Dacoit on OTT : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న ఇంట్రెస్టింగ్ సినిమాలలో ‘డెకాయిట్’ కూడా ఒకటి. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఇప్పటికే థియేటర్లలో సందడి చేయగా, ఆశించిన రెస్పాన్స్ దక్కలేదు. అయితే ఓటీటీ మూవీ లవర్స్ మాత్రం ఈ మూవీని చూడడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతున్న ఈ థ్రిల్లర్ ను ఎక్కడ చూడవచ్చో తెలుసుకుందాం పదండి.
‘డెకాయిట్: ఎ లవ్ స్టోరీ’ (Dacoit: A Love Story) మూవీ మే 8 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి రానుంది. ఈ సినిమాకు షానియల్ డియో దర్శకత్వం వహించగా, అడివి శేష్ ఒక రఫ్ క్యారెక్టర్ లో ఆకట్టుకుంటాడు. ఇక మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ సీన్లలో బాగా నటించింది. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కన్పిస్తారు. అలాగే ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కుల్కర్ణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ మూవీ రేపటి నుంచి Amazon Prime Videoలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కోవిడ్-19 నేపథ్యంలో సాగే ఈ మూవీలో మెడికల్ మాఫియా, కుల వ్యవస్థ వంటి అంశాలను కూడా యాడ్ చేశారు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్ ను థ్రిల్ చేస్తుంది. మామూలు యాక్షన్ సినిమాల కంటే భిన్నంగా ఇదొక రా (Raw) ఎమోషనల్ లవ్ స్టోరీలా సాగుతుంది.
హరిదాస్ అలియాస్ హరి (అడివి శేష్) అంటే మన హీరో దళిత యువకుడుగా కన్పిస్తాడు. సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాల్ ఠాకూర్) అనే అగ్రకులానికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ కుల వివక్ష, ఇంట్లో ఒత్తిడి కారణంగా సరస్వతి మరొకరిని పెళ్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆమె అలా అత్తారింటికి వెళ్తూ వెళ్తూ, లవర్ ను జైలుకు పంపుతుంది. సరస్వతి చెప్పిన అబద్ధం వల్ల చేయని హత్య నేరానికి 13 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవిస్తాడు హరి. ఆ తరువాత హరి జైలు నుండి తప్పించుకుని, తనను మోసం చేసిన సరస్వతిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.
Also Read : లైఫ్ లో ఏదైనా సాధించాలంటే ఎంత కసిగా ఉండాలో చూపించే క్రేజీ సినిమా… పూనకాలు తెప్పించే క్లైమాక్స్
జైలు నుండి ఎస్కేప్ అయిన హరి, సరస్వతిని వెతుక్కుంటూ వెళ్తాడు. కానీ అప్పటికే ఆమె మంచాన పడ్డ భర్త, కూతురితో ఆర్థిక ఇబ్బందుల్లో పూర్తిగా కూరుకుపోయి ఉంటుంది. ఆమె భర్త ప్రాణాలు కాపాడటానికి ఏకంగా కోటి రూపాయలు అవసరం అవుతాయి. ఇదే అదనుగా భావించిన హరి, ఆమెపై పగను తీర్చుకోవడానికి ఓ ప్లాన్ వేస్తాడు. ఇద్దరూ కలిసి దొంగతనం చేయాలని నిర్ణయించుకుంటారు. ఒకరంటే ఒకరు పడని వీళ్ళిద్దరూ కలిసి దొంగతనం ఎలా చేశారు ? చివరికి ఏమైంది ? అన్నదే స్టోరీ.