E-Paper
Advertisement

Psycho Thriller OTT : నదిలో గుట్టలుగా ఎముకల గూళ్ళు… బోన్ చిల్లింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ మావా

Psycho Thriller OTT : నదిలో గుట్టలుగా ఎముకల గూళ్ళు… బోన్ చిల్లింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ మావా
Advertisement

Psycho Thriller OTT : సైకలాజికల్ థ్రిల్లర్‌లు ఆడియన్స్ కి ఇచ్చే థ్రిల్ మరే సినిమాలు ఇవ్వలేవు. కొన్ని సినిమాలలో ఉత్కంఠ చాలా తీవ్రంగా ఉంటుంది కూడా. చూపు తిప్పుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది. ఇలాంటి జోనర్ మూవీ రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ హాలీవుడ్ మూవీ థ్రిల్లర్ ఫ్యాన్స్ కి మస్ట్ వాచ్ మూవీగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాపేరు, ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

మెర్సిడెస్ బ్రైస్ మోర్గాన్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ సినిమా పేరు ‘బోన్ లేక్’ (Bone Lake). ఇందులో మాడ్డీ హాసన్, అలెక్స్ రో, ఆండ్రా నెచిటా మరియు మార్కో పిగోస్సి నటించారు. ఈ కథను జాషువా ఫ్రైడ్‌ల్యాండర్ రాశారు. ఈ సినిమా 2025 అక్టోబర్ 3న థియేటర్లలో విడుదలైంది.
2024లో ఫెంటాస్టిక్ ఫెస్ట్‌లో కూడా ప్రదర్శనకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన ఈ మూవీ, మూడు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సేజ్, డీగో అనే ఒక ప్రేమ జంట ప్రశాంతంగా గడపడానికి ‘బోన్ లేక్’ అనే ప్రాంతంలో వెకేషన్ కి వెళ్తారు. అక్కడ ఒక విలాసవంతమైన విల్లాను అద్దెకు తీసుకుంటారు. వాళ్ళు అక్కడికి చేరుకున్నాక, అదే విల్లాను విల్, సిన్ అనే మరో జంట కూడా బుక్ చేసుకున్నారని తెలుస్తుంది. పొరపాటున డబుల్ బుకింగ్ అవ్వడం వల్ల, బయట వాతావరణం బాలేనందున ఆ రాత్రికి అందరూ కలిసి అదే ఇంట్లో ఉండాలని నిర్ణయించుకుంటారు. మొదట్లో అంతా సాఫీగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. నలుగురూ కలిసి మద్యం తాగుతూ, సరదాగా మాట్లాడుకుంటారు.

కానీ నెమ్మదిగా విల్, సిన్ ప్రవర్తనలో మార్పు వస్తుంది. వాళ్ళు డీగో, సేజ్‌లను మధ్య గొడవలు పెట్టడం మొదలు పెడతారు. వాళ్ళ మనసులతో ఆడుకుంటారు. కథ చివరి అరగంటలో ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆ విల్లాలో హింసాత్మకమైన సంఘటనలు జరుగుతాయి. అసలు విల్, సిన్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? వాళ్ళు సేజ్, డీగోలను ఎందుకు టార్గెట్ చేశారు? ఆ భయంకరమైన రాత్రి నుండి వీళ్ళు ప్రాణాలతో బయట పడ్డారా ? అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : IMDbలో 7.5 రేటింగ్‌… వింత కొరియర్‌తో మొదలయ్యే కథ… ట్రెండింగ్ నెంబర్ 1లో క్రైమ్ థ్రిల్లర్

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×