E-Paper
Advertisement

Jio Hotstar Movies : ‘ది రాజా సాబ్’ నుంచి ‘ది కంజురింగ్: లాస్ట్ రైట్స్’ వరకు… హాట్ స్టార్ లో ఫిబ్రవరిలో రానున్న కొత్త సినిమాలు ఇవే

Jio Hotstar Movies : ‘ది రాజా సాబ్’ నుంచి ‘ది కంజురింగ్: లాస్ట్ రైట్స్’ వరకు… హాట్ స్టార్ లో ఫిబ్రవరిలో రానున్న కొత్త సినిమాలు ఇవే
Advertisement

Jio Hotstar Movies : ప్రతి వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సినిమాలు, సిరీస్‌లను స్ట్రీమింగ్ కి తెస్తున్నాయి. వాటిలో మంచి కంటెంట్ ఉన్న కథలను దక్కించుకోవడానికి జియో హాట్‌స్టార్‌ ప్లాట్‌ ఫామ్‌ కూడా ముందు వరసలో ఉంటుంది. మరి ఇప్పుడు ప్రభాస్ నటించిన రాజా సాబ్ కూడా ఇందులోకే వస్తోంది. జనవరి, ఫిబ్రవరిలో హాట్‌స్టార్‌లో విడుదల అవ్వబోతున్న సినిమాల గిరించి ఇప్పుడు తెలుసుకుందాం.

గుస్తఖ్ ఇష్క్

విజయ్ వర్మ, ఫాతిమా సనా షేక్, నసీరుద్దీన్ షా, షరీబ్ హష్మి నటించిన ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో విడుదలైంది. అయితే, థియేటర్లలో “ధురంధర్” అలలకు అది కొట్టుకుపోయింది. దీంతో ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇది జనవరి 27 నుంచి అందుబాటులోకి వచ్చింది.

సర్వం మాయ

Advertisement

ఇది నివిన్ పౌలీ, ప్రియా ప్రకాష్ వారియర్, ప్రీతి ముఖుందన్,రియా శిబు నటించిన ఒక హారర్ చిత్రం. ఇది 2026 జనవరి 30 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.

వా వతియార్

ఈ తమిళ యాక్షన్ కామెడీ మూవీలో కార్తీ, రాజ్‌కిరణ్, సత్యరాజ్, ఆనందరాజ్, కరుణాకరన్, శిల్పా మంజునాథ్ నటించారు. ఈ సినిమా జనవరి 28 నుంచి Jio Hotstarలో స్ట్రీమింగ్ అవుతోంది.

ది 50

Advertisement

ఇది ఫిబ్రవరి 1 నుండి జియో హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్న రియాలిటీ టీవీ షో. అనేక మంది టీవీ నటులు, యూట్యూబర్లు ఇందులో పాల్గొంటున్నారు. ఈ రోజుల్లో ఈ షోకి క్రేజ్ పెరుగుతోంది కూడా.

కిస్ కిస్ కో ప్యార్ కరూన్

కపిల్ శర్మ లీడ్ రోల్ లో నటించిన ఈ కామెడీ సినిమా 2025 డిసెంబర్ లో థియేటర్లలో విడుదలైంది. అయితే దీనికి ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ మూవీ ఫిబ్రవరి 6 నుంచి జియో హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. మీరు సినిమాను థియేటర్లలో చూడటం మిస్ అయితే మరో వారంలో ఓటీటీలో చూడవచ్చు.

‘ది కంజురింగ్: లాస్ట్ రైట్స్’

హాలీవుడ్ హర్రర్ మూవీ 2025 లో థియేటర్లలో విడుదలైనప్పటికీ, 2026 ఫిబ్రవరి 13 న జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కి వస్తోంది. ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో అందుబాటులో ఉండనుంది.

‘రాజా సాబ్’

ప్రభాస్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. ఇప్పుడు ఓటీటీలో వచ్చేందుకు సిద్ధంగా ఉంది. నిర్మాతలు జియో హాట్‌స్టార్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. రిలీజ్ తేదీ ఇంకా వెల్లడి కానప్పటికీ, ఈ చిత్రం ఫిబ్రవరి, మార్చిలో జియో హాట్‌స్టార్‌ ప్లాట్‌ఫామ్‌లో వచ్చే అవకాశం ఉంది.

Read Also :  ‘డేర్ డెవిల్’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… సీజన్ 2 అప్డేట్… ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందంటే ?

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×