E-Paper
Advertisement

భర్త ఉండగానే మరో యువకుడితో ఎఫైర్.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

భర్త ఉండగానే మరో యువకుడితో ఎఫైర్.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Dark Night: ఏ బంధానికైనా నమ్మకం ముఖ్యం. అందునా భార్యా భర్తల మధ్య ఉండాల్సిందే అది. అలాంటిది భార్యా భర్తల మధ్య నమ్మకం లేకపోతే మిస్ కమ్యూనికేషన్ జరిగి మూడో వ్యక్తి వాళ్ల మధ్యలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక దాంతో కాపురం కాస్త కొల్లేరు అవడం ఖాయం. అదిగో సరిగ్గా అలాంటి పాయింట్ నే పట్టుకొని ‘డార్క్ నైట్’ అనే వెన్నులో వణుకు పుట్టించే క్రైమ్ థ్రిల్లర్ ని తెరకెక్కించాడు జి.ఆర్. ఆదిత్య. గతంలో ఆయన ‘సవారి’ (తమిళంలో)వంటి ఎక్స్పెరిమెంట్ సినిమాలని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకోవడం విశేషం.

కథ విషయానికి వస్తే 

ఈ కథలో మెయిన్ లీడ్ హేమ(పూర్ణ). ఆమె ఒక సాధారణ హోమ్ మేకర్, తన ప్రపంచం అంతా తన భర్త అలెక్స్ (విధార్థ్) అని నమ్ముతుంది. కానీ అలెక్స్ మాత్రం తన ఆఫీస్ పనుల్లో బిజీ అయిపోవడమే కాకుండా, తన ఆఫీసు కొలీగ్ సోఫియా (శుభశ్రీ)తో ఇల్లీగల్ అఫైర్ ని పెట్టుకుంటాడు. ఈ విషయం తెలియని హేమ, తన భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. సరిగ్గా ఇలాంటి బలహీన క్షణాల్లోనే హేమ జీవితంలోకి రోషన్ (త్రిగుణ్) ఎంట్రీ ఇస్తాడు. ముఖ్యంగా ఒక మహిళ తన ఇంట్లోనే ఒంటరితనానికి గురైనప్పుడు, బయటి వ్యక్తుల నుంచి వచ్చే చిన్న సానుభూతి కూడా ఆమెపై ఎంతలా ఎఫెక్ట్ చేస్తుందో కళ్ళకి కట్టినట్టు చూపించాడు డైరెక్టర్. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టడం పక్కా.

నటీనటుల ఫెర్ఫామెన్స్

నటీనటుల విషయానికి వస్తే, పూర్ణ తన కెరీర్‌లోనే బెస్ట్ ఫెర్ఫామెన్స్  ఇచ్చిందని చెప్పవచ్చు. ఒక అమాయకపు భార్యగా, భర్త మోసాన్ని తెలుసుకున్న బాధితురాలిగా, ఆపై తన చుట్టూ అల్లబడిన క్రైమ్ నుండి బయటపడాలని పోరాడే ధైర్యవంతురాలిగా ఆమె అద్భుతమైన వేరియేషన్స్ చూపించింది. విధార్థ్ తన పాత్రకు తగ్గట్టుగా బాధ్యత లేని భర్తలోని నెగటివ్ షేడ్స్‌ను చక్కగా పండించారు. ఇక ఇందులో నటించిన త్రిగుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. మొదట్లో సాఫ్ట్ కుర్రాడిలా కనిపించి, కథ మలుపు తిరిగే కొద్దీ ఒక అగ్సెసివ్ లవర్ గా, సైకోలా మారే అతని నటన సినిమాకు బ్యాక్ బోన్ లా నిలుస్తుంది. ఇక సోఫియా పాత్రలో నటించిన శుభశ్రీ కూడా తన వంతు పని చేసుకుపోయింది.

also read:ఉస్తాద్ డిజాస్టర్ దెబ్బకి రూటు మార్చిన పవన్ …ఈసారి పక్కాగా ప్లాన్ !

డైరెక్టర్ మార్క్ 

ఈ సినిమాలో దర్శకుడు చూపించిన ‘రీసెట్ బటన్’ కాన్సెప్ట్ ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. యస్… ఈ సినిమాలో డైరెక్టర్ ‘రీసెట్ బటన్’ కాన్సెప్ట్ లైఫ్ లో ఉంటే ఎలా ఉంటుందా అని చెప్పుకొచ్చాడు. ఈ కాన్సెప్ట్ మేకింగ్ పరంగా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందనే చెప్పాలి. లో బడ్జెట్ అయినా మంచి ఎమోషనల్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమాను గ్రిప్పింగ్‌గా నడిపించడంలో సక్సెస్ అయ్యాడు జి.ఆర్. ఆదిత్య.

సాధారణంగా మన జీవితంలో ఏదైనా తప్పు జరిగితే, కాలంలో వెనక్కి వెళ్లి ఆ తప్పును సరిదిద్దుకోవాలని అనుకోవడం కామన్. అచ్చం అలాగే ఈ సినిమాలో హీరోయిన్ చేసిన పొరపాటును సరిదిద్దుకోవడానికి అలాంటి ఒక అవకాశం దొరికినట్లు చూపిస్తారు. ఒక్కసారి గనుక లక్ష్మణ రేఖ దాటితే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో, అవి ప్రాణాల మీదకు ఎలా వస్తాయో ఈ సినిమా కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది.

తప్పక చూడాల్సిన సినిమా 

హీరోయిన్ తన జీవితంలో జరిగిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం సినిమాలో దక్కినప్పటికీ, నిజ జీవితంలో అలాంటి రీసెట్ ఆప్షన్స్ ఉండవని, ఒక్క తప్పుడు అడుగు జీవితాంతం కోలుకోలేని దెబ్బ తీస్తుందని దర్శకుడు ఇచ్చిన మెసేజ్ ఆడియన్స్ కి చాలా బలంగా కనెక్ట్ అవుతోంది. ముఖ్యంగా సీనియర్ నటి పూర్ణ పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి ఆక్సిజన్ అని చెప్పాలి. క్రైమ్ మరియు థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఇష్టపడే వారికే కాకుండా, నేటి తరం జంటలకి ఇదొక కనువిప్పు కలిగించే సినిమా అవుతుంది.

ఎక్కడ స్ట్రీమింగ్ అంటే 

ఇక కేవలం భార్యాభర్తల గొడవలే కాకుండా, సాంకేతికతను వాడుకుని వ్యక్తులు ఒకరినొకరు ఎలా ట్రాప్ చేస్తున్నారో కూడా ఇందులో చూడవచ్చు. సినిమాటోగ్రఫీ మరియు నేపథ్య సంగీతం ఈ క్రైమ్ థ్రిల్లర్ మూడ్‌ను చివరవరకు నిలబెట్టడంలో సక్సెస్ అయ్యాయి. సో.. ఒక చిన్న పొరపాటు జీవితాన్ని ఎంతటి చీకట్లోకి నెట్టేస్తుందో తెలుసుకోవాలంటే ఆహాలో ‘డార్క్ నైట్’ చూడాల్సిందే.

also read:స్పిరిట్ మూవీపై భారీ డిమాండ్.. OTT డీల్ ఇండస్ట్రీ టాక్!

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×