E-Paper
Advertisement

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 19: ఆ రాశి వ్యాపారులకు లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 19: ఆ రాశి వ్యాపారులకు లాభాలు
Advertisement

Today Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన  ఏఫ్రిల్ 19వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మిత్రుల నుండి కొంత ఆసక్తి సమాచారం అందుతుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.  అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. 

వృషభం

Advertisement

ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆదాయమార్గాలు పెరుగుతాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో సకాలంలో నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. 

మిథునం

నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఆప్తుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు. 

కర్కాటకం

Advertisement

దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి సహాయం అందక ఇబ్బంది పడతారు. పాత ఋణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

సింహం

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలలో శ్రమ అధికమవుతుంది. రావలసిన ధనం సకాలంలో అందక నిరాశ కలుగుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. 

కన్య

సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. స్ధిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఉపయోగపడతాయి. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమౌతాయి. బంధు మిత్రులతో వివాదాలు తీరుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు.

వృశ్చికం

సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పెరుగుతాయి. ధన పరంగా ఒడిదుడుకులు అధికమౌతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగపరంగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక మానసిక సమస్యలు కలుగుతాయి. 

ధనుస్సు

నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రశాంతత కోసం దైవదర్శనం చేసుకోవడం మంచిది. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.  

మకరం

సమాజంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వివాదాలకు సంబంధించి సన్నిహితులు నుండి కీలక సమాచారం అందుతుంది. నూతన వస్తు లాభాలు పొందుతారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. 

కుంభం

బంధు మిత్రుల మాటలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. అధిక శ్రమతో గాని పనులు పూర్తి కావు. ఇంటాబయట పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు కలిగే సూచనలున్నవి. ఉద్యోగాలలో అధికారులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.

మీనం

పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలను ఆచరణలో పెడతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు.  వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×