E-Paper
Advertisement

పది సంవత్సరాల క్రితం జరిగిన హత్య … మతిపోగొట్టే మతిమరుపు డిటెక్టివ్… అబ్బురపరుస్తున్న ఇన్వెస్టిగేషన్

పది సంవత్సరాల క్రితం జరిగిన హత్య … మతిపోగొట్టే మతిమరుపు డిటెక్టివ్… అబ్బురపరుస్తున్న ఇన్వెస్టిగేషన్
Advertisement

Crime Thriller OTT : గ్లాడియేటర్ ఫేమ్ రస్సెల్ క్రో ఒక డిఫెరెంట్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. కథలో పెద్దగా ఫైట్లు, హడావిడి ఉండదు కానీ, ఊహించని మలుపులతో మెల్లమెల్లగా ప్రేక్షకుడిని కథలో లీనం చేస్తుంది. హీరోకి ఉన్న మతిమరుపు వ్యాధి వల్ల అతను చెప్పేది నిజమా కాదా అనే సస్పెన్స్, పాత కేసులోని చిక్కుముడులు, చివర్లో వచ్చే ట్విస్టులు ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయి. ఒక మంచి మిస్టరీ డ్రామాను చూడాలనుకుంటే, ఇదొక బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ అమెరికన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా పేరు ‘స్లీపింగ్ డాగ్స్’ (Sleeping Dogs). ప్రముఖ నవలా రచయిత ఇ.ఓ. చిరోవిసి రాసిన ‘ది బుక్ ఆఫ్ మిర్రర్స్’ అనే బెస్ట్ సెల్లర్ బుక్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దర్శకుడు ఆడమ్ కూపర్ దీనికంటే ముందు పెద్ద యాక్షన్ సినిమాలకు రైటర్‌గా పనిచేశారు, కానీ దర్శకుడిగా ఇదే ఆయన మొదటి సినిమా. ఇక గ్లాడియేటర్ ఫేమ్ రస్సెల్ క్రో తన వయసుకి తగ్గట్టుగా అల్జీమర్స్ పేషెంట్ పాత్రలో అదరగొట్టేశాడు. ఆయన బాడీ లాంగ్వేజ్, కళ్ళతో పలికించే ఎమోషన్స్ సినిమాకు మెయిన్ పిల్లర్ ఉపయోగపడింది. ఇక మార్వెల్ సినిమాల్లో నెబ్యులాగా పేరు తెచ్చుకున్న కారెన్ గిల్లన్ ఈ మూవీలో చాలా ఇంపార్టెంట్ రోల్ చేసింది. సుమారు 1 గంట 50 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాను ఒక సీరియస్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలాగా మలిచారు. 2024 మార్చి 22న వచ్చిన ఈ సినిమా, ప్రస్తుతం Prime Videoలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఇందులో హీరో రాయ్ ఫ్రీమాన్ ఒకప్పుడు తోపు పోలీస్ ఆఫీసర్. కానీ ఇప్పుడు అతనికి మతిమరుపు జబ్బు (అల్జీమర్స్) పట్టుకుంది. ఏది ఎప్పుడు చేశాడో, ఎక్కడ పెట్టాడో ఏమీ గుర్తుండదు. తలకాయ క్లీన్ అయిపోతుంటే, డాక్టర్లు ఒక కొత్త ట్రీట్‌మెంట్ ట్రై చేస్తుంటారు. ఇలాంటి టైమ్‌లో, పదేళ్ల క్రితం ఒక మర్డర్ కేసులో రాయ్ లోపల వేసినోడు, నేను ఆ హత్య చేయలేదు సామీ, నన్ను అన్యాయంగా ఇరికించారని జైలు లోంచి కేకలు పెడతాడు. దాంతో హీరో రంగంలోకి దిగుతాడు.

కేసు మళ్ళీ తవ్వేసరికి అసలు విషయం బయటపడుతుంది. చనిపోయింది ఒక పెద్ద ప్రొఫెసర్, ఆ హత్య చుట్టూ ఒక అందమైన అమ్మాయి, ఒక అమాయకపు కుర్రాడు, ఇంకొక అనుమానితుడు.. ఇలా మస్తు మంది ఉంటారు. ఒక్కొక్కరిని ఎంక్వయిరీ చేస్తుంటే ఒక్కో షాకింగ్ నిజం బయటపడుతుంది. రాయ్‌కి మెల్లమెల్లగా తన పాత మెమరీస్ కూడా గుర్తొస్తుంటాయి. కానీ ఆ జ్ఞాపకాలే అతనికి పెద్ద తలనొప్పిలా తయారవుతాయి, ఎందుకంటే ఆ కేసులో ఎవరికీ తెలియని కొన్ని సీక్రెట్స్ ఉంటాయి.

Advertisement

క్లైమాక్స్ కొచ్చేసరికి అసలు ట్విస్ట్ ఏంటంటే.. అందరూ అనుకుంటున్నట్టు హంతకుడు బయటి వ్యక్తి కాదు. చివరకు రాయ్ కనిపెట్టిన నిజం అందరికీ షాక్ ఇస్తుంది. ఆ హత్య వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? రాయ్ దీనిని ఎలా కనిపెట్టాడు ? ఈ సినిమా ముగింపు ఎలా ఉంటుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. మొత్తం మీద ఇది ఒక మంచి మైండ్ గేమ్ లాంటి సస్పెన్స్ సినిమా.

Read Also : భర్త ఉండగానే మరో యువకుడితో ఎఫైర్.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×