E-Paper
Advertisement

Horror Thriller OTT : 8వ రాత్రి శాపం… చూశారంటే పోతారు… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని హర్రర్ మూవీ

Horror Thriller OTT : 8వ రాత్రి శాపం… చూశారంటే పోతారు… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని హర్రర్ మూవీ
Advertisement

Horror Thriller OTT : ఓటీటీలో ఒక మిస్టరీ కొరియన్ హారర్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమాలోని విజువల్స్ కి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. దాదాపు 2,500 ఏళ్ల క్రితం, ప్రపంచాన్ని నాశనం చేయాలనుకున్న ఒక రాక్షసుడికి సంబంధించిన కథ ఇది. ఇది బౌద్ధ పురాణ గాథల నేపథ్యంలో ఉంటుంది. చూసే కొద్దీ చూడాలనిపించే సినిమా ఇది. అయితే ఒంటరిగా చూస్తే అంతే సంగతులు. కొంచెం ఎవరినైనా తోడు పెట్టుకుని చూడటం మంచిది. దీని పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

2021లో విడుదలైన ఈ కొరియన్ మిస్టరీ హారర్ థ్రిల్లర్ చిత్రం పేరు ‘8త్ నైట్’ (The 8th Night). గోమ్ పిక్చర్స్ తరపున కిమ్ టే-హ్యుంగ్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో లీ సుంగ్-మిన్, పార్క్‌ హే-జూన్, కిమ్ యూ-జంగ్, నమ్ దా-రేమ్ లీడ్ రోల్స్ లో నటించారు. బౌద్ధ మతపరమైన అంశాల ఆధారంగా రూపొందిన ఈ సినిమా 2021 జూలై 2న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

2,500 ఏళ్ల క్రితం, ప్రపంచాన్ని నాశనం చేయాలనుకున్న ఒక రాక్షసుడి శక్తిని అణచివేయడానికి, గౌతమ బుద్ధుడు ఆ రాక్షసుడి రెండు కళ్లను (ఎరుపు, నలుపు) వేరు చేసి వేర్వేరు పెట్టెల్లో బంధిస్తాడు. ఈ రెండు కళ్లు మళ్ళీ కలిస్తే లోకం సర్వనాశనమవుతుందని భావించి, ఎరుపు కన్నును ఎడారుల్లో, నలుపు కన్నును పర్వతాల్లో దాచి ఉంచుతారు. అయితే ప్రస్తుత కాలంలో ఒక పురావస్తు శాస్త్రవేత్త ఈ రహస్యాన్ని వెలికితీసి, ఆ ఎరుపు కన్నును పొరపాటున బయటికి తీస్తాడు. ఆ రాక్షస కన్ను తన పూర్తి రూపాన్ని తిరిగి పొందాలంటే, ఎనిమిది రోజులలో ఏడుగురు వ్యక్తుల శరీరాలను మార్చుకుంటూ వెళ్లి చివరగా నలుపు కన్నును చేరుకోవాలి.

ఈ విపత్తును అడ్డుకోవడానికి భూతవైద్యుడైన పార్క్ జిన్-సూ, సన్యాసి చియోంగ్-సియోక్ కలిసి పోరాడుతారు. ఒకవైపు నగరంలో వరుసగా హత్యలు జరుగుతుండగా, మరోవైపు ఆ రాక్షస శక్తి ఎనిమిదవ రాత్రి నాటికి, నల్ల కన్ను చేరుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. ఆ ఎనిమిదవ రాత్రి ముగిసేలోపు, ఆ శక్తిని మళ్ళీ ఎలా బంధించారు ? ఈ క్రమంలో వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి ? అనే అంశాలతో మిగతా కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది.

Advertisement

Read Also : ఈ బీచ్ కెళ్తే తిరిగిరారు… కంటికి కన్పించకుండా ప్రాణాలు తీసే వింత జీవి… మెంటలెక్కించే సై-ఫై డ్రామా

Tags

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×