E-Paper
Advertisement

Poco M8 5G: 108MP కెమెరా, 5220mAh బ్యాటరీతో పోకో M8 లాంచ్.. .. ఇండియాలో ధర ఎంతంటే

Poco M8 5G: 108MP కెమెరా, 5220mAh బ్యాటరీతో పోకో M8 లాంచ్.. .. ఇండియాలో ధర ఎంతంటే
Advertisement

Poco M8 5G India Launch| పోకో కంపెనీ ఇండియాలో తన కొత్త స్మార్ట్‌ఫోన్ పోకో M8 5Gని అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్ మిడ్-రేంజ్ 5G మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ వచ్చింది. కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, బలమైన ప్రాసెసర్, పెద్ద బ్యాటరీతో ప్రీమియం ఫీచర్లను సరసమైన ధరలో అందిస్తోంది.

పోకో ఎం8 5జీ ఇండియాలో ధర ఎంత?

పోకో ఎం8 5జీ మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.21,999. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999. టాప్ మోడల్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ధర రూ.24,999.

లాంచ్ ఆఫర్లు, డిస్కౌంట్లు

Advertisement

పోకో కంపెనీ ఫోన్ లాంచ్ సందర్భంగా కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన లాంచ్ ఆఫర్లు ప్రకటించింది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో రూ.2,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. మొదటి 12 గంటల్లో కొనుగోలు చేస్తే అదనంగా రూ.1,000 డిస్కౌంట్ ఉంటుంది. ఈ ఆఫర్లతో ఫోన్ ధర చాలా తక్కువ అవుతుంది.

సేల్ తేదీ, కలర్ ఆప్షన్లు

పోకో M8 5G సేల్ జనవరి 13 నుంచి ఇండియాలో ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మూడు అందమైన కలర్లలో వస్తుంది: కార్బన్ బ్లాక్, గ్లేషియల్ బ్లూ మరియు ఫ్రాస్ట్ సిల్వర్.

డిస్‌ప్లే, డిజైన్ ఫీచర్లు

Advertisement

పోకో M8 5Gలో 6.77 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 3డీ కర్వ్డ్ ప్యానల్‌తో ప్రీమియం లుక్ ఇస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ ఎక్స్‌పీరియన్స్, పగలు ఎండలో కూడా కనిపించేలా 3,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంది. ఫోన్ మందం కేవలం 7.35mm మాత్రమే.

పెర్ఫామెన్స్, హార్డ్‌వేర్

ఈ ఫోన్‌ను స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్ పవర్ చేస్తుంది. ఇది 4nmఎం టెక్నాలజీతో తయారైంది. 8జీబీ వరకు ర్యామ్‌తో మల్టీటాస్కింగ్ సులభం. 256GB వరకు స్టోరేజ్, మైక్రోఎస్‌డీ కార్డుతో 1TB వరకు పెంచవచ్చు.

సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ

పోకో M8 5G ఆండ్రాయిడ్ 15తో హైపర్‌ఓఎస్ 2 ఇంటర్‌ఫేస్‌లో వస్తుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో మంచి సౌండ్. నాలుగు ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, ఆరేళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లు హామీ ఇచ్చింది.

Also Read: ఫ్లిప్‌కార్ట్‌ డెలివరీలో మోసం.. కొత్త ల్యాప్‌టాప్‌కు బదులు ఏం వచ్చిందంటే

కెమెరా స్పెసిఫికేషన్లు

డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP ప్రైమరీ కెమెరాతో రోజువారీ ఫోటోలు బాగుంటాయి. 2MP సెకండరీ సెన్సార్ డెప్త్ కోసం. ఫ్రంట్‌లో 20MP సెల్ఫీ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్ 

పెద్ద 5,520mAh బ్యాటరీ ఉంది. ఒక్క చార్జ్‌తో పూర్తి రోజు సులభంగా నడుస్తుంది. 45వాట్ ఫాస్ట్ చార్జింగ్, 18వాట్ రివర్స్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. బాక్స్‌లో చార్జర్ ఇస్తున్నారు.

బిల్డ్ క్వాలిటీ, ప్రొటెక్షన్

ఐపీ65, ఐపీ66 రేటింగ్‌లతో డస్ట్, వాటర్ స్ప్లాష్‌ల నుంచి రక్షణ ఉంది. ఫోన్ బరువు కేవలం 178 గ్రాములు మాత్రమే.

పోకో M8 5G సరసమైన ధరలో బలమైన ఫీచర్లు అందిస్తోంది. ప్రీమియం డిస్‌ప్లే, మంచి పెర్ఫామెన్స్, లాంగ్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌తో మిడ్-రేంజ్ కొనుగోలుదారులకు ఆకర్షణీయం. లాంచ్ ఆఫర్లు మరింత ఈ ఫోన్ బడ్జెట్ కొనుగోలు దారులకు మరింత చేరువ చేస్తాయి.

Related News

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

Big Stories

Advertisement
×