E-Paper
Advertisement

లైఫ్ లో ఏదైనా సాధించాలంటే ఎంత కసిగా ఉండాలో చూపించే క్రేజీ సినిమా… పూనకాలు తెప్పించే క్లైమాక్స్

లైఫ్ లో ఏదైనా సాధించాలంటే ఎంత కసిగా ఉండాలో చూపించే క్రేజీ సినిమా… పూనకాలు తెప్పించే క్లైమాక్స్
Advertisement

Psychological thriller OTT : కొన్ని సినిమాలు చూసిన తరువాత కూడా వాటి ఎఫ్ఫెక్ట్ తో చెవిలో రీ సౌండ్ వస్తుంటుంది. అలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే హాలీవుడ్ సినిమా అంతకు మించి అన్నట్లు ఉంటుంది. ఇది మామూలు సినిమా కాదు, చూస్తుంటే బాడీలో రక్తం ఉడుకుతుంది. తన లక్ష్యం కోసం హీరో తన గర్ల్‌ఫ్రెండ్‌ని, కన్నతండ్రిని కూడా లెక్కచేయకుండా డ్రమ్స్ వాయిస్తూ, చేతులు కన్నాలు పడి రక్తం కారుతున్నా సరే ఆపకుండా కొట్టే సీన్లు మెంటల్ ఎక్కిస్తాయి. ఇక క్లైమాక్స్ అయితే పూనకాలు రావడం గ్యారెంటీ. తనని దెబ్బకొట్టాలని చూసిన మాస్టర్‌కే రివర్స్‌లో షాక్ ఇస్తూ, స్టేజ్ మీద హీరో ఇచ్చే డ్రమ్స్ పెర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. అసలు ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే ఎంత కసిగా ఉండాలో, ఆ కసి వల్ల వాడు ఎంత క్రూరంగా మారతాడో ఈ సినిమా కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఐయండిబిలో దీనికి 8.5 రేటింగ్ ఉందంటే దీని కథ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ అమెరికన్ సైకలాజికల్ డ్రామా సినిమా పేరు ‘విప్లాష్’ (Whiplash). 2014లో వచ్చిన ఈ సినిమా అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. డామియన్ చాజెల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మైల్స్ టెల్లర్, జె.కె. సిమన్స్ ప్రధాన పాత్రలు పోషించారు. మొదట ఈ సినిమా తీయడానికి ఎవరూ పెట్టుబడి పెట్టలేదు. అందుకే దర్శకుడు చాజెల్ ఒక 18 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీసి సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. దానికి మంచి రెస్పాన్స్ రావడంతో, ఫుల్ సినిమా తీయడానికి నిర్మాతలు ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా వెనుక ఉన్న అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దీని పూర్తి షూటింగ్‌ను కేవలం 19 రోజుల్లోనే పూర్తి చేశారు. ఈ సినిమాలో ఆండ్రూ పాత్ర పోషించిన మైల్స్ టెల్లర్ నిజంగానే డ్రమ్మర్ కావడంతో, చాలా సీన్లలో డ్రమ్స్ వాయిస్తూ చేతులకు రక్తం వచ్చేలా కష్టపడ్డాడు. ఆ రక్తం మరకలు, పడిన శ్రమ చాలా వరకు సహజంగా చిత్రీకరించినవే. మరో విశేషం ఏమిటంటే, కేవలం 3.3 మిలియన్ డాలర్ల చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం,  ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. క్రూరమైన మాస్టర్ ఫ్లెచర్ పాత్రలో జె.కె. సిమన్స్ నటనకు గాను ఆయనకు ఆస్కార్ అవార్డు దక్కింది. అలాగే ఈ సినిమా ఉత్తమ ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్ విభాగాల్లో కూడా ఆస్కార్లను గెలుచుకుని అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ Prime Video, Netflix ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఆండ్రూ నేమాన్ అనే కుర్రాడికి ప్రపంచంలోనే గొప్ప జాజ్ డ్రమ్మర్ అవ్వాలని పెద్ద కల. అందుకోసం న్యూయార్క్‌లోని ఒక పెద్ద మ్యూజిక్ కాలేజీలో చేరతాడు. అక్కడ టెరెన్స్ ఫ్లెచర్ అనే మాస్టర్ ఉంటాడు. అతను చాలా కఠినమైన వాడు, తన స్టూడెంట్స్ వంద శాతం పర్ఫెక్ట్‌గా ఉండాలని కోరుకుంటాడు. ఆండ్రూ టాలెంట్ చూసి ఫ్లెచర్ తన బ్యాండ్‌లోకి తీసుకుంటాడు కానీ, అప్పటి నుండి ఆండ్రూకి కష్టాలు మొదలవుతాయి.ఫ్లెచర్ మామూలు టీచర్ కాదు, స్టూడెంట్స్ ఏ చిన్న తప్పు చేసినా అందరి ముందు దారుణంగా తిడుతూ, అవమానిస్తూ, చేతిలో ఉన్న వస్తువులను విసిరి కొడుతూ భయపెడుతుంటాడు.

అయితే ఆండ్రూ కూడా ఎలాగైనా ఫ్లెచర్ మెప్పు పొందాలని పట్టుదలతో రక్తం వచ్చేలా డ్రమ్స్ ప్రాక్టీస్ చేస్తాడు. ఈ క్రమంలో తన గర్ల్‌ఫ్రెండ్‌ను, కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా కేవలం డ్రమ్స్ మీదే పిచ్చిగా ఫోకస్ పెడతాడు. ఒకానొక దశలో ఫ్లెచర్ హింస తట్టుకోలేక ఆండ్రూ తన కాలేజీ సీటును కూడా కోల్పోతాడు. చివరికి ఒక పెద్ద మ్యూజిక్ షోలో ఆండ్రూ, ఫ్లెచర్ మళ్ళీ ఎదురవుతారు. అక్కడ ఫ్లెచర్ ఆండ్రూని దెబ్బకొట్టాలని చూసినా, ఆండ్రూ ఏమాత్రం తగ్గకుండా అద్భుతమైన డ్రమ్ పర్ఫామెన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. ఇందులో సక్సెస్ కోసం ఒక యువకుడు పడే ఆరాటం ఎంత క్రూరంగా ఉంటుందో ఈ సినిమా చూపిస్తుంది.

Advertisement

Read Also : నీటి రాక్షసుడు సృష్టించే భీభత్సం… ఊరు ఊరంతా ఒక్కటై చేసే పనికి బుర్ర బద్దలు

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×