E-Paper
Advertisement

అక్క మొగుడు చెల్లితో సంసారం… హత్యతో ఉలిక్కిపడే ఫ్యామిలీ… ఓటీటీలో దూసుకెళ్తున్న థ్రిల్లర్ సిరీస్

అక్క మొగుడు చెల్లితో సంసారం… హత్యతో ఉలిక్కిపడే ఫ్యామిలీ… ఓటీటీలో దూసుకెళ్తున్న థ్రిల్లర్ సిరీస్
Advertisement

Crime Thriller OTT : ఓటీటీలో థ్రిల్లర్ కంటెంట్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. మేకర్స్ కూడా వీటిని సరికొత్తగా రూపొందించడానికి నానా తంటాలు పడుతున్నారు. ఆ ప్రయత్నంలో వచ్చిన ఒక థ్రిల్లర్ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీనికి ఐయండిబిలో 7 రేటింగ్ కూడా ఉంది. సస్పెన్స్‌ ట్విస్టులతో స్టోరీ హోరెత్తిపోతుంది. ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే ఈ కథ మీకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘ది బెటర్ సిస్టర్’ (The Better Sister). ఇందులో నటించిన జెస్సికా బీల్, ఎలిజబెత్ బ్యాంక్స్ కేవలం హీరోయిన్లు మాత్రమే కాదు, దీనికి నిర్మాతలుగా కూడా ఉన్నారు. షూటింగ్ అంతా అమెరికాలోని న్యూయార్క్, లాంగ్ ఐలాండ్ వంటి ప్రాంతాల్లో చేయడం వల్ల విజువల్స్ చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ఇది అలైఫైర్ బర్క్ రాసిన పాపులర్ నవల ఆధారంగా తీయడం జరిగింది. క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ల కోసం అమెజాన్ ప్రైమ్ దీనిని 8 ఎపిసోడ్లుగా పక్కా ప్లానింగ్‌తో 2025 మే 29న రిలీజ్ చేసింది. మీరు మర్డర్ మిస్టరీలతో పాటు ఫ్యామిలీ పాలిటిక్స్ ఇష్టపడితే, ఇది మీకు పక్కాగా నచ్చుతుంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

క్లోయ్, నిక్కీ అని ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉంటారు. వీళ్ళిద్దరికీ అస్సలు పడదు. పెద్దమ్మాయి క్లోయ్ ఎక్కువగా రిచ్ బిల్డప్ ఇస్తుంటుంది. ఇక చిన్నమ్మాయి నిక్కీ మాత్రం తాగుడు, డ్రగ్స్ అలవాట్లతో లైఫ్ పాడు చేసుకుంటుంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. నిక్కీ మొగుడు ఆడమ్‌ను క్లోయ్ పెళ్లి చేసుకుంటుంది. అంటే చెల్లి మొగుడిని అక్క సెట్ చేసుకుందన్నమాట. వీళ్లందరూ కలిసి ఒకే ఇంట్లో ఉన్నప్పుడు, ఒకరోజు సడన్‌గా ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ఆడమ్‌ను నరికి చంపేస్తాడు. ఈ మర్డర్ తర్వాత కథ రసవత్తరంగా మారుతుంది. క్లోయ్ కొడుకు ఈథన్ మీద పోలీసులకు అనుమానం వస్తుంది. ఎందుకంటే వాడు వాళ్ళ నాన్నతో గొడవ పడుతుంటాడు. కానీ అసలు ఆ హంతకుడు ఎవరు? క్లోయ్ తన చెల్లి మీద పగతో ఈ పని చేసిందా? లేక నిక్కీ తన పాత మొగుడి మీద కోపంతో చంపిందా? అనే కోణంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ సాగుతుంది.

ఈ లోపు ఈ అక్కాచెల్లెళ్ల పాత గొడవలు, ఒకరినొకరు మోసం చేసుకున్న విషయాలన్నీ బయటపడతాయి. క్లైమాక్స్ లో అసలు నిజం బయటపడుతుంది. అందరూ అనుకున్నట్టు ఆ హంతకుడు బయటి వాడు కాదు, ఇంట్లోనే ఉంటాడు. అసలు ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు? ఆస్తి కోసం జరిగిందా లేక పాత కక్షల వల్ల జరిగిందా? అనేది సిరీస్ చివరలో తెలుస్తుంది. ఫ్యామిలీ పాలిటిక్స్, వెన్నుపోట్లు, పాత ప్రేమికుల గొడవలతో ఈ క్రైమ్ థ్రిల్లర్ చాలా స్పైసీగా సాగుతుంది.

Advertisement

Read Also : ప్రతి ఒక్కరూ చూడాల్సిన ముగ్గురు ప్రాణ స్నేహితుల ఎమోషనల్ జర్నీ … ఐయండిబిలో 8.2 రేటింగ్

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×