E-Paper
Advertisement

Daldal Series OTT : భూమి పెడ్నేకర్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ… ఏ ఓటీటీలో ఉందంటే ?

Daldal Series OTT : భూమి పెడ్నేకర్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ… ఏ ఓటీటీలో ఉందంటే ?
Advertisement

Daldal Series OTT : క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లు ఇప్పుడు ఏ ఓటీటీలో చూసినా దర్శనం ఇస్తున్నాయి. ఆడియన్స్ కూడా ఈ స్టోరీలను తెగచూస్తున్నారు. క్లైమాక్స్ వరకు వచ్చే సస్పెన్స్ కు బాగా అలవాటు పడిపోయారు ప్రేక్షకులు. ఈ మధ్య వచ్చిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ లు ట్రెండింగ్ లో నడిచాయి కూడా. ఇప్పుడు ఓటీటీలోకి మరో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అడుగుపెట్టింది. ముంబై క్రైమ్ బ్రాంచ్‌ నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతోంది. సీరియల్ కిల్లర్ ని పట్టుకునే క్రమంలో స్టోరీలో ఊహించని ట్విస్ట్లు వస్తుంటాయి. థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సిరీస్ ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘దల్దల్’ (Daldal). భూమి పెడ్నేకర్, ఆదిత్య రావల్, సమర తిజోరి నటించిన ఈ సిరీస్, రచయిత విష్ ధమిజా రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ‘భెండీ బజార్’ ఆధారంగా రూపొందింది. అమృత్ రాజ్ గుప్తా దీనికి దర్శకత్వం వహించారు. ఇప్పుడు అంటే 2026 జనవరి 30 నుంచి ఇది ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. OTTplay ప్రీమియం సబ్‌స్క్రైబర్లు కూడా దీన్ని చూడవచ్చు. 7 ఎపిసోడ్‌లు ఉన్న ఈ సిరీస్‌, ఒక్కో ఎపిసోడ్ ఆరగంటకు పైగా నిడివి కలిగి ఉంది.

కథ ఏమిటి?

Advertisement

రీటా (భూమి పెడ్నేకర్) ముంబై క్రైమ్ బ్రాంచ్‌లో డీసీపీగా పనిచేస్తుంటుంది. చిన్న వయసులోనే ఆమె అత్యంత ప్రతిభతో ఆ స్థాయికి వచ్చింది. కానీ ఆమె మనసులో తన గతం గాయాలు కూడా ఉంటాయి. ఆమె గతం కూడా చాలా ట్రాజిడిగా ఉంటుంది. ఇక కథలో నగరంలో వరుసగా భయంకరమైన హత్యలు జరుగుతుంటాయి. ఈ కేసును ఛేదించే బాధ్యత రీటాకు అప్పగిస్తారు. ఆ హంతకుడు ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? అనే కోణంలో దర్యాప్తు సాగుతుంది. ఒకవైపు కేసును పరిష్కరిస్తూనే, మరోవైపు రీటా తన సొంత జీవితంలోని సమస్యలతో, కుటుంబ బంధాలతో పోరాడుతుంటుంది. అందుకే ఈ సిరీస్‌కు ‘దల్ దల్’ (ఊబి) అని పేరు పెట్టారు. సమస్యలనే ఊబిలో చిక్కుకున్న రీటా బయటపడిందా లేదా అన్నదే మిగతా కథ.

Read Also :  ‘ది రాజా సాబ్’ నుంచి ‘ది కంజురింగ్: లాస్ట్ రైట్స్’ వరకు… హాట్ స్టార్ లో ఫిబ్రవరిలో రానున్న కొత్త సినిమాలు ఇవే

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×