E-Paper
Advertisement

పోలీసులకే అంతుచిక్కని కిడ్నాప్ కేసు… షాకింగ్ ట్విస్టులతో సాగే క్రైమ్ థ్రిల్లర్

పోలీసులకే అంతుచిక్కని కిడ్నాప్ కేసు… షాకింగ్ ట్విస్టులతో సాగే  క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Crime Thriller Series : ఈ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ ప్లాట్ ఫామ్ నే ఎక్కువగా వాచ్ చేస్తున్నారు. వీటిలో కూడా థ్రిల్లర్ కంటెంట్ ను చూసేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఇవి ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కూడా అలానే ఉంటోంది మరి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ ను చూస్తే మరో సారి రిపీట్ కూడా చేస్తారు. అలావుంటుంది మరి ఈ క్రైమ్ థ్రిల్లర్. ఈ కథ ఐదేళ్ల చిన్నారి మిస్సింగ్ తో మొదలవుతుంది.
ఒక జర్నలిస్ట్ ఈ కేసును ఛేదించడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఊహించని ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి.

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్

2023లో వచ్చిన ఈ స్పానిష్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘ది స్నో గర్ల్’ (The Snow Girl). ఈ సిరీస్ స్పానిష్ రచయిత జేవియర్ కాస్టిల్లో రాసిన పాపులర్ నవల ఆధారంగా తీశారు. నిజానికి పుస్తకంలో కథ అమెరికాలోని న్యూయార్క్‌లో జరుగుతుంది, కానీ నెట్‌ఫ్లిక్స్ వాళ్లు దీనిని స్పెయిన్‌లోని మాలాగా నగరానికి మార్చి తీశారు. షూటింగ్ అంతా అక్కడి సముద్ర తీరాలు, వీధుల్లోనే జరిగింది. ఇందులో హీరోయిన్‌గా నటించిన మిలెనా స్మిత్ తన నటనకు గానూ మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఈ సిరీస్ కేవలం 6 ఎపిసోడ్లే ఉండటం వల్ల కథ ఎక్కడా సాగదీసినట్టు అనిపించదు. 2023లో విడుదలైనప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 లో నిలిచింది. దీనికి వచ్చిన క్రేజ్ చూసే, మేకర్స్ వెంటనే రెండో సీజన్ పనులను మొదలుపెట్టారు. సీజన్ 2 ‘ద సోల్ గేమ్’ పేరుతో జనవరి 2025లో విడుదలైంది. ఇందులో మిరెన్ మరో కొత్త కేసును విచారిస్తుంది. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో అందుబాటులో ఉంది. ఇది ఒరిజినల్‌గా స్పానిష్ భాషలో ఉన్నప్పటికీ, తెలుగు డబ్బింగ్‌తో కూడా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

2010లో స్పెయిన్‌లోని మాలాగా అనే ఊర్లో ఒక పెద్ద పండుగ జరుగుతుంటుంది. జనాలంతా కిక్కిరిసిపోయి ఉన్న ఆ కోలాహలంలో, అమయ అనే ఐదేళ్ల చిన్న పిల్ల వాళ్ల నాన్న చేయి వదిలేసి అటు ఇటు వెళ్తుంది. కనురెప్ప మూసి తెరిచేలోపు ఆ పిల్ల మాయమైపోతుంది. పోలీసులు, ఊరోళ్లంతా గాలించినా ఆ పిల్ల జాడ అస్సలు దొరకదు. ఆ తల్లిదండ్రుల బాధ అయితే వర్ణనాతీతంగా ఉంటుంది. సరిగ్గా అప్పుడే మిరెన్ అనే ఒక జర్నలిస్ట్ ఈ కేసులోకి ఎంటర్ అవుతుంది. పోలీసుల కంటే వేగంగా, తన తెలివితేటలతో ఆ పిల్ల ఎక్కడికి పోయిందో కనిపెట్టాలని కంకణం కట్టుకుంటుంది.

ఎందుకంటే మిరెన్ గతంలో కూడా ఇలాంటి ఒక దారుణమైన సంఘటనను ఎదుర్కొని ఉంటుంది. కథ 2010 నుంచి 2016, ఆ తర్వాత 2019 వరకు సాగుతుంది. అంటే ఆ పిల్ల కోసం ఆరేడేళ్లు వెతుకుతూనే ఉంటారు. ఒకరోజు హఠాత్తుగా ఆ పిల్ల బతికే ఉందని చెప్పే ఒక వీడియో టేప్ బయటపడుతుంది. దీంతో స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. అసలు ఆ పిల్లను కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకు చేశారు? మిరెన్ దీని గుత్తును ఎలా విప్పుతుంది ? అనే విషయాలతో ఈ సరీస్ క్లైమాక్స్ వరకు చాలా క్రేజీగా సాగుతుంది.

Advertisement

Read Also : హోటల్ గదిలో భయపెట్టే దెయ్యం… నవ్వులు పూయిస్తున్న అల్టిమేట్ కామెడీ హారర్

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×