E-Paper
Advertisement

తల్లిదండ్రుల హత్యకు ప్రతీకారంగా వణికించే హత్యలు… పిల్లలతో పాటు పెద్దలను కూడా జడిపిస్తున్న సినిమా

తల్లిదండ్రుల హత్యకు ప్రతీకారంగా వణికించే హత్యలు… పిల్లలతో పాటు పెద్దలను కూడా జడిపిస్తున్న సినిమా
Advertisement

Horror Thriller OTT : రక్తపాతం, వణుకు పుట్టించే సీన్లతో ఒక హాలీవుడ్ సినిమా ప్రేక్షకులను తెగ బాహాయపెడుతోంది. గత ఏడాది థియేటర్లలో వచ్చిన ఈ సినిమా పక్కా హారర్ స్లాషర్ రకానికి చెందినడి. ఇందులో క్రిస్మస్ పండుగ నేపథ్యంలో ఒక సైకో శాంటా గొడ్డలి పట్టుకుని ఊచకోత కోయడం ప్రధానంగా కనిపిస్తుంది. ఇది కేవలం భయపెట్టడమే కాకుండా, చిన్నప్పుడు జరిగిన ఘోరమైన సంఘటనల వల్ల ఒక వ్యక్తి సైకోగా ఎలా మారాడనేది చూపిస్తుంది. సినిమాలో విపరీతమైన రక్తపాతం, భయంకరమైన హత్యలు ఉంటాయి కాబట్టి, ఇది కేవలం పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన సినిమా. గుండె ధైర్యం ఉండి, డార్క్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ఇది ఒక పక్కా ఊరమాస్ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ హారర్ స్లాషర్ మూవీ పేరు ‘సైలెంట్ నైట్, డెడ్లీ నైట్’ (Silent Night, Deadly Night). దీనిని కెనడాలోని మానిటోబా ప్రాంతంలో ఉన్న విన్నిపెగ్, సెల్కిర్క్ వంటి మంచు కురిసే ప్రదేశాల్లో షూట్ చేశారు. సినిమాకు కావాల్సిన ఆ భయంకరమైన క్రిస్మస్ మూడ్‌ని తీసుకురావడానికి ఈ లొకేషన్లు బాగా సెట్ అయ్యాయి. దర్శకుడు మైక్ పి. నెల్సన్ (రాంగ్ టర్న్ ఫేమ్) దీనిని కేవలం 96 నిమిషాల నిడివితో చాలా స్పీడ్‍గా తీశాడు. హై-ఎండ్ రెడ్ కెమెరాలను వాడటం వల్ల ఇందులో రాత్రి పూట వచ్చే సీన్లు, రక్తపాతం చాలా స్పష్టంగా, భయపెట్టేలా కనిపిస్తాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే, సైకో శాంటాగా రోవాన్ క్యాంప్‌బెల్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. 1984 నాటి పాత సినిమాలోని కొన్ని సీన్లను గుర్తు చేస్తూనే, నేటి కాలానికి తగ్గట్టుగా ‘బ్లిట్జ్ బెర్లిన్’ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా మంచి వసూళ్లనే సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అద్దెకు అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

చిన్నప్పుడు బిల్లీ అనే పిల్లాడు వాళ్ల నాయనమ్మ, తాతయ్యలతో కలిసి హ్యాపీగా ఆడుకుంటూ ఉంటాడు. అయితే ఆ క్రిస్మస్ పండుగ రోజు సీజన్ లో ఒక శాంటా క్లాజ్ డ్రెస్‌లో వచ్చిన సైకో గాడు వాళ్ల అమ్మానాన్నలను కళ్లముందే నరికేస్తాడు. ఆ భయంకరమైన సీన్ చూసిన మనోడి మైండ్ మొత్తం దెబ్బతింటుంది. ఆ తర్వాత బిల్లీ ఒక అనాథాశ్రమంలో పెరుగుతాడు. అక్కడున్న ముసలి నన్ కూడా నరకం చూపిస్తుంది. దీంతో తప్పు చేస్తే శిక్ష పడాల్సిందనే పిచ్చి ఆలోచన వాడి తలకెక్కుతుంది. పెద్దయ్యాక ఒక బొమ్మల కొట్టులో పనికి కుదురుతాడు బిల్లీ. ఒకరోజు క్రిస్మస్ టైమ్‌లో మళ్ళీ శాంటా గెటప్ వేయాల్సి వచ్చేసరికి, వాడికి గతం గుర్తొచ్చి మతి పోతుంది.

ఇక అక్కడి నుంచి మొదలవుతుంది అసలు రచ్చ. ఎవడైనా తప్పు చేస్తున్నాడని కనిపిస్తే చాలు, శాంటా డ్రెస్‌లోనే గొడ్డలి పట్టుకుని వెంటపడి మరీ వేటాడి చంపేస్తుంటాడు. పండుగ పూట ఊరంతా రక్తపాతం సృష్టించి అందరికీ ముచ్చెమటలు పట్టిస్తాడు. ఇతను చేసే ఈ హత్యలను ఆపడానికి పోలీసులు వెంటాడుతుంటారు. కానీ ఆ శాంటా వేషంలో ఉన్న బిల్లీ మాత్రం ఎవ్వరికీ చిక్కకుండా ఒక్కొక్కడిని ఏరేస్తుంటాడు. చివరికి బిల్లీ పోలీసులకు దొరికిపోతాడా ? మరిన్ని హత్యలు చేస్తాడా ? ఈ కథకు ముగింపు ఏమిటి ? అనే విషయాలతో ఈ సినిమా పిచ్చెక్కిస్తుంది.

Advertisement

Read Also : అంతుచిక్కని మిస్సింగ్ కేసు… మైండ్ గేమ్‌తో మెంటలెక్కించే ట్విస్టులు

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×