దరిని చూసి రండి రండి ఆఫీసుకు టైం అవుతుంది అంటూ ఆట పట్టిస్తుంటారు. అందరూ డైనింగ్‌ టేబుల్‌ దగ్గర ఉంటే రుద్రాణి, రేఖ రాజ్‌ రూంలోకి వెళ్లి అక్కడి జ్యూస్‌లో పసరు మందు కలుపుతారు. దీంతో రేఖ మమ్మీ ఈ పసరు మందు పని చేస్తుందా..? అని అడుగుతుంది. అడవిలో నుంచి తెచ్చిన ఈ పసరు మందు ఫెయిల్‌ అయ్యే ప్రసక్తే లేదు. రెండు మూడు రోజుల్లో కావ్య కడుపులో ఉన్న బిడ్డ పైకి వెళ్లిపోతుంది అంటూ రుద్రాణి చెప్తుంది. ఇక్కడ చాలా సేపు ఉంటే ఎవరైనా చూస్తారు అనుమానం వస్తుంది వెళ్దాం పద అంటూ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×