E-Paper
Advertisement

ప్రెగ్నెన్సీ తెచ్చిన పెద్ద చిక్కు… పైసా కోసం పడరాని పాట్లు… ఓటీటీలో తెగ నవ్విస్తున్న కామెడీ సిరీస్

ప్రెగ్నెన్సీ తెచ్చిన పెద్ద చిక్కు… పైసా కోసం పడరాని పాట్లు… ఓటీటీలో తెగ నవ్విస్తున్న కామెడీ సిరీస్
Advertisement

Comedy Series OTT : ఓటీటీలోకి ఒక కొత్త కంటెంట్ తో సరికొత్త కామెడీ సిరీస్ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ప్రెగ్నెన్సీ తో కష్టాలు తెచ్చుకునే ఒక అమ్మాయి చుట్టూ కథ కామెడీగా ఉంటుంది. ఇది ఒక పైసా వసూల్ సిరీస్ లాంటిది. అంటే ఇందులో సెంటిమెంట్ ఉంటుంది, సరదా ఉంటుంది. అలానే ఇంటర్నెట్ ప్రపంచంలో ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఫేమస్ అయిపోతున్నారు.. దాని వల్ల వచ్చే తలనెప్పులు ఏంటి అనేది పక్కాగా చూపిస్తారు ఇందులో. దీనికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఆపిల్ టీవీ (Apple TV)లో స్ట్రీమింగ్

ఈ అమెరికన్ కామెడీ డ్రామా టెలివిజన్ సిరీస్ పేరు ‘మార్గోస్ గాట్ మనీ ట్రబుల్స్’ (Margo’s Got Money Troubles). ఇందులో ఎల్లే ఫ్యానింగ్, నికోల్ కిడ్మాన్, మిషెల్ ఫైఫర్, నిక్ ఆఫర్‌మాన్, మైఖేల్ అంగారానో, థాడియా గ్రాహం, గ్రెగ్ కిన్నియర్ నటించారు. ఈ సిరీస్‌ను ప్రముఖ A24 స్టూడియో నిర్మించింది. దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా హాలీవుడ్ స్టార్ నటీమణులు నికోల్ కిడ్మాన్, ఎల్ ఫానింగ్‌లు స్వయంగా వ్యవహరించడం విశేషం. అంతేకాకుండా దీనికి దర్శకత్వం వహించిన వారిలో ‘లోకీ’ సిరీస్ ఫేమ్ కేట్ హెరాన్, ‘సెక్స్ ఎడ్యుకేషన్’ దర్శకురాలు అలిస్ సీబ్రైట్ వంటి దిగ్గజాలు ఉన్నారు, అందుకే ఈ సిరీస్ విజువల్స్, కథనం చాలా కొత్తగా ఉంటాయి. ఈ సిరీస్ 2026 ఏప్రిల్ 15 నుంచి ఆపిల్ టీవీ(Apple TV)లో స్ట్రీమింగ్ అవుతోంది. 8 ఎపిసోడ్లతో సాగే ఈ సిరీస్ మూడు ఎపిసోడ్లతో ఓటీటీలో అడుగుపెట్టింది. ప్రతి బుధవారం ఒక కొత్త ఎపిసోడ్ చొప్పున మే 20 వరకు మిగతావి అందుబాటులోకి వస్తాయి.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

మార్కో మిల్లెట్ అనే ఒక కాలేజీ అమ్మాయి, తన ఇంగ్లీష్ ప్రొఫెసర్‌తో ప్రేమలో పడి గర్భవతి అవుతుంది. ఆ తర్వాత ఆమె ఒంటరిది అయిపోతుంది. చేతిలో డబ్బులు లేక, పసి బిడ్డను సాకడం భారమైపోయి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. జీవితం అగమ్యగోచరంగా ఉన్న సమయంలో ఆమెకు ఏం చేయాలో అర్థం కాదు. ఈ కష్ట సమయంలో ఆమె తన తండ్రి జింక్స్‌ను సాయం కోరుతుంది. ఆయన ఒకప్పుడు ప్రొఫెషనల్ రెజ్లర్. తన తండ్రికి రెజ్లింగ్ ప్రపంచంలో ఉన్న అనుభవాన్ని, ఆ డ్రామాను మార్కో తన ‘ఓన్లీ ఫ్యాన్స్’ అనే ఆన్లైన్ ఖాతాలో పంచుకుంటుంది. తన తండ్రి ఇచ్చే సలహాలతో ఆమె ఆ ప్లాట్‌ ఫామ్‌లో విపరీతమైన గుర్తింపు తెచ్చుకుని, ఆర్థికంగా స్థిరపడుతుంది.
అయితే డబ్బుతో పాటు సోషల్ మీడియాలో వచ్చే పాపులారిటీ ఆమె జీవితంలో కొత్త సమస్యలను తెస్తుంది. ఇంటర్నెట్ ప్రపంచంలో పేరు రావడం వల్ల తన వ్యక్తిగత జీవితం, గౌరవం ఎలా దెబ్బతిన్నాయి? ఆ ఒత్తిడిని ఆమె ఎలా తట్టుకుంది? అనే విషయాలతో ఈ సిరీస్ ఎమోషనల్ గా, కామెడీగా సాగుతుంది.

Read Also : ఆమె చూపు పడితే నాశనమే… ప్రేమిస్తే చావు మేళం పక్కా… భయపెడుతున్న హారర్ మూవీ

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×