E-Paper
Advertisement

భారీగా తగ్గిన iPhone 17 Pro ధర.. కొత్త మోడల్ వచ్చేలోపు దీన్ని తీసుకోవడం మంచిదేనా?

భారీగా తగ్గిన iPhone 17 Pro ధర.. కొత్త మోడల్ వచ్చేలోపు దీన్ని తీసుకోవడం మంచిదేనా?
Advertisement

iPhone 17 Pro Price Drop: ఐఫోన్ కొనాలని ఎప్పటి నుంచో చూస్తున్నారా? అయితే ఇప్పుడు మీకొక చిన్న టెన్షన్ కూడా మొదలై ఉండొచ్చు. ఒకవైపు ఐఫోన్ 17 ప్రో ధర తగ్గి ఆకర్షిస్తోంది.. మరోవైపు ఐఫోన్ 18 ప్రో త్వరలో రాబోతుందనే వార్తలు ఆసక్తిని పెంచుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో చేతిలో ఉన్న డబ్బులతో 17 ప్రో కొనడం తెలివైన నిర్ణయమా? లేక ఇంకొన్ని రోజులు ఆగి 18 ప్రో కోసం చూడటమే మంచిదా? ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో లభిస్తున్న ఆఫర్లను చూస్తే 17 ప్రోపై ఆసక్తి పెరగడం ఖాయం.

ఐఫోన్ 17 ప్రో 256GB వేరియంట్ ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో రూ.1,29,590కి లభిస్తోంది. దీని లాంచ్ ధర రూ.1,34,900 కావడంతో ఇప్పటికే దాదాపు రూ.5,000 వరకు ధర తగ్గింది. దీనిని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే మరో రూ.6,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ధర సుమారు రూ.1,23,590కి తగ్గుతుంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే మరింత తగ్గే అవకాశం ఉంది.

Advertisement

Also Read: యాపిల్ వాచ్‌లలో ఈసారి కేక పుట్టించే అప్‌గ్రేడ్లు.. సిరీస్ 12, అల్ట్రా 4లో ఏం మారనుందంటే?

ధర తగ్గినా ఐఫోన్ 17 ప్రో ఫ్లాగ్‌షిప్ ఫీచర్ల విషయంలో వెనక్కి తగ్గలేదు. 6.3 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. A19 ప్రో చిప్ ఫోన్‌కు మంచి పనితీరును అందిస్తుంది. వెనుక మూడు 48MP కెమెరాలు, ముందు 18MP కెమెరా ఉన్నాయి. ఐపీ68 రేటింగ్ కూడా లభిస్తుంది.

Advertisement

ఐఫోన్ 18 ప్రోపై ఇప్పటికే టెక్ మార్కెట్లో అంచనాలు పెరిగాయి. వేరియబుల్ అపర్చర్ కెమెరా, దాదాపు 5000mAh బ్యాటరీ, వేపర్ చాంబర్ కూలింగ్, కొత్త A20 ప్రో చిప్ వంటి అప్‌గ్రేడ్లు రావచ్చనే ప్రచారం ఉంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం అంచనాలే. కొత్త మోడల్ ధర మాత్రం 17 ప్రో కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

మీరు గనుక వెంటనే కొత్త ఐఫోన్ కొనాలనుకుంటే ప్రస్తుత 17 ప్రో డీల్‌ను పరిశీలించొచ్చు. ముఖ్యంగా రూ.1.23 లక్షల పరిధిలో లభిస్తే ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోరుకునేవారికి ఇది మంచి అవకాశం. అయితే కొత్త టెక్నాలజీ కోసం ఎదురుచూడగలిగితే 18 ప్రో వచ్చే వరకు ఆగడం కూడా మంచిదే.మొత్తానికి మీ అవసరం, బడ్జెట్‌ను బట్టి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

Also Read: టాప్ లెవెల్ ఫీచర్లతో Huawei FreeBuds 7 లాంఛ్.. ఏఐ కాలింగ్, 42 గంటల బ్యాటరీ ప్రత్యేకత!

Tags

Related News

టాప్ లెవెల్ ఫీచర్లతో Huawei FreeBuds 7 లాంఛ్.. ఏఐ కాలింగ్, 42 గంటల బ్యాటరీ ప్రత్యేకత!

రూ.1500కే కింగ్ వాయిస్ ఫీచర్‌తో itel Tough ఫోన్ లాంచ్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

గార్మిన్ నుంచి అద్భుతమైన స్మార్ట్ రింగ్.. పది వేర్వేరు సైజుల్లో లాంచ్‌కు సిద్ధం!

iPhone Duo కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.. కానీ చేతికి అందాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే?!

యాపిల్ వాచ్‌లలో ఈసారి కేక పుట్టించే అప్‌గ్రేడ్లు.. సిరీస్ 12, అల్ట్రా 4లో ఏం మారనుందంటే?

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న 80s లుక్ ట్రెండ్.. ChatGPTలో ఈ ప్రాంప్ట్‌ తో మీ ఫోటోనూ మార్చుకోండిలా!

ఫోన్ ఛార్జర్‌పై Qi గుర్తు ఎందుకు ఉంటుంది? దీని వెనుక ఇంత అర్థం ఉందా!

Big Stories

Advertisement
×