E-Paper
Advertisement

ప్రమోషన్ కోసం బ్లాక్‌ మెయిల్… ఓటీటీలో టాప్ లేపుతున్న క్రేజీ థ్రిల్లర్

ప్రమోషన్ కోసం బ్లాక్‌ మెయిల్… ఓటీటీలో టాప్ లేపుతున్న క్రేజీ థ్రిల్లర్
Advertisement

Dark Comedy OTT : ఎమ్మీ అవార్డు గెలుచుకున్న డార్క్ కామెడీ థ్రిల్లర్ సిరీస్ ‘బీఫ్’ (Beef) సీజన్ 2 ఓటీటీలో సందడి చేస్తోంది. ఐయండిబిలో దీనికి ఎనిమిదికి పైగా రేటింగ్ ఉందంటే సిరీస్ లో ఎంత దమ్ము ఉందో తెలుస్తోంది. 2023 లో వచ్చిన మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే వాటిని ఏమాత్రం తక్కువ చేయలేదు సీజన్ 2. ఇప్పుడు ఓటీటీలో తెగ చూస్తున్నారు ఈ సిరీస్ ని. ఒకరి మీద ఒకరు పంతానికి పోయి, తమ జీవితాలను తామే ఎలా ఆగం చేసుకున్నారనేది ఈ కథ. ఇందులో సెంటిమెంట్లు ఉండవు, కేవలం కక్షలు, పంతాలు, ఒకరి మీద ఒకరు పడి ఏడవడం మాత్రమే ఉంటుంది. మొదటి సీజన్ లాగే ఇందులో కూడా ప్రతి ఎపిసోడ్ లో ఊహించని మలుపులు ఉండి, చూసేవాళ్లకు పిచ్చెక్కించేస్తుంది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్ ‘బీఫ్’ (Beef) రెండవ సీజన్ 2026 ఏప్రిల్ 16 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి సీజన్‌లో రోడ్డు ప్రమాదం నేపథ్యంలో గొడవ జరిగితే, ఈ రెండో సీజన్ పూర్తిగా కొత్త కథతో, కొత్త నటీనటులతో ఒక విలాసవంతమైన కంట్రీ క్లబ్ నేపథ్యంలో సాగుతుంది. దీనిని ‘లీ సంగ్ జిన్’ సృష్టించగా ప్రముఖ నిర్మాణ సంస్థ A24 నిర్మించింది. ఈ సీజన్ మొత్తం 8 ఎపిసోడ్లుగా రూపొందింది. ఇందులో హాలీవుడ్ ప్రముఖులు ఆస్కార్ ఐజాక్, కేరీ ముల్లిగాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. వారితో పాటు ‘మినాకి’ సినిమాతో ఆస్కార్ గెలుచుకున్న కొరియన్ నటి యూన్ యు-జంగ్, ‘పారాసైట్’ హీరో సాంగ్ కాంగ్-హో కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. విమర్శకుల నుండి ఈ సీజన్‌కు భారీ ప్రశంసలు దక్కుతున్నాయి, ముఖ్యంగా నటీనటుల పెర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్లే సినిమా స్థాయికి తగ్గకుండా ఉన్నాయని రివ్యూలు వస్తున్నాయి.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ ఒక విలాసవంతమైన కంట్రీ క్లబ్‌లో పనిచేసే ఆస్టిన్, యాష్లే అనే ఒక జంట చుట్టూ తిరుగుతుంది. ఒకరోజు వాళ్ళ బాస్, అతని భార్య మధ్య జరిగిన ఒక భయంకరమైన గొడవను వీళ్ళు అనుకోకుండా చూసి రికార్డ్ చేస్తారు. ఆ గొడవను ఆసరాగా చేసుకుని పైకి రావాలని వీళ్ళు ప్రయత్నించగా, అది కాస్తా పెద్ద యుద్ధానికి దారితీస్తుంది. ఒక చిన్న సంఘటన కాస్తా ఒకరి జీవితాన్ని ఒకరు నాశనం చేసుకునే స్థాయికి వెళ్తుంది. ఆ కంట్రీ క్లబ్ యజమాని అయిన ఒక కొరియన్ కోటీశ్వరురాలు కూడా ఈ గొడవలోకి రావడంతో పరిస్థితి మరింత క్రిటికల్ గా మారుతుంది. యజమాని దంపతులు ఒకవైపు, ఈ జంట ఒకవైపు చేరి ఒకరి రహస్యాలను ఒకరు బయటపెట్టుకుంటూ, ఒకరినొకరు బ్లాక్‌మెయిల్ చేసుకోవడం మొదలుపెడతారు. మనుషుల మధ్య ఉండే ఈగో క్లాస్ డిఫరెన్సెస్ వల్ల ఈ గొడవ ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో ఈ సీజన్ చూపిస్తుంది. చివరికి ఈ పంతాలు, పట్టింపులు అందరి జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయో, ఈ కథ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. మొదటి సీజన్ లాగే ఇందులో కూడా ప్రతి మలుపు ఉత్కంఠభరితంగా ఉంటుంది.

Read Also : ఇంట్లో ఇల్లాలు ఆఫీస్ లో ప్రియురాలు… మైండ్ బెండింగ్ ట్విస్టులతో అదరగొడుతున్న సిరీస్

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×