E-Paper
Advertisement

మాయా తాయత్తు కోసం రాక్షసులతో భీకరమైన పోరాటం… ఓటీటీలో ఆకట్టుకుంటున్న ఫాంటసీ అడ్వెంచర్

మాయా తాయత్తు కోసం రాక్షసులతో భీకరమైన పోరాటం… ఓటీటీలో ఆకట్టుకుంటున్న ఫాంటసీ అడ్వెంచర్
Advertisement

Fantasy Adventure OTT : ఓటీటీలోకి ఒక ఫాంటసీ అడ్వెంచర్ సినిమా వచ్చేసింది. ఇది పాత కాలపు అడ్వెంచర్ సినిమాలను ఇష్టపడే వారికి, ముఖ్యంగా కత్తుల యుద్ధాలు, వింత రాక్షసుల కథలను కోరుకునే వాళ్ళకి ఒక మంచి ఆప్షన్. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో నేటి కాలపు సినిమాల్లో లాగా కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడకుండా, 80ల నాటి పద్ధతిలో ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ ఉపయోగించి తీశారు. అంటే రాక్షసుల కోసం రబ్బరు సూట్లు, మాస్కులు ,కదిలే బొమ్మలను వాడారు. దీనిని చూస్తున్నప్పుడు పాత కాలం సినిమాలను చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ కథలో ఒక యోధుడు, ఒక శపించబడిన తాయెత్తును పొందుతాడు. దానివల్ల కలిగే ప్రమాదాలు, రాక్షసులతో అతను చేసే పోరాటమే ఈ సినిమా.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ ఫాంటసీ సినిమా పేరు ‘డెత్‌స్టాకర్’ (Deathstalker). దీనికి స్టీవెన్ కోస్టాన్స్కీ దర్శకత్వం వహించారు. ప్రముఖ గిటారిస్ట్ స్లాష్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా, తనదైన శైలిలో అదిరిపోయే మ్యూజిక్ కూడా ఇచ్చారు. హాలీవుడ్ యాక్షన్ స్టార్ డేనియల్ బెర్న్‌హార్డ్ ఇందులో డెత్‌స్టాకర్ పాత్రలో నటించారు. ఆయన గతంలో ‘జాన్ విక్’ వంటి సినిమాల్లో తన ఫైట్స్‌తో మెప్పించారు. ఈ సినిమా సుమారు 1 గంట 30 నిమిషాల నిడివితో కుర్చీలకు కట్టిపడేస్తుంది. 2025 అక్టోబర్ 10న విడుదలైన ఈ సినిమా, ప్రస్తుతం Shudder ఓటీటీలో అందుబాటులో ఉంది. మీరు దీనిని Amazon Prime Video, Apple TV, Google Play Movies లలో అద్దెకు కూడా తీసుకోవచ్చు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

డెత్‌ స్టాకర్ అనే ఒక బలమైన యోధుడు, తన ప్రయాణంలో ఒక పురాతనమైన, శపించబడిన తాయెత్తును చజిక్కించుకుంటాడు. అయితే ఆ తాయెత్తు వెనుక ఒక మంత్రగాడు, అతని రాక్షస సైన్యం ఉన్నారని అతనికి ఆలస్యంగా తెలుస్తుంది. దాని కోసం వాళ్ళు డెత్‌స్టాకర్‌ను వెంటాడటం మొదలుపెడతారు. ఈ క్రమంలో డెత్‌స్టాకర్‌కు డూడాడ్ అనే ఒక వింత ప్రాణి, అలాగే బ్రిస్‌బేన్ అనే ఒక డేరింగ్ యువతి తోడవుతారు. వీళ్ళంతా కలిసి ఆ మంత్రగాడి మనుషులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సినిమా అంతా పాత కాలపు కత్తుల యుద్ధాలు, వింత రాక్షసులతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. చివరికి ఆ శపించబడిన తాయెత్తు అసలు సీక్రెట్ ఏమిటి ? ఆ మంత్రగాడిని డెత్‌స్టాకర్ తన కత్తి పవర్‌తో ఎలా మట్టికరిపించాడు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : రైలు పట్టాలపై పసివాడి ప్రయాణం… ప్రపంచం మొత్తాన్ని ఏడిపించిన ఒక మాస్టర్ పీస్… ఐయండిబిలో 8 రేటింగ్

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×