E-Paper
Advertisement

Top 5 Marathi Movies OTT : ‘దశావతార్’ నుండి ‘బాయి తుజ్యాపాయి’ వరకు… ఓటీటీలో ఉన్న బెస్ట్ మరాఠీ మూవీస్

Top 5 Marathi Movies OTT : ‘దశావతార్’ నుండి ‘బాయి తుజ్యాపాయి’ వరకు… ఓటీటీలో ఉన్న బెస్ట్ మరాఠీ మూవీస్
Advertisement

Top 5 Marathi Movies OTT : మరాఠీ సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు ఎమోషన్, కామెడీ, సోషల్ మెసేజ్, సస్పెన్స్‌తో భారీ హిట్స్ ఇస్తున్నాయి. ఇవి ఫ్యామిలీతో కలిసి చూడటానికి పర్ఫెక్ట్ గా ఉంటాయి కూడా. ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉన్న బెస్ట్ మరాఠీ మూవీస్ గురించి తెలుసుకుందాం.

1. దశావతార్ (Dashavatar) 

మరాఠీ సినిమాల్లో క్లాసిక్ డ్రామా ఇది. దిలీప్ ప్రభావల్కర్, మహేష్ మంజ్రేకర్, భారత్ జాధవ్, సిద్ధార్థ్ మేనన్ నటించారు. ఒక వృద్ధుడు దశావతార్ నాటకం చేస్తూ తన గతం, ప్రస్తుతం మధ్య పోరాడటం చూపిస్తుంది. కోంకణ్ కళా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం, ఆస్కార్ కి కూడా నామినేట్ అయింది. 2025 సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, నవంబర్ 14 నుంచి ZEE5 ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో స్ట్రీమ్ అవుతోంది.

2. బాయి తుజ్యాపాయి (Baai Tujhyapayi)

Advertisement

ఈ హార్ట్ టచింగ్ ఎమోషనల్ డ్రామా ఒక గ్రామంలో జరుగుతుంది. అక్కడ అమ్మాయిలు వయసుకు రాగానే, చదువు ఆపేసి పెళ్లి చేయాలనే 500 ఏళ్ల నాటి ఆచారం ఉంటుంది. కానీ డాక్టర్ అవ్వాలని కలలు కనే అహల్య, తన చదువును కొనసాగించడం కోసం తాను వయసుకు వచ్చిన విషయాన్ని దాచిపెట్టి ఊరి కట్టుబాట్లపై ఎలా పోరాడింది అనేదే ఈ సినిమా కథ. ఇది 2025 Zee5లో అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ లో ఉంది.

3. దేవ్‌ఖేల్ (Devkhel)

ఈ మరాఠీ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 2026 జనవరి 30 నుంచి ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ అవుతోంది. కొంకణ్ ప్రాంతంలోని దేవ్‌తాలి అనే గ్రామంలో జరిగే హోలీ పండుగ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ప్రతి ఏటా హోలీ రాత్రి ఒకరు చనిపోతుంటారు. అది ‘శంకాసుర’ అనే రాక్షసుడి శాపం వల్ల జరుగుతుందని స్థానికులు నమ్ముతారు. ఇన్స్‌పెక్టర్ విశ్వాస్ ఈ మరణాల హత్యల వెనుక ఉన్న నిజాన్ని ఎలా ఛేదించాడనేదే ఈ సిరీస్ కథ. అంకుష్ చౌదరి ప్రధాన పాత్రలో నటించగా, చంద్రకాంత్ గైక్వాడ్ దర్శకత్వం వహించారు. 7 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ Zee5 ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

4. జరణ్ (Jarann)

Advertisement

ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ హృషికేష్ గుప్తే దర్శకత్వంలో వచ్చింది. ఒక గ్రామంలో బ్లాక్ మ్యాజిక్, ఫ్యామిలీ సీక్రెట్స్ చుట్టూ సినిమా కథ సాగుతుంది. ఒక్క సారి చూస్తే ఖచ్చితంగా భయపడతారు. గత ఏడాది వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం Zee5లో అందుబాటులో ఉంది.

5. అతా థంబయ్చా నాయ్! (Ata Thambaycha Naay!)

ఈ కామెడీ డ్రామాలో భారత్ జాధవ్, సిద్ధార్థ జాధవ్, అశుతోష్ గోవారికర్ నటించారు. 2016లో జరిగిన రియల్ సంఘటన ఆధారంగా ఈ కథ సాగుతుంది. 23 మంది BMC క్లాస్ IV ఉద్యోగులు 10వ తరగతి పాస్ అవ్వడం గురించి ఈ కథ ఆసక్తిగా సాగుతుంది. Zee5 ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Read Also : రివేంజ్ తీర్చుకోవడానికి వెళ్ళి అడ్డంగా ఇలా బుక్కయ్యారేంటి భయ్యా ? ఒళ్లు గగుర్పొడిచే సీన్స్

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×