E-Paper
Advertisement

Crime Thriller OTT : చంపడానికి వెళ్ళి లేడీ సెక్రటరీ బుట్టలో కిల్లర్… మెంటల్ మాస్ ట్విస్టులు మావా

Crime Thriller OTT : చంపడానికి వెళ్ళి లేడీ సెక్రటరీ బుట్టలో కిల్లర్… మెంటల్ మాస్ ట్విస్టులు మావా
Advertisement

Crime Thriller OTT : రియల్ స్టోరీ ఇలా ఆధారంగా ఈమధ్య క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి సినిమాలను ఆడియన్స్ కూడా ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక హిస్టారికల్ థ్రిల్లర్ మూవీ ఆడియన్స్ ను అబ్బుర పరిచింది. సోవియట్ నియంత స్టాలిన్ కను సన్నల్లో జరిగే హత్య చుట్టూ మూవీ తిరుగుతుంది. దాదాపు రెండు గంటల సమయం ఉన్న ఈ మూవీ హిస్టారికల్ లవర్స్ కి బెస్ట్ సజేషన్. దీని పేరు ఏమిటి ? ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ 

‘ది ఛోసెన్’ (The chosen) 2016 స్పానిష్-మెక్సికన్ థ్రిల్లర్ మూవీ. దీనికి ఆంటోనియో చావర్రియాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హన్నా ముర్రే, అల్ఫోన్సో హెర్రెరా, జూలియన్ సాండ్స్, హెన్రీ గుడ్‌మాన్ నటించారు. ఇది కొయోకాన్, మెక్సికో, బార్సిలోనా, స్పెయిన్‌లలో షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రం 1940లో లియోన్ ట్రోత్స్కీ అనే రష్యన్ విప్లవ నాయకుడి హత్య ఆధారంగా రూపొందింది. ప్రస్తుతం Netflix లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే 

Advertisement

1930లో రష్యన్ విప్లవ నాయకుడు లియోన్ ట్రాత్స్కీ మెక్సికోలో తలదాచుకుంటూ ఉంటాడు. అప్పటి సోవియట్ యూనియన్ నియంత అయినటువంటి స్టాలిన్, ట్రాత్స్కీని చంపాలని పట్టుదలతో ఉంటాడు.
ఈ సమయంలో స్పెయిన్ దేశానికి చెందిన ‘రామోన్ మెర్కాడెర్’ అనే కమ్యూనిస్టును, సోవియట్ గూఢచారి సంస్థ ఈ ఆపరేషన్ కి ఎంపిక చేస్తుంది. అతనికి కఠినమైన శిక్షణ ఇచ్చి, కొత్త పేరుతో ఒక బెల్జియం ధనవంతుడిగా గెటప్ కూడా మారుస్తారు. ట్రాత్స్కీ సర్కిల్‌లోకి వెళ్లడానికి, రామోన్ ఒక వ్యూహం పన్నుతాడు. ట్రాత్స్కీ సెక్రెటరీగా పనిచేస్తున్న సిల్వియా అగెలోఫ్ అనే అమాయకపు అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు నటించి ఆమెకు దగ్గరవుతాడు. ఆమె ద్వారా మెక్సికోలోని ట్రాత్స్కీ ఇంటిలోకి ఎంట్రీ ఇస్తాడు.

రామోన్ తన అసలు సీక్రెట్ బయటపడనీయకుండా, ట్రాత్స్కీకి అత్యంత నమ్మకస్తుడిగా మారుతాడు. చాలా నెలల పాటు ట్రాత్స్కీ కుటుంబ సభ్యులతో స్నేహంగా ఉంటూ, ఇంటి భద్రతా ఏర్పాట్లపై పట్టు సాధిస్తాడు. చివరగా, 1940 ఆగస్టులో ఒకరోజు, ట్రాత్స్కీ తన ఆఫీసు గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు రామోన్ లోపలికి వెళ్తాడు. తన కోటులో దాచుకున్న ఒక ‘ఐస్ పీక్’ తో ట్రాత్స్కీ తలపై దాడి చేస్తాడు. గాయపడిన ట్రాత్స్కీ మరుసటి రోజు మరణిస్తాడు. ఇంతలో రామోన్ కూడా పట్టుబడతాడు. అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. అయితే చివరి వరకు అతను తాను స్టాలిన్ పంపిన వ్యక్తిని అని మాత్రం ఒప్పుకోడు.

Advertisement

Read Also :  నదిలో గుట్టలుగా ఎముకల గూళ్ళు… బోన్ చిల్లింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ మావా

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×