OTT Movie : ఇటీవల కాలంలో ఓటీటీలలో మెడికల్ థ్రిల్లర్ లకు ఆదరణ పెరుగుతోంది. అనారోగ్యం అంటూ హాస్పిటల్ కు వెళ్తే అక్కడ జరిగే ఘోరమైన నేరాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. అలాంటి భయంకరమైన స్టోరీ లైన్స్ మేకర్స్ ఆడియన్స్ కోసం ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్ లు రూపొందిస్తున్నారు. మీకు కూడా మెడికల్ థ్రిల్లర్లు అంటే స్పెషల్ ఇంట్రస్ట్ ఉందా ? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే.
తమిళ్ సినిమా లవర్స్ కోసం 2025లో వచ్చిన మరో ఆసక్తికరమైన మెడికల్ థ్రిల్లర్ ‘అదర్స్’ (Others). థియేటర్లలో రన్ పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు నేరుగా ఓటీటీ స్పేస్‌లోకి అడుగు పెట్టింది ఈ మూవీ. దర్శకుడు అబిన్ హరిహరన్ రాసి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం IVF చుట్టూ జరిగే భారీ కుట్రను దర్యాప్తు చేసే పోలీస్ ఆఫీసర్ కథ. డెబ్యూ హీరో అదిత్య మాధవన్, గౌరీ కిషన్, అంజు కురియన్ ప్రధాన పాత్రల్లో నటించారు. మునీష్‌కాంత్, హరీష్ పెరడి, ఆర్ సుందర్రాజన్, నందు జగన్, మాలా పార్వతి, వినోద్ సాగర్ వంటి నటులు మిగతా కీ రోల్స్‌లో కనిపిస్తారు. టెక్నికల్ టీమ్‌లో సినిమాటోగ్రఫీ అరవింద్ సింగ్, ఎడిటింగ్ ఆర్ రామర్, మ్యూజిక్ ఘిబ్రాన్ వైబోధ చేశారు. ఇప్పుడు Amazon Prime Videoలో మూవీ స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది.
Read Also : 2025లో స్టాండ్ అవుట్ పర్ఫామెన్స్ ఇచ్చిన ఓటీటీ స్టార్స్ వీళ్ళే… ఒక్కొక్క స్టార్ ఒక్కో ఆణిముత్యం
ఇటీవల కాలంలో పిల్లలు పుట్టకపోవడం అనేది కామన్ సమస్యగా మారింది. ఆ సమస్యకు పరిష్కారంగా ఐవీఎఫ్ అనే పద్ధతిలో చాలా మంది పేరెంట్స్ పిల్లలకు జన్మనిచ్చి తల్లిదండ్రులుగా సంతోష పడుతున్నారు. కానీ ఇలాంటి సున్నితమైన అంశంలో కూడా స్కామ్ ఉంటే? అలాంటి మూవీనే ‘అదర్స్’. ఈ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్‌లో ఒక పోలీస్ ఆఫీసర్ IVF ద్వారా పుట్టిన పిల్లల చుట్టూ జరిగే మిస్టీరియస్ కుట్రను రివీల్ చేస్తాడు. ఆ మెడికల్ స్కామ్ లో ఎగ్స్ దొంగతనం, నిషేధిత రసాయనాల వాడకం వంటి డార్క్ సీక్రెట్స్ బయటపడతాయి. కథలో సస్పెన్స్, ట్విస్టులు ఎక్కువగా ఉండటం హైలైట్. సినిమా థియేటర్లలో మిక్స్డ్ రివ్యూస్ అందుకుంది. అయితే ప్రెస్ మీట్‌లో జరిగిన ఒక ఘటన వల్ల ఈ మూవీ అందరి దృష్టి ఆకర్షించింది. లీడ్ యాక్ట్రెస్ గౌరీ కిషన్ ను ఒక జర్నలిస్ట్‌ను బాడీ షేమింగ్ చేసినందుకు గట్టిగా తిట్టడం వైరల్ అయింది. సస్పెన్స్, క్రైమ్ ఎలిమెంట్స్‌తో నిండిన సినిమాను చూడాలనుకునే వారికి ఈ మూవీ బెస్ట్ ఆప్షన్.