E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ప్రతి ఒక్కరూ చూడాల్సిన ముగ్గురు ప్రాణ స్నేహితుల ఎమోషనల్ జర్నీ … ఐయండిబిలో 8.2 రేటింగ్

ప్రతి ఒక్కరూ చూడాల్సిన ముగ్గురు ప్రాణ స్నేహితుల ఎమోషనల్ జర్నీ … ఐయండిబిలో 8.2 రేటింగ్
Advertisement

Feel Good Series OTT : ముప్పై ఏళ్ల వయసులో ఉన్న మిడిల్ క్లాస్ పీపుల్ కి జీవితం ఓ ఆట ఆడేసుకుంటుంది. ఎన్నో ఆటుపోట్లతో బండి లాగిస్తుంటారు చాలా మంది. ఒక పక్క కలలు, మరో పక్క బాధ్యతలు మధ్య చాలా మంది నలిగిపోతుంటారు. ఈ క్రమంలో ఒక కొరియన్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇది ముగ్గురు ప్రాణ స్నేహితుల జీవితాల చుట్టూ తిరిగే ఒక అందమైన కొరియన్ డ్రామా. కష్టాలతో పాటు, జీవితంలోని చిన్న చిన్న క్షణాలను ఎంతో అందంగా చూపించడం ఈ డ్రామా ప్రత్యేకత. అంతేకాదు ఈ డ్రామాలో ఒక సీరియల్ ఎలా తీస్తారు అనే విషయాన్ని చూపిస్తూ, ప్రస్తుతం టీవీ రంగంలో ఉండే పాలిటిక్స్ పై వేసే సెటైర్లు ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తాయి కూడా. దీనికి ఐయండిబిలో 8.2 రేటింగ్ ఉండటం విశేషం.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ ఫీల్ గుడ్ కొరియన్ డ్రామా సిరీస్ పేరు ‘బీ మెలోడ్రామాటిక్’ (Be Melodramatic). ఈ సిరీస్‌ను ప్రఖ్యాత దర్శకుడు లీ బైంగ్-హన్ తెరకెక్కించారు, ఈయన కొరియాలో భారీ హిట్ అయిన ‘ఎక్స్‌ట్రీమ్ జాబ్’ సినిమాకు కూడా దర్శకుడు. ఇందులో “Your Shampoo Scent in the Flowers” అనే పాట కొరియాలో ఒక సెన్సేషన్ సృష్టించింది. ఇందులో నటించిన జియోన్ యో-బీన్, చున్ వూ-హీ తమ నటనతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. 2019 లో వచ్చిన ఈ సిరీస్‌ను ప్రస్తుతం Netflix, Rakuten Viki, ZEE5 ప్లాట్‌ఫామ్స్‌లో చూడవచ్చు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఈ కథ అంతా ముప్పై ఏళ్లు నిండిన ముగ్గురు పక్కా లోకల్ ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతుంది. కథలో జిన్-జూ, యున్-జుంగ్, హాన్-జూ అనే ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉంటారు. జిన్-జూ ఒక వింతైన స్వభావం ఉన్న యువతి, తను ఎనిమిదేళ్ల ప్రేమ బ్రేకప్ బాధలో ఉండి, ఎలాగైనా ఒక మంచి డ్రామా రచయిత్రి అవ్వాలని ప్రయత్నిస్తుంటుంది. యున్-జుంగ్ ఒక డాక్యుమెంటరీ డైరెక్టర్; తను తీసిన మొదటి డాక్యుమెంటరీ పెద్ద హిట్ అవుతుంది కానీ, అదే సమయంలో తన ప్రియుడు అనారోగ్యంతో చనిపోవడంతో ఆ బాధ నుండి కోలుకోలేక ఒంటరిగా గడుపుతుంటుంది. ఇక హాన్-జూ విషయానికొస్తే, కాలేజీ రోజుల్లో ఒక అబ్బాయిని నమ్మి మోసపోయి, పెళ్లి కాకుండానే తల్లి అవుతుంది. ఆ అబ్బాయి వదిలేసి వెళ్ళిపోవడంతో, తను ఒక్కతే తన కొడుకును పెంచుకుంటూ ఒక ప్రొడక్షన్ కంపెనీలో మార్కెటింగ్ పనులు చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తుంటుంది. వీళ్ళ ముగ్గురి జీవితాలు అట్టర్ ప్లాప్ షోలా సాగుతుంటాయి, కానీ ఒకరికొకరు తోడుగా ఉంటూ బండిని లాగిస్తుంటారు.

కథ మలుపు తిరిగేది జిన్-జూ రాసిన ఒక స్క్రిప్ట్ ప్రసిద్ధ డైరెక్టర్ అయిన సన్-బమ్ చేతికి చిక్కినప్పుడు. వీరిద్దరి ఆలోచనలు వేరు కావడంతో మొదట్లో గొడవలు పడినా, మెల్లగా ఒకరినొకరు ఇష్టపడటం మొదలుపెడతారు. మరోవైపు యున్-జుంగ్ తన బాధను అధిగమించడానికి మళ్ళీ కొత్త డాక్యుమెంటరీ పనులు మొదలు పెడుతుంది. ఇక హాన్-జూ తన ఆఫీసులో ప్రొడక్ట్ ప్లేస్‌మెంట్ కోసం పడే పాట్లు, తన కొడుకు భవిష్యత్తు కోసం చేసే పోరాటం ఆమెను మరింత ధైర్యవంతురాలిని చేస్తాయి. ఇది మన ఇంట్లో పక్క వీధిలో జరిగే గొడవల్లాగే ఉంటుంది. ప్రేమ తొక్కా తోలుకూర అని కాకుండా, లైఫ్‌లో ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఎలా నిలబడాలి, ముప్పై ఏళ్ళ వయసులో కూడా కొత్తగా ఎలా బ్రతకాలి అనేది చాలా నాచురల్‌గా చూపిస్తారు ఇందులో. డైలాగులు కూడా మన ఫ్రెండ్స్ తో కూర్చుని ముచ్చట్లు పెట్టుకున్నట్టే సరదాగా ఉంటాయి

Advertisement

Read Also : వ్యూస్ పిచ్చితో వరుస హత్యలు చేసే హైస్కూల్ అమ్మాయిలు… వణికిపోతున్న ఊరి జనం

Tags

Related News

అన్నతో అలాంటి పని… బుర్రపాడు రొమాంటిక్ మూవీ

అఘాయిత్యం చేశాడని పార్ట్స్ కట్ చేసి కాకుల కేసే అమ్మాయి… బ్రూటల్ రివేంజ్ డ్రామా

పీక్ యాక్షన్ సీన్స్… రా అండ్ రస్టిక్ స్టోరీ… మామూలు రివేంజ్ కాదు మావా

తలలు తెగిపడే శవాలు… పోలీసులకు చెమటలు పట్టించే సైకో కిల్లర్

వీళ్ళు పిల్లలు కాదు బాబోయ్ పిశాచాలు… కమ్యూనిటీలోకి వెళ్ళే బేబీసిట్టర్లు మాయం

దారిద్రాన్ని పాకెట్లో పెట్టుకుని తిరిగే హీరో… ట్విస్టులతో పిచ్చెక్కించే స్పోర్ట్స్ డ్రామా

ఏకంగా ఐలాండ్ కే శాపం… దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా ఉండే ఒక్కో ఎపిసోడ్

బాబోయ్ ఇదేం స్టోరీ ? ఈ కాలేజీలో అడుగు పెడితే ఖతం… ఒంటరిగా చూడాల్సిన హర్రర్ మూవీ

Big Stories

×