E-Paper
Advertisement

Crime Thriller OTT : వరుస మర్డర్స్… సైకోను పట్టుకునే పక్షవాతం ఉన్న ఆఫీసర్… బోన్ చిల్లింగ్ క్రైమ్ థ్రిల్లర్

Crime Thriller OTT : వరుస మర్డర్స్… సైకోను పట్టుకునే పక్షవాతం ఉన్న ఆఫీసర్… బోన్ చిల్లింగ్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Crime Thriller OTT : సైకో థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఆదరణ ఉంటుంది. కిల్లర్ మర్డర్ చేసే తీరు ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉన్నప్పటికీ, ఇన్వెస్టిగేషన్, పోలీసుల నుంచి సైకో తప్పించుకుని తిరిగే తీరు రెప్ప వేయకుండా సినిమాను చూసేలా చేస్తుంది. ఈరోజు మన మూవీ సజెషన్ కూడా క్షణక్షణం ఉత్కంఠభరితంగా ఉండే అలాంటి సినిమానే. మరి ఆ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

“ది బోన్ కలెక్టర్” మూవీ 1999లో విడుదలైంది. ఈ అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అదే పేరుతో జెఫరీ డీవర్ రాసిన నవల ఆధారంగా రూపొందింది. ఇందులో డెంజెల్ వాషింగ్టన్, ఏంజెలీనా జోలీ నటన ఆకట్టుకుంటుంది. ఫిలిప్ నోయిస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, డెంజెల్ వాషింగ్టన్ (Denzel Washington), ఏంజెలీనా జోలీ (Angelina Jolie), క్వీన్ లతీఫా, మైఖేల్ రూకర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 2 గంటల రన్ టైమ్ ఉన్న ఈ మూవీకి IMDbలో 6.7 రేటింగ్ ఉంది. కానీ అప్పట్లో ఆడియెన్స్ తో పాటు క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. 48 మిలియన్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ 151 మిలియన్ డాలర్లు కొల్లగొట్టి నిర్మాతలకు కాసుల పంట కురిపించింది. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also :  ఓటీటీలోకి వచ్చేసిన సెన్సేషనల్ కోర్టు రూమ్ డ్రామా ‘హక్’… అస్సలు మిస్ అవ్వొద్దు భయ్యా

కథలోకి వెళ్తే…

టాప్ ఫోరెన్సిక్ క్రిమినాలజిస్ట్ గా పేరు తెచ్చుకుంటాడు లింకన్ రైమ్ (డెంజెల్ వాషింగ్టన్). అలాగే ఆయన ఒక డిటెక్టివ్ కూడా. ఇంతటి టాలెంట్ ఉన్న లింకన్ ఓ యాక్సిడెంట్ లో గాయపడతాడు. ఈ ప్రమాదంలో పక్షవాతం వచ్చి, బెడ్‌ కే పరిమితం అయిపోతాడు. మరోవైపు ఒక సీరియల్ కిల్లర్ ఘోరంగా హత్యలు చేస్తూ న్యూయార్క్ ను వణికిస్తాడు. అయితే అతను హత్య చేసిన చోటల్లా ఓ వింత హింట్ వదిలేస్తాడు. ప్రతి క్రైమ్ సీన్‌ లో తాను చంపిన మనిషి ఎముక ముక్కలను క్లూస్ గా వదిలేసి, చేతనైతే తనను పట్టుకోమని హింట్ వదులుతాడు. ఈ కిల్లర్‌ కు పోలీసులు “బోన్ కలెక్టర్” అనే పేరు పెడతారు.

Advertisement

ఇదిలా ఉండగా యంగ్ ప్యాట్రోల్ ఆఫీసర్ అమెలియా డోనాఘీ (ఏంజెలీనా జోలీ) రంగంలోకి దిగుతుంది. ఆమె అద్భుతమైన ఫోరెన్సిక్ స్కిల్స్ చూసి, సైకో కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న రైమ్ తన టీమ్‌ లోకి తీసుకుంటాడు. ఆమెను ఉపయోగించి కిల్లర్‌ ను పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. మరి కిల్లర్ వీళ్ళకి చిక్కాడా ? ఎందుకింత బ్రూటల్ గా హత్యలు చేస్తున్నాడు ? అనేది మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే.

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×