E-Paper
Advertisement

Thriller Movies OTT : సైకలాజికల్ థ్రిల్లర్ల నుండి మిస్టరీ డ్రామా వరకు… ఓటీటీలో ఉన్న సీట్ ఎడ్జ్ థ్రిల్లర్లు

Thriller Movies OTT : సైకలాజికల్ థ్రిల్లర్ల నుండి మిస్టరీ డ్రామా వరకు… ఓటీటీలో ఉన్న సీట్ ఎడ్జ్ థ్రిల్లర్లు
Advertisement

Thriller Movies OTT : సినిమా స్టార్టింగ్ నుంచి పోస్ట్ క్రెడిట్స్ వచ్చే వరకు తెరపై అతుక్కుపోయేలా చేసే సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు మూవీ లవర్స్. మీరు కూడా అలాంటి మెదడుకు పని చెప్పే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ల గురించి వెతుకుతుంటే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ఈ లిస్ట్ లో సైకలాజికల్ థ్రిల్లర్ల నుండి మిస్టరీ డ్రామా వరకు, అత్యంత ఉత్కంఠభరితమైన సినిమాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

1. Drishyam – Prime Video

చాలా థ్రిల్లర్ సినిమాలను చూసిన కొన్ని రోజులకే మర్చిపోతూ ఉంటాము. కానీ అతి తక్కువ సినిమాలు మాత్రమే ఎన్ని ఏళ్ళైన మరచిపోలేని ఎఫెక్ట్ ను ఇస్తాయి. అలాంటి మాస్టర్ పీసే ‘దృశ్యం’. నేరం చేసిన తర్వాత తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి వెంకటేష్ వేసే ప్లాన్ మైండ్ బెండింగ్. అనూహ్యమైన క్లైమాక్స్ ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళ, హిందీ భాషలలో బెస్ట్ మూవీగా నిలబెట్టింది.

2. Gone Girl – Prime Video

Advertisement

గిలియన్ ఫ్లిన్ రాసిన నవల ‘గాన్ గర్ల్’. అత్యధికంగా అమ్ముడైన ఈ నవల ఆధారంగా అదే పేరుతో తెరకెక్కింది డేవిడ్ ఫించర్ ‘గాన్ గర్ల్’. అమీ డున్నే పాత్రలో రోసముండ్ అద్భుతమైన నటనను కనబరిచింది. నిక్ డన్ భార్య అమీ తమ 5వ మ్యారేజ్ యానివర్సరీ రోజున మిస్ అయ్యింది. దీంతో అందరూ నిక్‌ ను అనుమానిస్తారు. కానీ భర్తను ట్రాప్ చేయడానికే అమీ ఇలా ప్లాన్ చేస్తుంది.

3. Andhadhun – Netflix

శ్రీరామ్ రాఘవన్ తీసిన ‘అంధాధున్’ సినిమా ఊహించని ట్విస్టులతో ఆడియన్స్ ను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. అంధ పియానిస్ట్ పాత్రను ఆయుష్మాన్ ఖురానా పోషించాడు. ఇటీవలి సంవత్సరాలలో అత్యంత చర్చనీయాంశమైన భారతీయ థ్రిల్లర్లలో ఇది కూడా ఒకటిగా నిలిచింది. ఈ మూవీని తెలుగులో ‘మాస్ట్రో’ పేరుతో రిలీజ్ చేశారు.

4. The Invisible Guest

Advertisement

ఈ స్పానిష్ థ్రిల్లర్ హత్య కేసులో నిందితుడిగా మారిన ఒక వ్యాపారవేత్త స్టోరీ. కథలోని ప్రతి మలుపు షాక్ ఇస్తుంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

5. Kaun ? – ZEE5

ఓటీటీల ట్రెండ్ రాకముందు, థ్రిల్లర్‌ అంటే ఎలా ఉంటుందో చూపించిన మూవీ రామ్ గోపాల్ వర్మ ‘కౌన్?’. ఊర్మిళ మటోండ్కర్, మనోజ్ బాజ్‌పేయి ఇందులో నటించారు.

6. The Girl with the Dragon Tattoo

కథ 40 సంవత్సరాల క్రితం మిస్ అయిన రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి హ్యారియెట్ వాంగర్ మిస్టరీ చుట్టూ సాగుతుంది. దీనిని ఇన్వెస్టిగేట్ చేయడానికి జర్నలిస్ట్ మైకేల్ బ్లామ్‌క్విస్ట్, హ్యాకర్ లిస్బెత్ సలాండర్ కలుస్తారు. ఆ తరువాత ఏం జరిగింది ? అన్నది చూడాలి. మొదటి ఫ్రేమ్ నుండి ఆకట్టుకునే థ్రిల్లర్ ఇది.

 

Read Also :  చైనా-భారత యుద్ధం ఆధారంగా తెరకెక్కిన వార్ డ్రామా ఓటీటీలోకి… కానీ చిన్న ట్విస్ట్

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×