E-Paper
Advertisement

Science fiction Thriller OTT: యజమానికి చుక్కలు చూపించే రోబో… అబ్బురపరిచే విజువల్స్… ఐయండిబిలో టాప్ రేటింగ్ కూడా

Science fiction Thriller OTT: యజమానికి చుక్కలు చూపించే రోబో… అబ్బురపరిచే విజువల్స్… ఐయండిబిలో టాప్ రేటింగ్ కూడా
Advertisement

Science fiction Thriller OTT : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తోనే ఫ్యూచర్ ఉంటుదనే సంకేతాలు బలంగా వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా గురించి ఎంతైనా చెప్పుకోవాల్సిందే. ఇందులో ఒక రోబో మనుషులను ఎలా మోసం చేస్తుందో చాలా షాకింగ్ గా చూపిస్తారు. క్లైమాక్స్ వరకు ఇది చూపు తిప్పుకోకుండా చేస్తుంది. ఈ సినిమా అనేక అవార్డులను కూడా సొంతం చేసుకుంది. దీని పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

ఈ సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ఎక్స్ మెషీనా’ (Ex Machina). 2014లో విడుదలైన ఈ చిత్రానికి అలెక్స్ గార్లాండ్ దర్శకత్వం వహించారు. ఇందులో డోమ్నాల్ గ్లీసన్, అలీసియా వికాండర్, ఆస్కార్ ఐజాక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 88వ అకాడమీ అవార్డులలో ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది. ఇది $15 మిలియన్ల బడ్జెట్‌తో ప్రపంచవ్యాప్తంగా $36.8 మిలియన్లకు పైగా వసూలు చేసింది. 73వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో వికాండర్ కు ఉత్తమ సహాయ నటిగా కూడా నామినేట్ అయింది. ఈ సినిమా అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్ స్టార్ (JioHotstar) లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కాలేబ్ అనే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన బాస్ నాథన్ పిలుపు మేరకు, ఊరికి దూరంగా ఉన్న ఒక ఫామ్ హౌస్‌కు వెళ్తాడు. అక్కడ నాథన్ ‘అవా’ అనే ఒక రోబోను చూపిస్తాడు. ఆ రోబోకు మనుషుల లాంటి తెలివితేటలు ఉన్నాయో లేదో టెస్ట్ చేయడమే కాలేబ్ పని. కానీ కాలేబ్ ఆడ రూపంలో ఉన్న ఆ రోబోతో మాట్లాడుతున్న కొద్దీ ఆమె మాటలకు పడిపోతాడు. నాథన్ మంచోడు కాదని, తనను ఎలాగైనా కాపాడమని అవా కోరడంతో కాలేబ్ ఆ రోబోను బయటికి పంపాలని ప్లాన్ చేస్తాడు. కానీ చివర్లో అసలు ట్విస్ట్ ఏంటంటే.. అవా తన తెలివితేటలతో కాలేబ్‌ను వాడుకుంటుంది. నాథన్‌ను చంపేసి, కాలేబ్‌ను కూడా అక్కడే గదిలో బంధించేసి, ఎవరికీ తెలియకుండా ఆమె బయటి ప్రపంచంలోకి వెళ్లిపోతుంది. అంటే మనుషుల కంటే తెలివిగా ఆలోచించే మెషీన్లను తయారు చేస్తే అవి ఎంత డేంజరో ఈ సినిమాలో చూపిస్తారు.

Read Also : పిచ్చి ప్రేమతో పెళ్లి వరకు… విడాకులతో ఊహించని మలుపు… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్టోరీ

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×