E-Paper
Advertisement

చిన్నపిల్లల అదృశ్యం… ముప్పై ఏళ్లుగా అంతుచిక్కని మిస్టరీ… బుర్ర గిర్రున తిరిగే స్టోరీ

చిన్నపిల్లల అదృశ్యం… ముప్పై ఏళ్లుగా అంతుచిక్కని మిస్టరీ… బుర్ర గిర్రున తిరిగే స్టోరీ

Crime Thriller OTT :క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లు చాలా క్రేజీగా ఉంటాయి. వీటిని చూస్తూ అలా ఉండిపోతారు పక్కన ఏం జరుగుతుందో కూడా తెలీకుండా. ఎక్కడ చూసినా ఇలాంటి జానర్ సిరీస్ లే దర్శనం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం ఒక సిరీస్ గురించి చెప్పుకోవాల్సిందే. ఈ సిరీస్ ఒక మిస్సింగ్ కేసుతో ఊహించని మలుపులు తిరుగుతుంది. ముఖ్యంగా  బాల్యంలో జరిగిన ఇన్సిడెంట్స్, ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది ఇందులో గట్టిగానే చూపించారు.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ స్వీడిష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘ది గ్లాస్ డోమ్’ (The Glass Dome). ఈ సిరీస్‌ను ప్రముఖ స్వీడిష్ క్రైమ్ రచయిత్రి కామిల్లా లాక్‌బెర్గ్ రూపొందించారు. ఇందులో లియోనీ విన్సెంట్ ప్రధాన పాత్రలో (లెజ్లాగా) నటించగా, జోహన్ హెడెన్‌బర్గ్, జోహన్ రేబోర్గ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. లిసా ఫర్జానెహ్, హెన్రిక్ జార్న్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, కేవలం 6 ఎపిసోడ్ల నిడివితో ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ సిరీస్ 2025 ఏప్రిల్ 15న నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో విడుదలైంది.

స్టోరీ ఏమిటంటే

ఇందులో హీరోయిన్ లెజ్లా ఒక క్రిమినాలజిస్ట్. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటుంది. అయితే ఆమెను ఒక భయంకరమైన గతం వెంటాడుతూనే ఉంటుంది. చిన్నతనంలో ఒక గ్లాస్ డోమ్‌లో బంధీగా ఉండి, ప్రాణాలతో బయటపడిన సంఘటన ఆమె ఇప్పటికీ మారిచిపోలేకపోతుంటుంది. అయితే తనను పెంచిన తల్లి మరణించడంతో, చాలా ఏళ్ల తర్వాత ఆమె తన సొంత ఊరికి తిరిగి వస్తుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఒక చిన్నారి అదృశ్యం కావడం కలకలం రేపుతుంది.

ఆ చిన్నారి కేసును విచారిస్తున్న క్రమంలో దీనికి, లెజ్లా చిన్నప్పుడు అనుభవించిన కిడ్నాప్‌కి ఏదో తెలియని సంబంధం ఉందని ఆమెకు అనుమానం వస్తుంది. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నా లెజ్లా వెనకడుగు వేయకుండా ఆ నేరస్తున్ని పట్టుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. చివరికి ఆమె ఈ మిస్సింగ్ కేసును ఎలా చేదిస్తుంది ? దీని వెనుక వున్న అసలు నేరస్తులు ఎవరు ? ఎందుకు వాళ్ళును కిడ్నాప్ చేస్తున్నారు ? అనే విషయాలను ఈ థ్రిల్లర్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Read Also : భక్తి ముసుగులో భయంకరమైన మోసాలు… దొంగ బాబాల దుమ్ము లేపే లేడీ పోలీస్

Tags

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×